ఫిబ్రవరిలోని సేవాకూటాలు
ఫిబ్రవరి 5తో ప్రారంభమయ్యే వారం
పాట 96 (72)
10 నిమి: స్థానిక ప్రకటనలు. మన రాజ్య పరిచర్య నుండి ఎంపిక చేయబడిన ప్రకటనలు. మార్చి 1, 1996 నుండి పత్రికల ధరలోని పెరుగుదల వైపుకు శ్రద్ధను మళ్ళించండి.
15 నిమి: “యేసును అనుకరించడంలో ప్రతిదినం సత్యాన్ని ప్రకటించడం.” ప్రశ్నాజవాబులు. 5వ పేరా చదవండి.
20 నిమి: “నిజమైన సంతోషానికి ఒక కీలకం.” ఇవ్వబడిన అందింపులను చర్చించండి, ఒకటి లేక రెండు ప్రదర్శనలను చూపించండి. నిరంతరము జీవించగలరు మరియు కుటుంబ జీవితము అనే పుస్తకాలు చాలా ఆచరణాత్మకమైనవి మరియు ప్రతిపాదించడానికి సులభమైనవి గనుక, ఎల్లవేళలా వాటిని తీసుకువెళ్ళాలని ప్రచారకులకు చెప్పండి.
పాట 14 (6) మరియు ముగింపు ప్రార్థన.
ఫిబ్రవరి 12తో ప్రారంభమయ్యే వారం
పాట 191 (98)
10 నిమి: స్థానిక ప్రకటనలు. అకౌంట్స్ రిపోర్ట్.
13 నిమి: “ఏప్రిల్ నెలలో పత్రికా కార్యక్రమానికి సిద్ధపడండి.” సువార్తను తెలియజేయడంలో కావలికోట మరియు తేజరిల్లు! పత్రికల విలువను ఉన్నతపరచండి. రెండు పేరాల శీర్షికను చదివి, పత్రికా పంపకానికి ఏప్రిల్‌ను ప్రత్యేక నెలగా చేసేందుకు స్థానిక సంఘం ఏం చేస్తుందో టూకీగా వివరించండి. ఏప్రిల్‌లో, మేలో లేక రెండు నెలల్లోనూ సహాయ పయినీరింగ్ చేసేందుకు సంఘంలోని అందరినీ ప్రోత్సహించండి.
22 నిమి: “వినే వ్యక్తిని నేనెలా కనుగొనగలను?” ప్రశ్నాజవాబులు. ఇంటి ద్వారముల వద్ద మాట్లాడేటప్పుడు, మరింత ఉత్సాహాన్ని కనబరచేందుకు ఎలా ప్రయత్నించాలి అనే విషయాన్ని ఇద్దరు ప్రచారకులు పాఠశాల నిర్దేశక పుస్తకంలోని (ఆంగ్లం) 165-7 పేజీల్లోని 10-21 పేరాల్లోని సలహాలను ఉపయోగిస్తూ చర్చించాలి. ప్రాంతంలో వ్యతిరేకతను ఎదుర్కొన్నప్పుడు యుక్తిగా ఉండవలసిన అవసరతను నొక్కి చెప్పాలి.
పాట 133 (68) మరియు ముగింపు ప్రార్థన.
ఫిబ్రవరి 19తో ప్రారంభమయ్యే వారం
పాట 72 (58)
10 నిమి: స్థానిక ప్రకటనలు.
15 నిమి: “1996 కొరకైన దైవపరిపాలనా పరిచర్య పాఠశాల నుండి ప్రయోజనం పొందండి—భాగం 2.” పాఠశాల అధ్యక్షుని ప్రసంగం. ప్రతిదినం దేవుని వాక్యాన్ని చదవవలసిన అవసరాన్ని నొక్కి చెప్పండి.
20 నిమి: “అర్థం చేసుకోవడానికి వారికి సహాయపడండి.” పునర్దర్శనాలను చేసేందుకు చెప్పబడిన సలహాలను పునఃసమీక్షించండి. నిరంతరము జీవించగలరు మరియు కుటుంబ జీవితము అనే పుస్తకాల్లోని విశేషతలను మరియు వాటినెలా ఉన్నతపర్చవచ్చు అనేదాన్ని ఇద్దరు లేదా ముగ్గురు ప్రచారకులతో సంఘపెద్ద చర్చిస్తాడు. ఒకటి లేక రెండు అందింపులను ప్రదర్శించండి. బైబిలు పఠనాన్ని ఆరంభించేంతగా ఆసక్తిని ఎలా పెంపొందించవచ్చు అనే దాని గురించి సలహాలను ప్రతిపాదించండి.
