సంఘ కూటాలకు సిద్ధపడి వాటినుండి ఆనందాన్ని పొందండి
1 సహోదరులతో సహవసిస్తూ, మన వారపు కూటాలకు మనం వివేకయుక్తంగా క్రమంగా సమకూడుతాము. (1 తిమో. 4:15, 16) వాటినుండి ఆనందాన్ని అధిక ప్రయోజనాన్ని మనం ఎలా పొందగలము?
2 కూటాలకు సిద్ధపడేందుకు క్రమంగా సమయాన్ని కేటాయించాలి. బహుశ సిద్ధపడే విషయంలో కొందరు ఇతరులకంటే అధిక సమయాన్ని గడపగలుగవచ్చు. అయినప్పటికీ, మనకు ఎంత తీరికలేకపోయినప్పటికీ కూటాలకు సిద్ధపడేందుకు కొంత సమయాన్ని కేటాయించడం వివేకయుక్తం. కుటుంబమంతా కలిసి సిద్ధపడడం ప్రత్యేకంగా ప్రయోజనకరం.—ఎఫె. 5:15, 16.
3 దైవపరిపాలనా పరిచర్య పాఠశాల కొరకు: వారపు బైబిలు పఠన పట్టికకు అనుగుణంగా చదివేందుకు ప్రయాసపడండి. (యెహో. 1:8) అక్కడ ప్రసంగించబడే సమాచారాన్ని పునఃసమీక్షించి, ప్రసంగీకులతో పాటు మీరు కూడా చూసుకునేందుకుగాను అవసరమైన ప్రచురణలను తెచ్చుకోండి. మీ పరిచర్యలో ఈ సమాచారాన్ని ఏయే విధాల్లో ఉపయోగించాలో మీరు ఆలోచించండి.
4 సేవా కూటం కొరకు: మన రాజ్య పరిచర్యలో ఇవ్వబడిన కార్యక్రమాన్ని చూడండి. చర్చించబడే శీర్షికలను చదవండి. కావలికోట నుండి లేక మరో ప్రచురణ నుండి సమాచారం తీసుకోబడుతున్నట్లైతే, చూసి దాన్ని కూడా చదవండి. ప్రాంతీయ సేవా అందింపులు ప్రదర్శించబడుతున్నట్లైతే, మీరు మీ పరిచర్యలో వాటిని ఉపయోగించడానికి సిద్ధంగా ఉండేలా వీటిని ముందుగానే పరిశీలించండి.
5 కావలికోట పఠనం కొరకు: ప్రశ్నలకు జవాబులను కనుగొంటూ పఠనాంశాన్ని ముందుగా చదవండి. అక్కడ సూచించబడిన లేఖనాలను చూడడం, మీరు మరింత అవగాహనను పొందేందుకు మీకు సహాయపడుతుంది. మీకు ముందుగానే తెలిసిన వాటితో ఆ పాఠం ఎలా పొందిక కల్గివుందన్న విషయంపై ధ్యానించడం మీ జ్ఞానాన్ని విస్తృతపరుస్తుంది. కనీసం ఒకటి లేక రెండు పేరాలపై క్లుప్తమైన వ్యాఖ్యానాలనందించేలా సిద్ధపడుతూ పఠనంలో భాగం వహించడానికి పథకం వేసుకోండి. ‘మన నిరీక్షణ విషయమై బహిరంగ ప్రకటన’ చేయడంలో ఇది ఒక ప్రాముఖ్యమైన పద్ధతి.—హెబ్రీ. 10:23.
6 సంఘ పుస్తక పఠనం కొరకు: మొదట, సమాచారాన్ని పరిశీలించండి; అధ్యాయం యొక్క శీర్షికను మరియు ఉపశీర్షికలను పరిశీలించండి. తర్వాత, మీరు చదువుతుండగా ప్రాముఖ్యమైన విషయాలను పరిశీలించండి. దాన్ని సమర్థించే బైబిలు లేఖనాలను పరిశీలించండి. మీ స్వంత మాటల్లో ప్రశ్నలకు జవాబులనిచ్చేందుకు ప్రయత్నించండి. మీరు ఆ పాఠాన్ని సిద్ధపడిన తర్వాత, దాన్ని మీ మనస్సులో పునఃసమీక్షించండి. ముఖ్యమైన విషయాలను మరియు తర్కనా విధానాన్ని జ్ఞాపకం చేసుకునేందుకు ప్రయత్నించండి.—2 తిమో. 2:15.
7 కూటాల్లో ఆనందించండి: కూటాలందు పూర్తిగా ఆనందించేందుకు, యెహోవా ఆత్మ కొరకు కోరుతూ ప్రారంభ ప్రార్థనలో భాగంవహించేందుకుగాను సమయానికి రావడం ప్రాముఖ్యం. ఉపశమనాన్నిచ్చే రాజ్య కీర్తనల నుండి కూడా మీరు ప్రయోజనంపొందుతారు. మీకు చిన్న పిల్లలు లేనట్లైతే లేక హాల్లో వెనకాల కూర్చునేందుకు మరేదైనా కారణం లేనట్లైతే, ముందు కూర్చోవడం వల్ల మీకు పరధ్యానం కలిగించే విషయాలు తక్కువగా ఉంటాయని మరియు ఆ కార్యక్రమంనుండి మీరు మరెక్కువ ప్రయోజనాన్ని పొందగలరని మీరు కనుగొనవచ్చు. కూటాల సమయంలో బైటికి తీసుకువెళ్లవల్సిన చంటి పిల్లలున్న తలిదండ్రులు వెనక భాగంలో తలుపుకు దగ్గరగా కూర్చోవడం వల్ల ఇతరులకు కలిగే పరధ్యాసను తగ్గించగలుగుతారు.
8 చదువబడే లేఖనాలను చూసేందుకు ప్రయత్నించడం మీరు వినేవాటిని జ్ఞాపకముంచుకునేందుకు సహాయపడుతుంది. మీరు నేర్చుకున్న వాటిని గూర్చి మీ కుటుంబంతోనూ స్నేహితులతోనూ మాట్లాడడం మీ మనస్సులో ఆ సమాచారం ముద్రితమైవుండేందుకు సహాయపడుతుంది. ఈ సలహాలను అన్వయించుకోవడం, కూటాలను మరింత అర్థవంతంగానూ ఆనందించదగినవిగానూ ఉండేట్లు చేస్తుంది మరియు అవి నిజంగా “ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును [మనలను]” పురికొల్పుతాయి.—హెబ్రీ. 10:24, 25.