యేసును అనుకరించడంలో ప్రతిదినం సత్యాన్ని ప్రకటించడం
1 యేసు భూమ్మీదికి వచ్చినప్పుడు పూర్తి చేయడానికి ఆయనకొక ప్రత్యేక పని ఉండేది. అది గుర్తించదగినంత సరళమైనది: ‘సత్యాన్ని గూర్చి సాక్ష్యమివ్వడం.’ (యోహా. 18:37) ఆయన తన తండ్రి యొక్క అద్భుతమైన గుణాలను మరియు సంకల్పాలను గూర్చిన సత్యాన్ని ప్రకటించాడు. ఈ పని ఆయనకు ఆహారంలా ఉండేది; ఆయన జీవితమంతా దానిపై కేంద్రీకరించబడి ఉండేది. (యోహా. 4:34) యేసు ‘ప్రతిదినం దేవాలయంలో బోధిస్తూ’ ఉండేవాడని లూకా నివేదించాడు. (లూకా 19:47) దొరికిన సమయాన్ని యేసు పూర్తిగా ఉపయోగించాడు. (యోహా. 9:4) ఆయన తన మరణానికి కొంచెం ముందు “చేయుటకు నీవు నాకిచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమిమీద నిన్ను మహిమపరచితిని” అని తన తండ్రికి తెలియజేయగలిగాడు.—యోహా. 17:4.
2 మన హృదయాలు యెహోవా చేసినవాటన్నిటి ఎడల మెప్పుదలతో నిండినప్పుడు, మనం కూడా అలాగే ప్రతిదినం ఆయన గురించి మాట్లాడడానికి బలవంతపెట్టబడినట్లు భావిస్తాము. “మేము కన్నవాటిని విన్నవాటిని చెప్పకయుండలేమని” ధైర్యంగా ప్రకటించిన యేసు శిష్యులవలె మనం కూడా అవుతాము. (అపొ. 4:20) వారు యెహోవా గురించి మాట్లాడడంలో కొనసాగారు, గనుక ‘ప్రతిదినము . . . మానక ప్రకటించుచుండిరి’ అని వృత్తాంతం చెబుతుంది. (అపొ. 5:42) ‘నేను నా బోధకుడైన యేసు అనుచరుడి(రాలి)నేనా?’ అని మనల్ని మనం ప్రశ్నించుకోవాలి.
3 అత్యవసర భావంతో ప్రకటించడం: భూమ్యంతటా రాజ్య వర్తమానం ప్రకటించబడినప్పుడు ‘అంతం వస్తుంది’ అని యేసు ముందుగానే చెప్పాడు. (మత్త. 24:14) మన పని యొక్క ప్రాముఖ్యత మరియు ఆవశ్యకతలను గూర్చి అది మనలను ప్రభావితం చేయాలి. అక్షరార్థంగా లక్షలాది మంది ప్రజల జీవితాలు అపాయంలో ఉండగా, ఇంతకన్నా ప్రాముఖ్యమైన లేక ప్రయోజనకరమైన పని మరేదీ లేదని మనం తెలుసుకొనగలం. ఈ విధానాంతం సమీపిస్తుంది గనుక, ఈ పనిని ముగించడానికి చాలా కొంచెం సమయమే మిగిలి ఉంది!
4 యెహోవా గొర్రెవంటివారిని సమకూర్చడాన్ని త్వరితం చేస్తున్నాడని నివేదికలు చూపిస్తున్నాయి. (యెష. 60:22) ప్రపంచంలోని అనేక ప్రాంతాల్లోని ప్రజలు సత్యం వైపుకు అక్షరాల గుమిగూడుతున్నారు, దాని ఫలితంగా “దేవుడు మీకు తోడుగా ఉన్నాడను సంగతి మాకు వినబడినది గనుక మేము మీతో కూడ వత్తుమని” ఆనందంగా ప్రకటిస్తున్నారు! (జెక. 8:23) యేసు చెప్పిన మాటలు నేడు మునుపటికన్నా మరింత ఎక్కువగా నిజమౌతున్నాయి: ‘కోత విస్తారమేగాని పనివారు కొద్దిగా ఉన్నారు . . . తన కోతకు పనివారిని పంపుమని కోత యజమానుని వేడుకొనుడి.’ (మత్త. 9:37, 38) ‘ఎడతెగక దేవాలయములో ఉండి దేవుని స్తోత్రము చేయుచుండిన’ యేసు శిష్యులవలె ఉత్సాహం గలవారమై ఉండేందుకు అది మనలను పురికొల్పదా?—లూకా 24:53.
5 ప్రతిదినం సత్యాన్ని తెలియజేయండి: ప్రతిదినం ఇతరులకు సత్యాన్ని తెలియజేసే మార్గాల కొరకు మనం చూడాలి. అవకాశాలు వెంటనే సౌలభ్యమే. మీరు సరుకులు కొనేటప్పుడు అంగడివానికి కరపత్రాన్ని ప్రతిపాదించడాన్ని గూర్చి మీరు ఆలోచించారా? లేదా మీరు ఇంటివద్ద కలవని వారికి ఉత్తరం వ్రాయడాన్ని గూర్చి ఆలోచించారా? వినేవారని మీరు భావించే ఒక స్నేహితునికి(రాలికి) లేదా పరిచయంగల వ్యక్తికి ఫోను చేయడానికి మీరు కొన్ని నిమిషాలు తీసుకోగలరా? అలాగే, ప్రతిదినం మీ నిరీక్షణను ఇతరులతో పంచుకునేందుకు మీకుగల మరనేక అవకాశాలను గూర్చి మీరు ఆలోచించగలరు. మీరు ప్రయత్నం చేసి, కొంత ధైర్యాన్ని ప్రదర్శిస్తే, యెహోవా మీకు సహాయపడతాడు.—1 థెస్స. 2:2.
6 కాబట్టి, మనం దైనందిన కార్యక్రమాలను ఆరంభించేటప్పుడు ‘ఈ రోజు ఒక అవకాశం లభించినట్లయితే, నా నిరీక్షణను మరొకరితో పంచుకోవడానికి నేను చొరవ తీసుకుంటానా?’ అని మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. ‘నేను . . . దేవుని రాజ్యసువార్తను ప్రకటింపవలెను’ అని తాను భూమ్మీదకు ఎందుకు పంపబడ్డాడో వివరించిన యేసు దృక్పథాన్ని అనుకరించండి. (లూకా 4:43) మనం మన బోధకునివలె ఉండాలని కోరుకుంటున్నట్లయితే మనం కూడా అదే చేస్తాము.—లూకా 6:40.