సాహిత్య ప్రతిపాదనలు
ఏప్రిల్, మే: కావలికోట లేక తేజరిల్లు! పత్రికల చందాలు. పక్షపత్రికలకు వార్షిక చందా రూ. 90.00. మాస పత్రికలకు వార్షిక చందా, పక్షపత్రికలకు ఆరు నెలల చందా రూ. 45.00. మాస పత్రికలకు ఆరు నెలల చందా లేదు. చందా కట్టనట్లైతే, విడిపత్రికలను ఒక్కొక్క దానినీ రూ. 4.00కు ప్రతిపాదించాలి. అనువైన చోట దేవుడు మన నుండి ఏమి కోరుతున్నాడు? అనే బ్రోషూరును రూ. 6.00 చందాకు అందించవచ్చు.
కావలికోట పత్రిక పంజాబీ, ఉర్దూ భాషల్లో (ఈ భాషల్లో ఇది మాసపత్రిక) మినహా మిగిలిన అన్ని భారతీయ భాషల్లోనూ నేపాలీ భాషలోనూ పక్షపత్రిక అనే విషయాన్ని చందాలు కట్టిస్తున్నప్పుడు దయచేసి గుర్తుంచుకోండి.
తేజరిల్లు! పత్రిక మలయాళం, తమిళ భాషల్లో పక్షపత్రిక, కానీ కన్నడ, గుజరాతీ, తెలుగు, నేపాలీ, మరాఠీ, హిందీ భాషల్లో మాసపత్రిక. పంపిణీదారుల త్రైమాసిక తేజరిల్లు! ప్రతులు ఉర్దూ, పంజాబీ, బెంగాలీ భాషల్లో సంఘాలకు లభ్యమౌతాయి, కానీ ఈ మూడు భాషల్లోనూ విడి చందాలు స్వీకరించబడవు.
జూన్: నిత్యజీవానికి నడిపించే జ్ఞానము అనే పుస్తకాన్ని రూ. 20.00 చందాకు ప్రతిపాదించండి. గృహ బైబిలు పఠనాల్ని ప్రారంభించేందుకు ప్రయత్నించడంలో శ్రద్ధను కనపర్చండి.
జూలై, ఆగస్టు: ఈ కింద ఇవ్వబడిన 32-పేజీల బ్రొషూర్లలో దేన్నైనా రూ. 6.00 చందాకు అందించవచ్చు: దేవుడు నిజంగా మనయెడల శ్రద్ధ కల్గివున్నాడా?, భూమిపై నిరంతర జీవితమును అనుభవించుము!, “ఇదిగో! నేను సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నాను”, మన సమస్యలు వాటిని పరిష్కరించుటకు ఎవరు సహాయము చేయుదురు?, త్రిత్వమును మీరు నమ్మవలయునా?, నిరంతరము నిలిచే దైవిక నామము, జీవిత సంకల్పమేమిటి—మీరు దానినెలా తెలిసికోగలరు?, దేవుడు మన నుండి ఏమి కోరుతున్నాడు?, మీరు ప్రేమిస్తున్నవారెవరైనా చనిపోతే . . .
గమనిక: పైన పేర్కొన్న ప్రచార సాహిత్యాల్లో వేటినైనా ఇంతవరకూ రిక్వెస్ట్ చేయని సంఘాలు, తమ తరువాతి లిటరేచర్ రిక్వెస్ట్ ఫారమ్‌నందు రిక్వెస్ట్ చేయాలి.