కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 2/97 పేజీ 2
  • ఫిబ్రవరిలోని సేవా కూటాలు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ఫిబ్రవరిలోని సేవా కూటాలు
  • మన రాజ్య పరిచర్య—1997
  • ఉపశీర్షికలు
  • ఫిబ్రవరి 3తో ప్రారంభమయ్యే వారం
  • ఫిబ్రవరి 10తో ప్రారంభమయ్యే వారం
  • ఫిబ్రవరి 17తో ప్రారంభమయ్యే వారం
  • ఫిబ్రవరి 24తో ప్రారంభమయ్యే వారం
మన రాజ్య పరిచర్య—1997
km 2/97 పేజీ 2

ఫిబ్రవరిలోని సేవా కూటాలు

ఫిబ్రవరి 3తో ప్రారంభమయ్యే వారం

పాట 27 (7)

10 నిమి: స్థానిక ప్రకటనలు. మన రాజ్య పరిచర్య నుండి ఎన్నుకున్న ప్రకటనలు. “క్రొత్త ప్రత్యేక సమావేశ దిన కార్యక్రమము” అనే శీర్షికను ప్రేక్షకులతో చర్చించండి.

15 నిమి: “ఎన్నటికీ పునరావృతంకాని పనిలో భాగం వహించండి.” ప్రశ్నా జవాబులు. సమయం అనుమతించినట్లైతే ప్రచారకులు (ఆంగ్లం) పుస్తకమందు 714-15 పేజీల్లో ఉన్న “మెలకువగా ఉండడం—ఎలా?” అన్న అంశంలోని విషయాలను చేర్చండి.

20 నిమి: “అత్యవసర భావంతో సువార్తను అందించడం.” (1-5 పేరాలు) మొదటి పేరాపై క్లుప్తంగా వ్యాఖ్యానించిన తర్వాత, ఇద్దరు లేక ముగ్గురు ప్రచారకులతో ప్రసంగీకుడు 2-5 పేరాలను చర్చిస్తాడు. ఇవ్వబడిన అందింపుల్లోని ఉన్నతాంశాలను వారు పునఃసమీక్షించి ఈ అందింపులూ లేక ఇలాంటి అందింపులు ఆ ప్రాంతంలో ఎందుకు ప్రభావవంతంగా ఉంటాయో చర్చిస్తారు. ప్రచారకులు ఒకరి తర్వాత ఒకరు ఆ అందింపులను ప్రాక్టీసు చేస్తారు. ప్రసంగీకుడు మెచ్చుకుని, వాటిని మరింత ప్రభావవంతంగా చేసే విధానాలను గూర్చి సలహాలను ఇస్తాడు. పఠనాలను ప్రారంభించే లక్ష్యాన్ని చేరే మార్గాలను గూర్చి ఆయన ప్రేక్షకులను అడుగుతాడు. చివరికి జ్ఞానము పుస్తకం నుండి పఠనాన్ని ఎలా ప్రారంభించాలన్న విషయంపై స్పష్టమైన వివరణలను ఇస్తాడు.

పాట 34 (8), ముగింపు ప్రార్థన.

ఫిబ్రవరి 10తో ప్రారంభమయ్యే వారం

పాట 29 (11)

5 నిమి: స్థానిక ప్రకటనలు. అకౌంట్స్‌ రిపోర్టు.

10 నిమి: “అత్యవసర భావంతో సువార్తను అందించడం.” (పేరాలు 6-8) 6-7 పేరాల్లోని అందింపులను ప్రదర్శించండి. ఆసక్తి కనపర్చినవారని పునర్దర్శించే అవసరతను నొక్కి చెప్పండి.

30 నిమి: “కావలెను—4,000 మంది సహాయ పయినీర్లు.” సేవా పైవిచారణకర్త ప్రశ్నా జవాబులతో దాన్ని నిర్వహిస్తారు. 3వ పేజీలోని బాక్సును ఉన్నతపర్చండి. 6వ పేజీలో ఇచ్చిన నమూనా పట్టికలను పునఃసమీక్షించండి. బాప్తిస్మం తీసుకున్న ప్రతి ప్రచారకుడూ, తాను ఒక నెల లేక ఎక్కువ నెలలు పయినీరుగా చేరగలనా లేదాయని వ్యక్తిగతంగానూ ప్రార్థనా పూర్వకంగానూ పరిశీలించుకోవాలి. బాప్తిస్మం తీసుకోని ప్రచారకులు తమకు తాము ఇన్ని గంటలు చేయాలి అనే లక్ష్యాన్ని పెట్టుకోవడం ద్వారా తమ పరిచర్యను విస్తృతపర్చుకోవచ్చు.

పాట 43 (4, sb29-TU), ముగింపు ప్రార్థన.

ఫిబ్రవరి 17తో ప్రారంభమయ్యే వారం

పాట 30 (58)

10 నిమి: స్థానిక ప్రకటనలు. కొత్త పత్రికల నుండి ఈ వారం సేవలో ఉపయోగించగల ఆసక్తికరమైన సంభాషణా విషయాలను గూర్చి ప్రస్తావించండి.

