దేవునినుండి వచ్చిన జ్ఞానం అనేక ప్రశ్నలకు జవాబుల్నిస్తోంది
1 సత్యాన్ని గూర్చిన కచ్చితమైన జ్ఞానాన్ని మీరు తెల్సుకోవడానికి మునుపు, జీవితాన్ని గూర్చి అనేక ప్రశ్నలు బహుశా మీకుండివుండొచ్చు. వాటికి మీరు జవాబుల్ని ఇవ్వలేకపోయి ఉండొచ్చు. ఆ ప్రశ్నలకు బైబిలు ఆధారిత జవాబుల్ని పొందినందుకు మీరెంత సంతోషించి ఉంటారో కదా! అలాంటి జవాబుల్నే ఇతరులు పొందేలా సహాయంచేసే స్థితిలో మీరు ఇప్పుడున్నారు. (2 తిమోతి 2:2, పోల్చండి.) మీరు నిత్యజీవానికి నడిపించే దేవుని గూర్చిన జ్ఞానాన్ని వారితో పంచుకోగలరు. (యోహా. 17:3) కానీ ఈ జ్ఞానవిలువను గుణగ్రహించేలా మీరు ఒకనికెలా సహాయపడగలరు? సత్యం మీకు జవాబుల్నిచ్చిన ప్రశ్నల్ని గురించి ఆలోచించండి. సత్యాన్వేషకులు దేన్నిగురించి తెల్సుకోవాలని కోరుకుంటారు? ఈ విధంగా ఆలోచించడం, నిత్యజీవానికి నడిపించే జ్ఞానము పుస్తకాన్ని ప్రతిపాదించేందుకు మీకు సహాయపడగలదు. జూన్ నెలలో సాక్ష్యమివ్వడానికి సిద్ధపడుతుండగా ఈ క్రిందనున్న సలహాలు మీకు తోడ్పడవచ్చు.
2 ప్రపంచంలో ఎందుకింత బాధవుందాయని అనేకమంది ప్రజలు విచారిస్తుంటారు గనుక మీరిలా చెప్పడంద్వారా మంచి ప్రతిస్పందన పొందొచ్చు:
◼ “విపత్తు సంభవించినప్పుడు లేక హింసాత్మకమైన చర్యలూ, నేరాలూ పెరిగిపోతున్నప్పుడు, ఎందుకిన్ని భయానకమైన సంఘటనలు జరుగుతున్నాయని ప్రజలు తరచూ అడుగుతారు. మీరేమని జవాబిస్తారు?” కాస్సేపాగి, ఆ వ్యక్తి ప్రతిస్పందనను గుర్తించండి. తర్వాత జ్ఞానము పుస్తకంలో 8వ అధ్యాయంవైపుకి త్రిప్పి, 2వ పేరాలో చెప్పబడిన దానివైపుకు అవధానాన్ని మళ్లించండి. చెడు సంఘటనలు ఎందుకు జరుగుతున్నాయన్న దానికి బైబిలు ఇచ్చే వివరణల్ని ఈ పుస్తకం తెలియజేస్తోందని వివరించండి. పుస్తకాన్ని ప్రతిపాదించండి, కానీ మీరు పుస్తకాల్ని పంచిపెట్టడంలో మాత్రమే ఆసక్తి కల్గిలేరనీ, వాటిని అర్థం చేసుకునేందుకు ప్రజలకు తోడ్పడ్డంలో కూడా ఆసక్తిని కల్గివున్నారనీ వివరించండి. పునర్దర్శనానికి ఏర్పాటు చేయండి.
3 మీరు “జ్ఞానము” పుస్తకాన్ని ఇచ్చినచోటుకు తిరిగి వెళ్లినప్పుడు, మీరిలా చెప్పవచ్చు:
◼ “ప్రపంచంలో ఎందుకింత బాధవుందనే విషయంలో చివరకు మీరొచ్చిన అభిప్రాయంపై నేను శ్రద్ధ చూపిస్తున్నాను. ఆ పుస్తకంలోవున్న బైబిలు ఇచ్చే జవాబుతో మీరు ఏకీభవిస్తున్నారా?” ప్రతిస్పందించనివ్వండి. జ్ఞానము పుస్తకంలో 77వ పేజీలోవున్న 17వ పేరాను చదివి, రోమీయులు 9:14 వచనాన్ని తన స్వంత బైబిల్లోనుండి చదవమని ఆ గృహస్థున్ని ఆహ్వానించండి. తర్వాత ఇలా చెప్పండి: “మంచివార్త ఏంటంటే, దేవుడు అకారణంగా మనల్ని వేదనా బాధలకు గురిచెయ్యకపోవడమే. సంతోష సమాధానాలతోవున్న నిత్యజీవాన్ని మనకు ఇస్తానని ఆయన వాగ్దానం చేశాడు. ఈ పుస్తకంలోని మొదటి అధ్యాయం, ‘మీరు సంతోషకరమైన భవిష్యత్తును కలిగివుండవచ్చు!’ అనే పేరును కల్గివుంది. మరి ఇది మీకూ, మీరు ప్రేమించేవారికీ ఎలా నిజం కాగలదో నేను మీకు వివరించాలని అనుకుంటున్నాను.” అధ్యాయం 1 వైపుకు త్రిప్పి, మనం పఠనంచేసే విధానాన్ని ప్రదర్శించి చూపండి. పరిస్థితుల్నిబట్టి ఆ అధ్యాయంలో ఎంతవరకు చేయడం యుక్తంగా ఉంటుందో అంతవరకూ చేయండి.
