జూలైలోని సేవా కూటాలు
జూలై 1తో ప్రారంభమయ్యే వారం
పాట 90 (32)
12 నిమి: స్థానిక ప్రకటనలు. మన రాజ్య పరిచర్య నుండి ఎంపిక చేయబడిన ప్రకటనలు. మన దేశం యొక్క, స్థానిక సంఘం యొక్క ఏప్రిల్ ప్రాంతీయ పరిచర్య నివేదికపై వ్యాఖ్యానించండి.
15 నిమి: “దినదినము మన ప్రమాణమును నెరవేర్చుట.” ప్రశ్నా జవాబులు. ప్రమాణము అనేది ఎందుకు ఒక గంభీరమైన బాధ్యతో చూపిస్తూ అంతర్దృష్టి, (ఆంగ్లం) సంపుటి 2, పేజీ 1162, 6-7 పేరాలపై వ్యాఖ్యానాలను ఇమిడ్చండి.
18 నిమి: “ఇతరుల ఎడల యథార్థంగా శ్రద్ధవహించడం ద్వారా యెహోవాను అనుకరించండి.” (పేరాలు 1-3) శీర్షిక మూలాంశాన్ని పెంపొందించడానికి మొదటి పేరాను ఉపయోగించండి. ప్రస్తుతం సంఘంలో స్టాకులో ఉన్న ఏ బ్రోషూర్లు మీ ప్రాంతంలో బాగా అంగీకరించబడతాయో నిర్ధారించండి. ఇవి ఏ భాషలలో లభ్యమౌతున్నాయో పేర్కొని, వివిధ భాషల్లోని బ్రోషూర్లను తీసుకొని వెళ్లాలని అందరినీ ప్రోత్సహించండి. తరువాత 2-3 పేరాలను మాత్రమే సమీక్షించి, దేవుడు మనయెడల నిజంగా శ్రద్ధ కల్గియున్నాడా? అనే బ్రోషూరుతో తొలి సందర్శనమూ పునర్దర్శనము ఎలా చేయవచ్చో ప్రదర్శించండి. స్థానిక ప్రాంతం కొరకు సముచితమైన ఇంకొక బ్రోషూరుకు ప్రచారకులు తమ స్వంత అందింపును ఎలా తయారు చేసుకోవచ్చో చూపించండి.
పాట 112 (59), ముగింపు ప్రార్థన.
జూలై 8తో ప్రారంభమయ్యే వారం
పాట 43 (11)
10 నిమి: స్థానిక ప్రకటనలు. అకౌంట్స్ రిపోర్టు.
15 నిమి: “ఇతరుల ఎడల యథార్థంగా శ్రద్ధవహించడం ద్వారా యెహోవాను అనుకరించండి.” (4-5 పేరాలు) కేవలం 4-5 పేరాలు, మీరు ప్రేమిస్తున్నవారెవరైనా చనిపోతే అనే బ్రోషూరు నుండి కొన్ని ఉన్నతాంశాలను చర్చించండి. తొలి సందర్శనం కొరకు, పునర్దర్శనం కొరకు సూచించబడిన ప్రదర్శనలను చేసి చూపించండి.
20 నిమి: “క్రమ పయినీరు సేవలో ఇంకా ఎక్కువమంది సహోదరులు కావాలి.” ప్రశ్నా జవాబులు. సమయం అనుమతించే కొలది, ఆర్థిక అవసరాల ఎడల ఎలా శ్రద్ధవహించాలన్న దానిపై సెప్టెంబరు 15, 1993, కావలికోటలో 28-31 పేజీలలో చర్చించబడిన సూచనలను సమీక్షించండి.
పాట 16 (101), ముగింపు ప్రార్థన.
జూలై 15తో ప్రారంభమయ్యే వారం
పాట 162 (89)
10 నిమి: స్థానిక ప్రకటనలు.
20 నిమి: “మీరు సాయంకాల సాక్ష్యమివ్వడానికి ప్రయత్నించారా?” ప్రేక్షకులు పాల్గొనడం మరియు కొన్ని ఇంటర్వ్యూలతో ఒక ప్రసంగం. సాయంకాల సమయంలో పరిచర్య ప్రాంతంలో పనిచేస్తున్నప్పుడు స్థానికంగా ఏమి గమనించబడిందో వివరించండి. సాయంకాల సాక్ష్యం నుండి వచ్చే అనుకూల ప్రతిఫలాలను చూపించే అనుభవాలను ఇమడ్చండి. స్థానిక సేవ కొరకైన కూటాల ప్రతివారపు పట్టికను క్లుప్తంగా వివరించండి.
15 నిమి: “ఇతరుల ఎడల యథార్థంగా శ్రద్ధవహించడం ద్వారా యెహోవాను అనుకరించండి.” (6-8 పేరాలు) బ్రోషూర్లు అందించినవారిని సత్వరంగా పునర్దర్శించమని ప్రోత్సహించడానికి శీర్షికలోని ఆఖరి పేరాను ఉపయోగించండి. 6-7 పేరాలను ఉపయోగిస్తూ, మొదటి సందర్శనంలో జీవిత సంకల్పం అనే బ్రోషూరును ఎలా అందించాలో, పునర్దర్శనం చేసేటప్పుడు జ్ఞానము పుస్తకంలోని మొదటి అధ్యాయంలో పఠనాన్ని ఎలా ప్రారంభించాలో ప్రదర్శించండి. మన రాజ్య పరిచర్యలో సూచించబడిన మాదిరి అందింపులను అనుసరించి ఇతర బ్రోషూర్లకు అందింపులను తమంతట తామే తయారు చేసుకోవచ్చని ప్రచారకులకు గుర్తు చేయండి.
పాట 64 (35), ముగింపు ప్రార్థన.
