ప్రకటనలు
◼ సాహిత్య ప్రతిపాదనలు సెప్టెంబరు: నీ కుటుంబ జీవితమును సంతోషభరితముగా చేసికొనుము పుస్తకం రూ. 20.00 చందాకు. దానికి ప్రత్యామ్నాయ ప్రతిపాదనగా మీరు పరదైసు భూమిపై నిరంతరము జీవించగలరు లేక జీవం—అది ఇక్కడికి ఎలా వచ్చింది? పరిణామం ద్వారానా లేక సృష్టి ద్వారానా? (ఆంగ్లం) పుస్తకాలలో ఏదైనా ఒకటి రూ. 25.00 చందాకు (పెద్ద సైజు రూ. 45.00) ప్రతిపాదించవచ్చు. పంజాబీ చదవడానికి ఎక్కువగా ఇష్టపడే వ్యక్తులకు నిత్యజీవానికి నడిపించే జ్ఞానము అనే పుస్తకాన్ని రూ. 20.00 చందాకు ప్రతిపాదించవచ్చు. అక్టోబరు: కావలికోట లేక తేజరిల్లు! కొరకు చందాలు. పక్షపత్రికలకు ఒక సంవత్సర చందా రూ. 90.00. మాసపత్రికలకు ఒక సంవత్సర చందా మరియు పక్షపత్రికలకు ఆరు నెలల చందా రూ. 45.00. మాసపత్రికలకు ఆరు నెలల చందా లేదు. చందా కట్టడానికి నిరాకరించినట్లైతే, విడి పత్రికలను ఒక్కొక్కదాన్ని రూ. 4.00కు ప్రతిపాదించాలి. నవంబరు: నిత్యజీవానికి నడిపించే జ్ఞానము పుస్తకాన్ని రూ. 20.00 చందాకు. గృహ బైబిలు పఠనాలు ప్రారంభించే లక్ష్యంతో, దానిని అందించిన ప్రతిచోటికి తిరిగి వెళ్లడానికి విశేష ప్రయత్నం చేయబడుతుంది. డిశంబరు: మీరు పరదైసు భూమిపై నిరంతరము జీవించగలరు అనే పుస్తకం రూ. 25.00 (పెద్ద సైజు రూ. 45.00) చందాకు. ప్రత్యామ్నాయంగా, సముచితమైనచోట జీవించిన వారిలోకెల్లా మహాగొప్ప మనిషి లేదా నా బైబిలు కథల పుస్తకము (ఆంగ్లం) అనే పుస్తకాన్ని రూ 45.00 చందాకు ప్రతిపాదించవచ్చు. ఎక్కువగా పంజాబీ చదవాలని ఇష్టపడే వ్యక్తులకు నిత్యజీవానికి నడిపించే జ్ఞానము అనే పుస్తకాన్ని రూ. 20.00 చందాకు ప్రతిపాదించవచ్చు.
గమనిక: పైన పేర్కొనబడిన ప్రచార సాహిత్యాలలో వేటినైనా ఇంకా రిక్వెస్ట్ చేయని సంఘాలు తమ తరువాతి లిటరేచర్ రిక్వెస్ట్ ఫారమ్‌పై (S-AB-14) రిక్వెస్ట్ చేయాలి.
◼ సంఘాధ్యక్షుడు లేదా ఆయన నియమించిన వారెవరైనా సెప్టెంబరు 1న లేదా దాని తర్వాత సాధ్యమైనంత త్వరగా సంఘ లెక్కలను తనిఖీ చేయాలి. ఈ పని పూర్తయిన తర్వాత సంఘంలో ప్రకటించండి.
◼ అక్టోబరులో సహాయ పయినీర్లుగా సేవ చేయాలని పథకం వేసుకుంటున్న ప్రచారకులు దరఖాస్తును త్వరగా ఇవ్వాలి. అలా చేస్తే పెద్దలు పత్రికలను, సాహిత్యాన్ని, ప్రదేశాన్ని ఏర్పాటు చేసేందుకు వీలవుతుంది.
◼ తిరిగి చేర్చబడడానికి మొగ్గుచూపుతున్న ఎవరైనా బహిష్కరించబడినవారు లేదా సహవసించని వారిని గూర్చి ఏప్రిల్ 15, 1991 కావలికోట (ఆంగ్లం) 21-3 పేజీల్లో ఇవ్వబడిన ఉపదేశాలను పరిశీలించాలని పెద్దలకు గుర్తు చేయబడుతుంది.
◼ కలకత్తాలో జరుగనున్న జిల్లా సమావేశ తేదీ డిశంబరు 27-29, 1996కు మారింది.
◼ జనవరి 1997 మొదలుకొని మరాఠీ తేజరిల్లు! మాసపత్రిక అవుతుంది.
◼ ప్రచారకులందరూ ఆగస్టు నెల ప్రాంతీయ పరిచర్య నివేదికలను ఆగస్టు 29, గురువారమున, లేదా ఇంకా ఆలస్యమైతే ఆదివారం, సెప్టెంబరు 1న తమ సంఘానికి ఇవ్వాలని ప్రోత్సహించబడుతున్నారు. దాన్నిబట్టి, సంఘ కార్యదర్శి సంఘ నివేదిక (S-1)ను మంగళవారం, సెప్టెంబరు 3 కెల్లా సొసైటీకి పోస్ట్ చేసేందుకు ప్రతి ప్రయత్నం చేయాలి, అలా ఈ సేవా సంవత్సర వార్షిక నివేదికను కూర్చేందుకు సకాలంలో అది మాకు అందుతుంది.