పాట 53 (27) మరియు ముగింపు ప్రార్థన.
ఫిబ్రవరి 26తో ప్రారంభమయ్యే వారం
పాట 28 (5)
10 నిమి: స్థానిక ప్రకటనలు.
15 నిమి: ఆకర్షణీయమైన అందింపులను సిద్ధపడడం. స్థానికంగా ఆకర్షణీయమైనదాన్ని చర్చించే ఇంటింటి అందింపులను కలిగి ఉండడంలోని ప్రయోజనాలను గూర్చి సేవాధ్యక్షుడు లేదా వేరొక పెద్ద ఇద్దరు లేదా ముగ్గురు ప్రచారకులతో చర్చిస్తాడు. ఉదాహరణకు, జీవన ప్రమాణాన్ని పెంచాలనే ప్రస్తుత ప్రయత్నాలను గూర్చి; పెరుగుతున్న వివాహ సమస్యలు, నేరస్థులైన పిల్లలు, లేదా ఉద్యోగం సంపాదించడంలోని కష్టాలను గూర్చిన స్థానిక వార్తలు; లేదా రాజకీయవేత్తలు మరియు మతనాయకులు ప్రతిపాదించిన పరిష్కారాలను గూర్చి ప్రజలు రాను రాను ఎందుకు అనుమానిస్తారనే దానిని తెలిపే వార్తా నివేదికలు. మీ సమాజంలోని కొన్ని తాజా వార్తలను పేర్కొని, సంభాషణలను ఆరంభించేందుకు వాటిని ఎలా ఉపయోగించవచ్చో చర్చించండి.
20 నిమి: నిత్యజీవానికి నడిపించే జ్ఞానము అనే పుస్తకాన్ని మార్చిలో ప్రతిపాదించడం. సంభాషణలను ఆరంభించేందుకు ఉపయోగించగల పుస్తకంలోని కొన్ని ఆసక్తికరమైన విశేషతలను చూపించండి. (1) 4-5, 86, 124-5, 188-9 పేజీల్లో చూపించబడినటువంటి శ్రద్ధనాకర్షించే చిత్రాల వైపుకు అవధానాన్ని మళ్ళించండి. (2) పునఃసమీక్షా ప్రశ్నలతో ప్రతి అధ్యాయం ఎలా ముగుస్తుందో చూపించి, అందింపులకు ఆధారంగా వాటిని ఎలా ఉపయోగించవచ్చో వివరించండి. వాటి జవాబులను తెలుసుకోవడానికి గృహస్థుడు ఇష్టపడతాడేమో అడగవచ్చు. 11, 22, 61, 149 పేజీల్లో ఇవ్వబడిన కొన్ని ప్రశ్నలను తీసుకోండి. (3) 102వ పేజీలోని బాక్సును చూపించి, ఆసక్తిని రేకెత్తించేందుకు “అంత్యదినాల యొక్క కొన్ని సూచనల”ను ఎలా ఉపయోగించవచ్చో చూపిస్తూ సలహాలను ఇవ్వండి. (4) అభివృద్ధిని సాధిస్తున్న పఠనాలను నిర్వహించేందుకు ఈ పుస్తకం ప్రత్యేకంగా ఎలా తయారు చేయబడిందో నొక్కి చెప్పండి. అధ్యాయాలు చిన్నవి, సమాచారం సులభంగా అర్థం అయ్యేది, ఉదాహరించబడిన లేఖనాలు శక్తివంతమైనవి, పరిశోధించే ప్రశ్నలు కీలకాంశాలపై శ్రద్ధను కేంద్రీకరించాయి. బైబిలు పఠనాలను ఆరంభించాలనే లక్ష్యంతో పుస్తకాన్ని ప్రతిపాదించమని అందరినీ పురికొల్పండి. మీ సంఘంలో మీ భాషలో ఈ పుస్తకం ఇంతవరకు లభ్యం కానట్లయితే, దీనికి బదులుగా నిరంతరము జీవించగలరు అనే పుస్తకాన్ని ప్రతిపాదించడానికి అనుగుణంగా ఈ శీర్షికను అన్వయించండి. కుటుంబ జీవితము అనే పుస్తకాన్ని కూడా అన్నివేళలా తమ వెంట తీసుకుని, సముచితమైనప్పుడు దానిని ప్రతిపాదించాలని ప్రచారకులను ప్రోత్సహించండి.
పాట 151 (25) మరియు ముగింపు ప్రార్థన.