జూలై 22తో ప్రారంభమయ్యే వారం
పాట 108 (69)
10 నిమి: స్థానిక ప్రకటనలు. పత్రికల క్రొత్త సంచికలను ఇండ్లవద్ద అందించడానికి ఉపయోగపడే ఆసక్తికరమైన ఉన్నతాంశాలను ఎత్తిచూపుతూ, వాటిని సంక్షిప్తంగా సమీక్షించండి.
15 నిమి: పూర్తికాల సేవా లక్ష్యాన్ని వెంబడించండి. డిశంబరు 15, 1988, కావలికోట (ఆంగ్లం)లో 25-7 పేజీల ఆధారంగా ఒక పెద్ద, ఒకరిద్దరు టీనేజర్ల మధ్య చర్చ. ఉన్నత పాఠశాల చదువును పూర్తి చేసిన తరువాత తాము ఏ లక్ష్యాలను వెంబడిస్తారన్నది నిర్ణయించడానికి యౌవనులు ప్రయత్నిస్తారు. ప్రాపంచిక జీవనోపాధి మార్గాలు ప్రతిపాదించే వస్తు సంబంధ ప్రయోజనాలపై వారు ఆసక్తి చూపుతారు. క్రమ పయినీరు సేవా లక్ష్యాన్ని వెంబడించడం ఎందుకు అత్యంత శ్రేష్ఠం అన్నదానికి మంచి కారణాలను పెద్ద పేర్కొంటాడు. టీనేజర్లు ఒప్పుకుంటారు కానీ తాము క్రమ పయినీర్లు అవ్వగలరా, వస్తు సంబంధంగా తాము నిలద్రొక్కుకోగలరా అని సందేహిస్తారు. క్రమ పయినీరు సేవ అనేకమందికి ఆనందం తెచ్చే సహేతుకమైన, చేరుకోగల లక్ష్యం అని చూపిస్తూ, కావలికోట శీర్షికలో నుండి అనుభవాలను పెద్ద వారితో పంచుకుంటాడు. పెద్ద చేసిన వ్యాఖ్యానాల ఎడల మెప్పుదలను వ్యక్తం చేస్తూ, రాజ్య సేవలో పూర్తి భాగం వహించే లక్ష్యాన్ని వెంబడించాలనే దాని విషయమై గంభీరంగా ఆలోచించాలని టీనేజర్లు నిర్ణయం తీసుకోవడంతో చర్చ ముగుస్తుంది.
20 నిమి: “జ్ఞానము పుస్తకంతో శిష్యులను చేసే పద్ధతి.” జూన్ 1996 మన రాజ్య పరిచర్య ఇన్‌సర్ట్‌లోని 12-16 పేరాలపై ఆధారపడి ఒక ప్రసంగం. అభివృద్ధి చెందుతున్న రెండు బైబిలు పఠనాల ప్రదర్శనలను ఇమడ్చండి. ముద్రిత ప్రశ్నలకు చాలా సూటిగా సమాధానమిచ్చే మూల పదాలను, పదబంధాలను ఉన్నతపరచడం లేక వాటి క్రింద గీతలు గీయడం ద్వారా పాఠానికి సిద్ధపడడానికి విద్యార్థికి శిక్షణ ఎలా ఇవ్వాలో మొదటిది చూపిస్తుంది. బహిరంగ ప్రసంగానికి, కావలికోట పఠనానికి హాజరవ్వమని బైబిలు విద్యార్థిని ప్రోత్సహించడానికి మీరు ఏమి చెప్పగలరో రెండవ ప్రదర్శన చూపిస్తుంది.
పాట 116 (37), ముగింపు ప్రార్థన.
జూలై 29తో ప్రారంభమయ్యే వారం
పాట 212 (110)
10 నిమి: స్థానిక ప్రకటనలు. “ప్రస్తుతం ఉన్న సాహిత్యం”ను సమీక్షించండి.
20 నిమి: ఒక బైబిలు పఠనం సంపాదించడానికి ఏమి అవసరం? పఠనాలను ప్రారంభించడంలో మరింత సఫలులుగా ఉండడానికి, బైబిలు పఠన పనిలో సఫలతను కనుగొన్న ఇద్దరు లేక ముగ్గురి మధ్య చర్చను ఒక పెద్ద నిర్దేశిస్తాడు: (1) యెహోవా సహాయం కొరకు ప్రార్థన చేయండి. (2) ఆసక్తిగల వారిని కనుగొనడానికి పరిచర్య యొక్క విభిన్న కార్యక్రమాల్లో క్రమంగా భాగం వహించండి. (3) ఆసక్తి ఉన్న వారందరిని గూర్చి వ్రాసుకోండి, సత్వర పునర్దర్శనాలను చేయండి. (4) ఆసక్తి కనబరచిన చోటల్లా పఠనాన్ని ప్రతిపాదించండి. (ఫిబ్రవరి 15, 1996, కావలికోట, 20వ పేజీలోని “బైబిలు పఠనాలను ప్రారంభించడం” అనే ఉపశీర్షికను చూడండి.) (5) ఆగస్టు 1, 1984, కావలికోట, (ఆంగ్లం) 13-17 పేజీలలో ఉన్న నాలుగు సూచనలను ఉపయోగించడం ద్వారా మీ బోధనా సామర్థ్యంపై నమ్మకాన్ని పెంచుకోండి.
15 నిమి: స్థానిక అవసరతలు. లేక జనవరి 15, 1996, కావలికోట, 21-3 పేజీల నుండి “ఆదరణ మరియు ప్రోత్సాహము—అనేక కోణాలుగల రత్నాలు” అనే దానిపై ఒక పెద్ద ప్రసంగమిస్తాడు.
పాట 165 (81), ముగింపు ప్రార్థన.