సెప్టెంబరులోని సేవా కూటాలు
సెప్టెంబరు 2తో ప్రారంభమయ్యే వారం
పాట 98 (91)
12 నిమి: స్థానిక ప్రకటనలు. మన రాజ్య పరిచర్య నుండి ఎంపిక చేసిన ప్రకటనలు. ప్రతి ఒక్కరు, ముఖ్యంగా సంఘ పుస్తక పఠన నిర్వాహకులు ఏప్రిల్ 1993 మన రాజ్య పరిచర్యలోని “ది గ్రేటెస్ట్ మ్యాన్ హు ఎవర్ లివ్డ్ పుస్తక పఠనము” అనే శీర్షికను పునఃసమీక్షించాలని ప్రోత్సహించండి. శీర్షికలోని ముఖ్య అంశాలను ఉన్నతపర్చండి.
15 నిమి: “విశ్వాసం వలన నడవండి.” ప్రశ్నా జవాబులు.
18 నిమి: “అనుకూల దృక్పథంతో సువార్తను అందించడం.” 1వ పేరా ఆధారంగా ప్రారంభ వ్యాఖ్యానాలను చేయండి. కుటుంబ జీవితము అనే పుస్తకానికి ప్రత్యామ్నాయ పుస్తకంగా నిరంతరము జీవించగలరు లేదా సృష్టి (ఆంగ్లం) అనే పుస్తకాలను ఉపయోగించవచ్చని వివరించండి. సంఘంలో కుటుంబ జీవితము పుస్తకాలు ఉన్నంత వరకూ మొదట వాటినే ఉపయోగించాలి. తర్వాత, ఆ శీర్షికలోని 2-5 పేరాలను మాత్రమే చర్చించండి. ఎలా కుటుంబ జీవితము అనే పుస్తకాన్ని ప్రతిపాదించాలి, పునర్దర్శనం చేయాలి, జ్ఞానము పుస్తకం నుండి పఠనాన్ని ఆరంభించాలి అని చూపించే బాగా సిద్ధపడిన అందింపులను ప్రదర్శించండి.
పాట 48 (28) మరియు ముగింపు ప్రార్థన.
సెప్టెంబరు 9తో ప్రారంభమయ్యే వారం
పాట 18 (36)
12 నిమి: స్థానిక ప్రకటనలు. అకౌంట్స్ రిపోర్ట్. “రాజ్యాన్ని గూర్చి ప్రకటించండి” అనే శీర్షికను చర్చించండి.
18 నిమి: సంఘం యొక్క 1996 సేవా సంవత్సర నివేదికను పునఃసమీక్షించండి. సేవాధ్యక్షుని నిర్మాణాత్మకమైన ఉత్సాహపూరితమైన ప్రసంగం. (మన పరిచర్య పుస్తకం 100-2 పేజీలను చూడండి.) సంఘం ఏ విషయం చక్కగా చేసిందో ఎత్తి చూపి, మెచ్చుకోండి. క్రమ మరియు సహాయ పయినీర్ల క్రియాశీలత స్థానిక పరిచర్య అభివృద్ధికి ఎలా అధికంగా సహాయపడిందో చూపించండి. కూటాల హాజరు సంఖ్యను పేర్కొంటూ క్రమంగా హాజరు కావలసిన దాని ప్రాముఖ్యతను నొక్కి చెప్పండి. రానున్న సంవత్సరంలో సంఘం సాధించేందుకు ప్రయత్నించగల ఆచరణాత్మక లక్ష్యాలను సంక్షిప్తంగా చెప్పండి.
15 నిమి: “అనుకూల దృక్పథంతో సువార్తను అందించడం.” 6-8 పేరాలను మాత్రమే పునఃసమీక్షించి, అంగడంగళ్ళలో మొదటి దర్శనాలకు, పునర్దర్శనాలకు అందింపులను పునఃసమీక్షించండి. (అక్టోబరు 1989 మన రాజ్య పరిచర్య 4వ పేజీలోని వ్యాపార ప్రాంతంలో పరిచర్య చేయడాన్ని గూర్చిన అదనపు సలహాలను చూడండి.) త్వరగా పునర్దర్శనాలను చేయాలని అందరినీ ప్రోత్సహించండి.
పాట 123 (63) మరియు ముగింపు ప్రార్థన.
సెప్టెంబరు 16తో ప్రారంభమయ్యే వారం
పాట 10 (18)
15 నిమి: స్థానిక ప్రకటనలు. ప్రేక్షకులతో ప్రశ్నా భాగాన్ని చర్చించండి. పాఠశాల నిర్దేశక పుస్తకము (ఆంగ్లం)లోని 6వ పఠన భాగంలోని ఒకటి లేదా రెండు అంశాలను క్లుప్తంగా ముడిపెట్టండి.
15 నిమి: “మాటలోను ప్రవర్తనలోను మాదిరిగా ఉండండి.” ప్రశ్నా జవాబులు.