13 నిమి: “జ్ఞాపకార్థదినం—అతి ప్రాముఖ్యమైన ఓ సంఘటన!” ప్రశ్నా జవాబులు. సహాయ పయినీరు సేవ చేయడం ద్వారా మార్చి నెలంతటినీ ప్రత్యేక నెలగా చేయాలనే ప్రోత్సాహాన్ని అందించండి. జ్ఞాపకార్థదిన ఆహ్వాన పత్రాలను ఉపయోగించాల్సిన ప్రాముఖ్యతను ఉన్నతపర్చండి.

22 నిమి: గృహ బైబిలు పఠనాలను ప్రారంభించడం. ఇటీవలి నెలల్లో వేలకొలది పుస్తకాలను అందించడం జరిగింది. ఇంకా ఎక్కువ గృహ బైబిలు పఠనాలను ప్రారంభించేందుకు ఇది ఆధారాన్నిస్తుంది. పుస్తకాలనూ ఇతర సాహిత్యాలనూ అందించడం ద్వారా స్థానికంగా సాధించిన ఫలితాలను పునఃసమీక్షించండి. ఆసక్తిగలవారిని పునర్దర్శించమని ప్రేక్షకులను ప్రోత్సహించండి. కొత్త గృహ బైబిలు పఠనాలను నిర్వహించేందుకు ప్రచారకులు చేయాల్సివచ్చిన ప్రయత్నాలను గూర్చి వారు స్పష్టంగా వివరించే ఏర్పాట్లు చేయండి. మన నియామకంలోని ముఖ్యమైన భాగం శిష్యులను తయారు చేయడమేనని నొక్కి చెప్పండి. (మత్త. 28:19, 20) జూన్‌ 1996 మన రాజ్య పరిచర్యలోని ఇన్‌సర్ట్‌లోని సలహాలను ఉపయోగించేందుకు ప్రయత్నించినట్లైతే దీన్ని ప్రభావవంతంగా చేయవచ్చు.

పాట 47 (21), ముగింపు ప్రార్థన.

ఫిబ్రవరి 24తో ప్రారంభమయ్యే వారం

పాట 32 (3, sb29-TU)

18 నిమి: స్థానిక ప్రకటనలు. మార్చి నెలలో సహాయ పయినీరు సేవ చేసేవారి పేర్లను ప్రకటించండి. అప్లికేషన్‌ ఇవ్వడానికి ఇంకా సమయం మించిపోలేదని వివరించండి. మార్చి 1వ తారీఖున అంటే శనివారంనాడు ప్రాంతీయ సేవలో పూర్తిగా భాగంవహించమని అందరినీ ప్రోత్సహించండి. ఆ నెలలో సేవ కొరకైన కూటాలకు స్థానికంగా చేసిన అదనపు ఏర్పాట్లను గూర్చి క్లుప్తంగా చెప్పండి. “సమయోచిత సహాయము” అనే శీర్షికలోని సమాచారాన్నంతటినీ ప్రశ్నా జవాబుల రూపంలో పరిశీలించండి. కొత్త ప్రచురణల్లోని ప్రతి దాని నుండీ ఉపయుక్తమైన ఉన్నతాంశాలను సూచించండి.

12 నిమి: “మీ బంధువుల విషయమేమిటి?” భార్యా భర్తలిరువురు కలిసి ఈ శీర్షికను చర్చించి అవిశ్వాసియైన బంధువులకు సువార్తను ఎలా అందించాలో నిర్ణయిస్తారు.—ఫిబ్రవరి 15, 1990 కావలికోట (ఆంగ్లం) 25-7 పేజీలు చూడండి.

15 నిమి: మార్చి సాహిత్య ప్రతిపాదనను పునఃసమీక్షించండి—కుటుంబ సంతోషానికిగల రహస్యం. ఆధునిక సమాజంలో కుటుంబం విచ్ఛిన్నమవ్వడం వెనుకున్న కారణాలను గూర్చి క్లుప్తంగా చర్చించండి. (అక్టోబరు 15, 1992 కావలికోట [ఆంగ్లం] 4-7 పేజీలు చూడండి.) ఆ పుస్తకంలోని 3వ పేజీలో ఉన్న విషయసూచికను పునఃసమీక్షించండి. అందింపుకు ఆధారాన్నిచ్చే అధ్యాయాలను ఎన్నుకోమని ప్రేక్షకులను ఆహ్వానించండి. ప్రతి అధ్యాయం చివరన ఉండే ఉపయుక్తమైన బోధనా బాక్సును సూచించండి. ఆ పుస్తకాన్ని అందించే విధానాన్ని ఓ సమర్థవంతుడైన ప్రచారకుడు ప్రదర్శించే ఏర్పాటు చేయండి. ఈ వారాంతంలో ఈ పుస్తకాలను తీసుకోమని అందరికీ గుర్తుచేయండి అంతేకాక తమ ప్రాంతంలో మాట్లాడే భాషలన్నింటిలో ప్రతులను తీసుకువెళ్ళమని ప్రోత్సహించండి.

పాట 48 (28), ముగింపు ప్రార్థన.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి