కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 5/97 పేజీ 1
  • యేసును ఎడతెగక అనుసరించండి

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • యేసును ఎడతెగక అనుసరించండి
  • మన రాజ్య పరిచర్య—1997
  • ఇలాంటి మరితర సమాచారం
  • స్వయంత్యాగ స్ఫూర్తితో యెహోవాను సేవించుట
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1993
  • మనం మన కోసమే జీవించకుండా ఉండడం
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2005
  • ప్రశ్నా భాగము
    మన రాజ్య పరిచర్య—1993
  • కావలెను—4,000 మంది సహాయ పయినీర్లు
    మన రాజ్య పరిచర్య—1997
మరిన్ని
మన రాజ్య పరిచర్య—1997
km 5/97 పేజీ 1

యేసును ఎడతెగక అనుసరించండి

1 ఒక సందర్భంలో యేసు ఇలా అన్నాడు: “ఎవరైనా నన్ను వెంబడించాలని కోరుకున్నట్లైతే, తనను తాను ఉపేక్షించుకొని, తన హింసా కొయ్యను ఎత్తుకొని నన్ను ఎడతెగక అనుసరించాలి.” (మత్త. 16:24, NW) యేసు మాటలకు చురుకుగా ప్రతిస్పందించాలని మనం నిశ్చయంగా కోరుకుంటాము. ఆయన ఆహ్వానంలోని ప్రతి వాక్యంలోనూ ఏమి ఇమిడివుందో మనం పరిశీలిద్దాము.

2 “తనను తాను ఉపేక్షించుకొని”: మనం మన జీవితాలను యెహోవాకు సమర్పించుకున్నప్పుడు మనల్ని మనం ఉపేక్షించుకుంటాము. “ఉపేక్షించుకొని” అని అనువదించబడిన గ్రీకు పదానికి “లేదు అని చెప్పడం” అని మూల అర్థం. యెహోవాను నిరంతరం ప్రీతిపర్చాలని నిర్ధారించుకుని, స్వచ్ఛందంగా మనం మన స్వంత అభీష్టాల్నీ, కోరికల్నీ, సౌకర్యాల్నీ, స్వార్థపూరితమైన సౌఖ్యాల్నీ వదులుకుంటామని దానర్థం.—రోమా. 14:8; 15:3.

3 “తన హింసా కొయ్యను ఎత్తుకొని”: క్రైస్తవ జీవితం, యెహోవాకు త్యాగపూరితమైన సేవ అనే హింసా కొయ్యను మోయాల్సిన జీవితం. స్వయంత్యాగపూరిత స్ఫూర్తిని ప్రతిఫలించడానికి పరిచర్యలో శ్రమించడం ఒక మార్గం. ఈ సంవత్సరంలో ఇప్పటివరకూ, చాలామంది ప్రచారకులు సహాయ పయినీరు పనిలో ఆనందాన్ని అనుభవిస్తున్నారు. బహుశ మీరూ వారిలో ఒకరైవుండవచ్చు, చేసిన త్యాగాలకన్నా ఎక్కువగా మీరు ఆశీర్వాదాలను పొందుతున్నారని మీరు స్థిరంగా చెప్పవచ్చు. సహాయ పయినీర్లుగా సేవ చేయలేనివారు సంఘ ప్రచారకులుగా ప్రకటనాపనిలో మరింత ఎక్కువ సమయం గడపడానికి తరచూ ఏర్పాట్లు చేసుకున్నారు. ఆ లక్ష్యాన్ని మనస్సులో ఉంచుకుని, కొన్ని సంఘాలు ప్రాంతీయ పరిచర్య కొరకైన తమ కూటాలను తామింతకు ముందు జరుపుకునే సమయానికన్నా కొంచెం ముందుగా జరుపుకోవడానికి షెడ్యూలు వేసుకుంటున్నాయి. ప్రత్యేకంగా వేసవిలో చాలామంది ప్రచారకులు ప్రాంతీయ సేవను త్వరగా ప్రారంభించడాన్ని అనుమతించేలా ఎక్కువ సమయం దొరకడాన్ని ఇష్టపడ్డారు. ‘ఇంకొక్క ఇంట్లో’ మాట్లాడదామనో లేక ‘ఇంకొద్ది నిమిషాలు’ పని చేద్దామనో నిర్ణయించుకున్నప్పుడు కొంతమందికి అద్భుతమైన ఫలితాలు దక్కాయి కూడా.

4 స్వయంత్యాగపూరిత స్ఫూర్తిని ప్రదర్శించడానికి వ్యక్తిగత లక్ష్యాలను ఏర్పర్చుకోవడం మరొక మార్గం. జాగ్రత్తగా పథకం వేసుకోవడం ద్వారా, తమ షెడ్యూలులో సర్దుబాట్లు చేసుకోవడం ద్వారా కొంతమంది క్రమ పయినీర్లయ్యారు. బేతేలులో పనిచేయడానికిగాను లేక మిషనరీ సేవను చేయడానికిగాను ఇతరులు తమ కార్యకలాపాలను సరిచేసుకోగల్గారు. కొంతమంది రాజ్య ప్రచారకుల అవసరత ఎక్కువగా ఉన్న ప్రాంతాలకు మారారు.

5 “నన్ను ఎడతెగక అనుసరించాలి”: యేసు శిష్యులు ఎన్నో పరీక్షలను ఎదుర్కొన్నా, పరిచర్యలో ఆయన చూపిన ఉత్సాహమూ సహనాలనుబట్టి ప్రోత్సాహాన్ని పొందారు. (యోహా. 4:34) ఆయన తమతో కల్సి ఉండడంవల్లా, ఆయన సందేశంవల్లా తాము నూతనోత్తేజాన్ని పొందినట్లుగా వారు భావించారు. అందుకనే ఆయనను అనుసరించినవారు నిజమైన ఆనందంతో వెలిగిపోయారు. (మత్త. 11:29) మనం కూడా అదేవిధంగా అన్నింటికన్నా ప్రాముఖ్యమైన రాజ్య ప్రకటనా పనిలోనూ, శిష్యులను చేసే పనిలోనూ కొనసాగడానికి ఒకరినొకరం ప్రోత్సహించుకుందాము.

6 మనం స్వయంత్యాగపూరిత స్ఫూర్తిని పెంపొందించుకోవడంద్వారా తనను ఎడతెగక అనుసరించమని యేసు ఇచ్చిన ఆహ్వానానికి మనమందరం చురుకుగా ప్రతిస్పందిద్దాము. మనమలా చేస్తుండగా ఇప్పుడు గొప్ప సంతోషాన్ని పొందుతాము, భవిష్యత్తులో మరిన్ని గొప్ప ఆశీర్వాదాల కొరకు ఎదురు చూడగలము.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి