దైవపరిపాలనా పరిచర్య పాఠశాల వ్రాతపూర్వకమైన పునఃసమీక్ష
పుస్తకాలను మూసివేసి, సెప్టెంబరు 4 నుండి డిశంబరు 18, 1995 మధ్యవారాల్లోని ప్రసంగాల సమాచారాన్ని పునఃసమీక్షించడం. కేటాయించబడిన సమయంలోనే మీరు వ్రాయగల్గినన్ని ప్రశ్నలకు జవాబులు వ్రాయడానికి వేరే పేపరును ఉపయోగించండి.
[గమనిక: వ్రాతపూర్వక పునఃసమీక్ష సమయములో ఏ ప్రశ్నలకు సమాధానమిచ్చుటకైనను కేవలము బైబిలును మాత్రమే ఉపయోగించవచ్చును. వాటి ప్రక్కలోవున్న రెఫరెన్సులు మాత్రము మీ వ్యక్తిగత పరిశోధనకైయున్నవి. ది వాచ్‌టవర్ రెఫరెన్సులున్న ప్రతిచోట పేజీ మరియు పేరాగ్రాఫ్ నెంబర్లు ఉండకపోవచ్చును.]
ఈ క్రింది వాక్యములు సత్యమో, అసత్యమో వ్రాయండి:
1. యెషయా 66:7 నందు ప్రస్తావించబడిన “మగపిల్ల” 1914 నందలి మెస్సీయ యొక్క రాజ్య ఉద్భవాన్ని సూచించడంలేదు గానీ, 1919 నందు అభిషక్త క్రైస్తవుల ఆత్మీయ జనాంగపు ఉద్భవాన్ని సూచిస్తుంది. [వారపు బైబిలు పఠనం; w89 9/1 18వ పేజీ (ఆంగ్లం) చూడండి.]
2. మరో విధంగా అయితే యెహోవా చేసివుండని పనులు చేయడానికి కూడా యథార్థమైన విజ్ఞాపనలు ఆయనను పురికొల్పగలవనేందుకు యెషయా 38:5 మనకు సహాయపడుతుంది. [వారపు బైబిలు పఠనం; w95 4/1 15వ పేజీ చూడండి.]
3. భూమి మీదున్న అల్పుడైన మానవుడు, విశ్వానికే సృష్టికర్తయైనవాన్ని దుఃఖపెట్టగలడు లేదా సంతోష పెట్టగలడు. (యెష. 63:10) [వారపు బైబిలు పఠనం; w93 6/15 15వ పేజీ చూడండి.]
4. గర్భధారణ సమయంలో జీవం ప్రారంభమవ్వడం గూర్చి బైబిలు చెప్పే దానికి యిర్మీయా 1:5 మద్దతునిస్తుంది. [వారపు బైబిలు పఠనం; w89 6/15 29వ పేజీ (ఆంగ్లం) చూడండి.]
5. ఇతరుల పాపాలకు ప్రతిగా యేసుక్రీస్తు విమోచన బలిగా మరణిస్తాడని యెషయా 53:5, 12 ప్రవచించింది. [వారపు బైబిలు పఠనం; w92 10/1 14వ పేజీ (ఆంగ్లం) చూడండి.]
6. నిజానికి యెషయా 48:17, దేవుని వాక్యాన్ని మన జీవితాల్లో అన్వయించుకుని, అందులోని సూత్రాలు నిజంగానే పనిచేస్తాయన్న విషయాన్ని మనమే స్వయంగా చూడాలని చెబుతోంది. [వారపు బైబిలు పఠనం; w95 3/1 12వ పేజీ చూడండి.]
7. యెహోవాసాక్షులు రాజకీయ కార్యక్రమాల్లో భాగం వహించకపోయినప్పటికీ, రాజకీయ పార్టీలో చేరడం, ఎన్నికల్లో పాల్గొనడం విషయంలోగానీ లేక ఓటు వేయడం విషయంలోగానీ వారు ఇతరుల విషయాల్లో జోక్యంచేసుకోరు. [uw 166పేజీ 12వ పేరా]
8. క్రీస్తుకు పూర్వమున్న నమ్మకమైన దేవుని సేవకులకు, మనం నిరీక్షించే నూతనలోకాన్ని గూర్చి ఏమీ తెలియదు. [వారపు బైబిలు పఠనం; w95 2/15 11వ పేజీ చూడండి.]
9. అక్షరార్థంగా కోరెషు తలపై నూనె పోయడం జరిగిందనేందుకు రుజువులేకపోయినప్పటికీ అతడు యెహోవా యొక్క ‘అభిషక్తుడు’ అయ్యాడు. (యెష. 45:1) [వారపు బైబిలు పఠనం; w92 11/15 30వ పేజీ (ఆంగ్లం) చూడండి.]
10. దేవున్ని పూర్ణ భక్తితో ఆరాధించేందుకు, సాతాను భూ విధానాన్ని యెహోవా నాశనం చేయబోయే ఆ దినము ఘడియను తెలుసుకోవడం అవసరం. [uw 176వ పేజీ 2వ పేరా]
ఈ క్రింది ప్రశ్నలకు జవాబులనివ్వండి:
11. ఒక వ్యక్తి రక్తాన్ని నిరాకరిస్తానన్న తన నిర్ణయాన్ని గూర్చి తన వైద్యునితో ఎప్పుడు చెప్పాలి? [uw 158వ పేజీ 9వ పేరా]
12. యేసు ఏ విధంగా ఈ లోక సంబంధి కాడు? [uw 161వ పేజీ 2వ పేరా]
13. దేవుని వాక్యాన్ని ధైర్యంగా ప్రకటించడం అంటే ఏమి కాదు? [uw 175వ పేజీ 13వ పేరా]
14. మనం నిజంగా సువార్తను హత్తుకొనియుంటే, మన మీద ఏ బాధ్యత ఉంటుంది? [uw 169వ పేజీ 2వ పేరా]
15. భూమి మీదున్న జనాంగాలన్నింటిలో దేవుని ఎడల “సత్యమునాచరించు నీతిగల జనము” ఏది మరియు ఆ జనాంగానికి చేర్చబడినవారు ఎవరు? (యెష. 26:2, 15) [వారపు బైబిలు పఠనం; w95 1/1 10-11 పేజీలు చూడండి.]
16. యెషయా 32:1, 2 ప్రకారం, పెద్దల ముఖ్య పాత్ర ఏమిటి? [వారపు బైబిలు పఠనం; w93 4/1 30వ పేజీ (ఆంగ్లం) చూడండి.]
17. ప్రపంచవ్యాప్తంగా యెహోవాసాక్షుల మధ్య దైవిక బోధ, స్పష్టంగా కనిపించే ఏ ఫలాన్ని ఫలించింది? (యెష. 54:13) [వారపు బైబిలు పఠనం; w94 3/1 17వ పేజీ (ఆంగ్లం) చూడండి.]
18. ఏ మూడు సువార్తల్లోను మరియు వాటి అధ్యాయాల్లోనూ “విధానంతము”ను గుర్తించే సంయుక్త సూచనను గూర్చిన సమాచారం అందించబడింది? [uw 178వ పేజీ 5వ పేరా]
19. సన్హెరీబు, యూదా కోటయైన లాకీషును జయించినప్పుడు తన చారిత్రక వృత్తాంతంలో ఎలా గొప్పలు వ్రాసుకున్నాడో అలా యూదా రాజధానియైన యెరూషలేమును జయించాడన్న విషయాన్ని గూర్చి గొప్పలు ఎందుకు వ్రాసుకోలేకపోయాడు? (యెష. 37:36) [వారపు బైబిలు పఠనం; w93 6/1 6వ పేజీ (ఆంగ్లం) చూడండి.]
20. యెషయా 27:1 లోని “మకరము” ఎవరిని మరియు దేనిని సూచిస్తోంది? [వారపు బైబిలు పఠనం; w86 8/15 31వ పేజీ (ఆంగ్లం) చూడండి.]
క్రింది వాక్యాలను పూరించడానికి అవసరమైన పదాన్ని (పదాలను) లేక మాటలను చేర్చండి:
21. ఒక వ్యక్తి ఆసుపత్రిలో చేరి పేరు నమోదు చేసుకున్నప్పుడు, రక్తం ఉపయోగించవద్దని _____________________గా అభ్యర్థించాలి మరియు తనను చూసే వైద్యునితో ఈ విషయాన్ని గూర్చి వ్యక్తిగతంగా _____________________లి. [uw 158వ పేజీ 9వ పేరా]
22. మనం యెహోవా మీద ఆధారపడుతున్నామని చూపించేందుకు రెండు మార్గాలేమిటంటే, క్రమంగా _____________________కు హాజరవ్వడం మరియు క్రమంగా ఆయనకు _____________________ చేయడం. [uw 170-1 పేజీలు 5-7 పేరాలు]
23. యెషయా 8:14 మరియు 28:16 నెరవేర్పుగా యూదులకు యేసు _____________________ రాయి అయ్యాడు, కానీ యెహోవా తన ఆత్మీయ ఇంటిని నిర్మించే పునాదికి ఆయన _____________________ అయ్యాడు. [si 123వ పేజీ 36వ పేరా]
24. ఎఫెసీయులు 1:9, 10 నందు సూచించబడిన పరిపాలన _____________________ చుట్టూ అల్లబడింది మరియు మానవుల్లో కొందరు _____________________లో జీవించే ఉత్తరాపేక్షతోనూ ఇతరులు _____________________ మీద జీవించే ఉత్తరాపేక్షతోనూ ఆయన ద్వారా దేవుని ఎదుట _____________________ స్థానానికి తీసుకురాబడతారు. [uw 186 పేజీ 6వ పేరా]