4 “బైబిలు చర్చలను ప్రారంభించి వాటినెలా కొనసాగించవలెను” అనే చిన్నపుస్తకంలో 6వ పేజీలో “వృద్ధాప్యము/మరణము” అనే ఉపశీర్షిక క్రింద కన్పించే ఉపోద్ఘాతాన్ని ఉపయోగించేందుకు మీరు ఎంపిక చేసుకోవచ్చు:
◼ “మరణమే ఇక ముగింపా? లేక మరణం తర్వాత ఇంకేమైనా ఉందా అని మీరెప్పుడైనా అడిగారా? [ప్రతిస్పందించనివ్వండి.] మరణాన్ని గూర్చిన ఎలాంటి సందేహాన్నైనా బైబిలు తీరుస్తుంది. [ప్రసంగి 9:5, 10 వచనాలు చదవండి.] ఆలాగే అది విశ్వాసులైన వ్యక్తులకు నిజమైన నిరీక్షణవుందని కూడా చూపిస్తుంది. [జ్ఞానము పుస్తకంలో 84వ పేజీనందున్న 13వ పేరావైపు త్రిప్పండి; యోహాను 11:25 వచనంలోవున్న యేసు మాటల్ని చదివి, వివరించండి.] ‘మరణించిన మన ప్రియమైనవారికి ఏమి సంభవిస్తుంది?’ అనే ప్రశ్నకు జవాబును ఇచ్చేందుకు ఈ అధ్యాయమంతా కేటాయించబడింది. జీవితాన్ని గూర్చీ, భవిష్యత్తును గూర్చీ ప్రజలడిగే అనేక ప్రశ్నలకు ఈ పుస్తకంలోని వేరే అధ్యాయాలు జవాబిస్తాయి.” పుస్తకాన్ని ప్రతిపాదించండి.
5 పునర్దర్శనాన్ని చేస్తున్నప్పుడు, మీరు పరిచయాన్ని సంభాషణలోకి పునరుద్ధరించి, అటుతర్వాత ఇలా చెప్పవచ్చు:
◼ “క్రిందటిసారి మనం ఓ వ్యక్తి మరణించినప్పుడు అతనికేం సంభవిస్తుందనే విషయాన్ని గూర్చి మాట్లాడుకున్నాం. అనేకమంది పునర్జన్ముందనీ లేక పరలోకంలోనో లేక నరకంలోనో మరణానంతరం జీవిస్తామనీ విశ్వసిస్తారు. కానీ మృతులు ఇదే భూమిపై తిరిగిలేపబడే సాధ్యతను గురించి మీరెప్పుడైనా ఆలోచించారా? [ప్రతిస్పందించనివ్వండి.] బైబిలు ప్రకారంగా, భూమిని స్వతంత్రించుకునే దీనుల్లో పునరుత్థానులైన వ్యక్తులు ఉంటారు. [కీర్తన 37:11, 29 వచనాలు చదివి, తర్వాత జ్ఞానము పుస్తకంలో 88వ పేజీనందున్న 20వ పేరాను చర్చించండి.] ఆ నిరీక్షణ, మరణ భయంతో జీవించిన లక్షలాదిమంది ప్రజలకు ఓదార్పును ఇచ్చింది. ఆ విషయాన్ని బాగా అర్థంచేసుకోవడానికి ఈ పుస్తకం మీకు సహాయపడుతుంది. ఎలా సహాయపడుతుందో నేను మీకు ప్రదర్శించి చూపనా?”
6 మీరు సరళంగా చెప్పాలనుకుంటే మీరీ క్రింది విధంగా ప్రయత్నించవచ్చు:
◼ “నిత్యజీవానికి నడిపించే జ్ఞానము పుస్తకంలోవున్న ఓ చిత్రాన్ని నేను మీకు చూపించడానికి ఇష్టపడుతున్నాను. ఈ చిత్రమెంత బాగుందో కదండీ?” గృహస్థుడు 4-5 పేజీల్ని చూడగలిగేలా పుస్తకాన్ని తెరవండి. అతని ప్రతిస్పందన కోసం కాసేపు ఆగండి. తర్వాత 5వ పేజీలోవున్న మాటల్ని చదవండి. “మీరు చదువుకోడానికి ఈ పుస్తకాన్ని తీసుకోవచ్చు. దీన్ని మేము 20 రూ. చందాకు పంచిపెడుతున్నాము” అని అంటూ మీరు ముగించవచ్చు. ఆసక్తి కన్పించినట్లైతే పునర్దర్శించడానికి ఎప్పుడు వీలవుతుందో కనుక్కోండి.
7 జీవితపు ప్రాముఖ్యమైన ప్రశ్నలకు జవాబుల్నిచ్చే దేవున్నుండి వచ్చిన జ్ఞానాన్ని మనం కల్గివున్నాం. ఆసక్తికరంగా ఉండేలా సిద్ధపడండి, సత్యాన్ని అన్వేషిస్తున్నవారితో జీవాన్ని అనుగ్రహించే ఈ సమాచారాన్ని పంచుకునేందుకు చేసే మీ ప్రయత్నాల్ని యెహోవా తప్పక ఆశీర్వదిస్తాడు.