15 నిమి: పాఠశాలలో క్రైస్తవ నడవడి. పాఠశాలలోని తీవ్రమైన లోపాలను చూపించడానికి తండ్రి తన కుమారునితో లేదా కుమార్తెతో మాట్లాడుతాడు; సహవాసాన్ని గూర్చి అప్రమత్తంగా ఉండవలసిన, సందేహాస్పదమైన కార్యక్రమాలను తప్పించుకోవలసిన అవసరతను నొక్కిచెబుతాడు. ఆయన విద్య (ఆంగ్లం) అనే బ్రోషూరులోని 24వ పేజీలోని బాక్సును పునఃసమీక్షించి, సాక్షిగా మంచి మాదిరినుంచవలసిన అవసరతను వివరిస్తాడు. మత్తుమందులను ఉపయోగించడం, డేటింగ్, సామాజిక సమావేశాలకు హాజరుకావడం, లేదా క్రీడల్లో పాల్గొనడం వంటి వాటిలో ఇమడడం వలన వచ్చే కొన్ని ప్రలోభాలను గూర్చి తండ్రి పేర్కొంటాడు; సమస్యలను ఎలా నివారించాలని వారు చర్చిస్తారు. క్లిష్ట పరిస్థితులు ఏర్పడినప్పుడు తనతో చెప్పుకోవడానికి ఆలస్యం చేయవద్దని—తను తెలుసుకుని, సహాయపడాలని కోరుకుంటున్నాడని తండ్రి యౌవనస్థున్ని(రాలిని) ప్రోత్సహిస్తాడు.
పాట 32 (3 sb29-TU) మరియు ముగింపు ప్రార్థన.
సెప్టెంబరు 23తో ప్రారంభమయ్యే ప్రార్థన
పాట 21 (1)
10 నిమి: స్థానిక ప్రకటనలు.
15 నిమి: స్థానిక అవసరతలు. లేదా ఫిబ్రవరి 15, 1996, కావలికోట 27-9 పేజీల్లోని “మీకు కనిపించేవాటికి మించినవి చూడండి!” అనే శీర్షికపై ఆధారపడిన ప్రసంగం.
20 నిమి: “1996 ‘దైవికశాంతి సందేశకులు’ జిల్లా సమావేశాలు.” 1-16 పేరాల ప్రశ్నా జవాబులు. 10-11 మరియు 15 పేరాలను చదవండి.
పాట 215 (117) మరియు ముగింపు ప్రార్థన.
సెప్టెంబరు 30తో ప్రారంభమయ్యే వారం
పాట 171 (59)
10 నిమి: స్థానిక ప్రకటనలు.
20 నిమి: “1996 ‘దైవికశాంతి సందేశకులు’ జిల్లా సమావేశాలు.” 17-23 పేరాల ప్రశ్నాజవాబుల చర్చ. 17-18 పేరాలను చదవండి. “జిల్లా సమావేశ జ్ఞాపికలు” పునఃసమీక్షించండి.
15 నిమి: అక్టోబరులో సాహిత్య ప్రతిపాదనను పునఃసమీక్షించండి. కావలికోట మరియు తేజరిల్లు! పత్రికలకు చందాలను మనం ప్రతిపాదిస్తాం. (1) మొదటి పేజీల్లో వివరించబడినట్లు పత్రికలను ప్రచురించే ఉద్దేశం. (2) బైబిలు జ్ఞానం ప్రపంచవ్యాప్తంగా లభ్యమయ్యేలా అవి అనేక భాషల్లో ప్రచురించబడుతున్నాయి. (3) కావలికోట వ్యక్తిగతంగా, కుటుంబంగా మరియు గుంపుగా పఠించేందుకు రూపొందించబడింది. (4) విభిన్న మతాలతో సంబంధంగల ప్రజలు వాటిని చదువుతున్నారు. (5) పత్రికలను చదవాలని నిజంగా కోరుకున్నా వాటికి చందాకట్టలేనివారికి క్రొత్త సంచికలను మేము వ్యక్తిగతంగా తెచ్చి ఇస్తాము. (6) అవి బిజీగా ఉన్న ప్రజల కొరకు ప్రత్యేకంగా తయారు చేయబడ్డాయి. (7) కావలికోట (ఆంగ్లం) 1879 నుండి; తేజరిల్లు! (ఆంగ్లం) 1919 నుండి ప్రచురించబడుతున్నాయి. (8) మాది స్వచ్ఛంద విద్యాకార్యక్రమము, వ్యాపార కార్యం కాదు అనేటటువంటి విభిన్న అంశాలను చర్చించండి. కనుక, పత్రిక చందా చాలా సరసమైనది. మెప్పుదలగల ఒక చదువరి చేసిన వ్యాఖ్యానాలను గూర్చి చెబుతూ ముగించండి.—ఏప్రిల్ 15, 1986 కావలికోట 32వ పేజీ చూడండి.
పాట 3 (33) మరియు ముగింపు ప్రార్థన.