25. రోమీయులు 8:19-21 నందు సూచించబడిన “దేవుని కుమారులు,” తమ _____________________ ప్రతిఫలాన్ని పొందిన ఆత్మాభిషేక కుమారులే మరియు ఈ దుష్ట విధానపు _____________________లో క్రీస్తుతో పాటు భాగం వహిస్తూ వారు నిజంగా తమ పనిని ప్రారంభించారనే రుజువును _____________________ మీద మానవులు చూసినప్పుడు వారు బయల్పర్చబడతారు. [uw 188పేజీ 11వ పేరా]
ఈ క్రింది వాక్యాల నుండి సరైన జవాబును ఎంపిక చేయండి:
26. తొలిక్రైస్తవులు మానవజాతి విద్వేషకులుగా ఎగతాళికి గురయ్యారు ఎందుకంటే వాళ్లు (అవిశ్వాసులతో మాట్లాడేవారు కాదు; విగ్రహాలను ఆరాధించేవారు కాదు; దౌర్జన్యపూరితమైన మరియు లైంగిక దుర్నీతిగల వినోదాన్ని విడనాడారు). [uw 163వ పేజీ 7వ పేరా]
27. మత్తయి 13:36-43 నందలి యేసు ఉపమానంలో గోధుమలు (పూర్వకాలపు నమ్మకమైన వ్యక్తులను; గొప్ప సమూహమును; అభిషక్త క్రైస్తవులను) సూచిస్తున్నాయి, అయితే గురుగులు (అవిశ్వాసులందరిని; అనుకరణ క్రైస్తవులను; శాస్త్రులు మరియు పరిసయ్యులను) సూచిస్తున్నాయి. [uw 179వ పేజీ 7వ పేరా]
28. రాజకీయ పాలకులు అబద్ధ మతాన్ని నాశనం చేసిన తర్వాత, వారు ధిక్కారప్రవృత్తితో (వాణిజ్యవ్యవస్థకు; ఐక్యరాజ్య సమితికి; యెహోవా సర్వాధిపత్యాన్ని ఉన్నతపర్చే వారిమీదికి) తిరుగుతారు. [uw 182వ పేజీ 13వ పేరా]
29. పందొమ్మిదివందల పద్నాలుగులో సుమారు (1,100; 5,100; 10,100) మంది చురుకుగా ప్రకటించేవారు ఉండేవారు. [వారపు బైబిలు పఠనం; w94 9/1 16వ పేజీ చూడండి.]
30. (దానియేలు; యెషయా; మోషే) తప్ప ఏ ఇతర ప్రవక్తల స్వీయ చరిత్ర లేదు కానీ యిర్మీయాను గూర్చిన సంపూర్ణ స్వీయ చరిత్ర మనకుంది. [si 124వ పేజీ 5వ పేరా]
క్రింద ఇవ్వబడిన వాక్యాలతో లేఖనాలను జతచేయండి: లేవీ. 17:11, 12; యెష. 43:10; యిర్మీ. 7:31; యోహా. 8:41, 44, 47; అపొ. 4:13
31. పరిమితమైన లౌకిక విద్య ఒక వ్యక్తి సువార్తను ధైర్యంగా ప్రకటించే విషయంలో అతనిని అనర్హుణ్ణి చేయదు. [uw 172వ పేజీ 8వ పేరా]
32. రక్తాన్ని లేఖనాధారంగా ఉపయోగించగల ఒకేఒక విధానం, దాని పవిత్రతను ఉన్నతపర్చి, క్రీస్తు బలి విలువను నొక్కి తెలుపుతుంది. [uw 159వ పేజీ 11వ పేరా]
33. మాటల కన్నా, ఒక వ్యక్తి క్రియలు మరియు అతని దృక్పథాలు అతని ఆత్మీయ తండ్రి ఎవరన్న విషయాన్ని స్పష్టంగా బయల్పరుస్తాయి. [uw 185వ పేజీ 5వ పేరా]
34. యెహోవాకు ముందు ఎవరూ లేరు; ఆయనకు ముందు ఏ దేవుడూ లేడు మరియు ఆయన తర్వాత ఏ దేవుడూ ఉండడు ఎందుకంటే ఆయనే నిత్యుడు, సర్వోన్నత సర్వాధిపతి. [వారపు బైబిలు పఠనం; w92 1/15 22వ పేజీ (ఆంగ్లం) చూడండి.]
35. నేడు తమ పిల్లలను విగ్రహాలకు బలిగా అర్పించడమన్న తలంపే అనేకమంది వయోజనులకు రాదు. అయినప్పటికీ లక్షలాదిమంది పిల్లలు గర్భస్రావం ద్వారా బుద్ధిపూర్వకంగా చంపబడుతున్నారు, మరి లక్షలాదిమంది యువకులు యుద్ధపు బలిపీఠంపై ఆహుతి అవుతున్నారు. [వారపు బైబిలు పఠనం; w88 1/15 31వ పేజీ (ఆంగ్లం) చూడండి.]