నవంబరులోని సేవా కూటాలు
నవంబరు 6తో ప్రారంభమయ్యే వారం
పాట 6 (4)
10 నిమి: స్థానిక ప్రకటనలు. మన రాజ్య పరిచర్య నుండి ఎంపిక చేయబడిన ప్రకటనలు.
15 నిమి: “ప్రతి లేఖనము ఉపదేశించుటకు ప్రయోజనకరమై ఉన్నది.” నూతన లోక అనువాదము మిగిలినవాటికన్నా ఎందుకు శ్రేష్ఠమైనదో చూపిస్తూ దానిలోని విశేషతలను చర్చించండి. అది ఆధునిక భాషలో అనువదించబడినందువల్లగల ప్రయోజనాలను వివరించండి. (“ప్రతి లేఖనము” అనే ఆంగ్ల పుస్తకం 328వ పేజీ 4-6 పేరాలు చూడండి.) రెండు అందింపులను ప్రదర్శించండి, ఒకటి నూతన లోక అనువాదమును ప్రతిపాదించడం, మరొకటి స్థానికంగా లభ్యమయ్యే రెండు పాత 192 పేజీల పుస్తకాలను ప్రత్యేక వెలకు ప్రతిపాదించడం.
20 నిమి: “బేతేలు సేవ—మరెక్కువ మంది స్వచ్ఛంద సేవకుల అవసరం ఉంది.” ప్రసంగం. 14-18 పేరాలను చర్చిస్తూ, బేతేలు సేవ అనే లక్ష్యాన్ని గూర్చి, ప్రతిపాదించబడిన సలహాలకనుగుణంగా దాని కొరకు కుమారుడు ఎలా సిద్ధపడాలనే దాని గూర్చి ఒక తండ్రి యౌవనారంభంలోని తన కుమారునితో మాట్లాడడాన్ని ప్రదర్శించడానికి ఏర్పాటు చేయండి. మునుపటి లేదా ప్రస్తుత బేతేలు కుటుంబ సభ్యులు సంఘంలో ఉన్నట్లయితే, తండ్రి తన కుమారునితో చేసే ఈ చర్చలో ఆ ఇద్దరు లేక ముగ్గురు సహోదరులను ఇమడ్చవచ్చు. 19-23 పేరాలను ప్రశ్నా జవాబులతో చర్చించాలి.
పాట 2 (113) మరియు ముగింపు ప్రార్థన.
నవంబరు 13తో ప్రారంభమయ్యే వారం
పాట 33 (13)
10 నిమి: స్థానిక ప్రకటనలు. అకౌంట్స్ రిపోర్ట్. వారాంతంలోని ప్రాంతీయ పరిచర్య కార్యక్రమానికి ఏర్పాట్లను పునఃసమీక్షించండి.
15 నిమి: “క్రమంగా కూటాలకు హాజరు కావడం—మనం స్థిరంగా నిలబడడానికి ఎంతో ఆవశ్యకం.” ప్రసంగం మరియు ప్రేక్షకులతో చర్చ.
20 నిమి: “సువార్తకు తగినట్లుగా ప్రవర్తించుడి.” ప్రశ్నా జవాబులు. జూన్ 15, 1989, కావలికోట (ఆంగ్లం) 16-17 పేజీలు, 5-9 పేరాల ఆధారంగా అదనపు వ్యాఖ్యానాలను చేయండి.
పాట 23 (19) మరియు ముగింపు ప్రార్థన
నవంబరు 20తో ప్రారంభమయ్యే వారం
పాట 64 (35)
10 నిమి: స్థానిక ప్రకటనలు.
15 నిమి: స్థానిక అవసరాలు. (లేదా జూన్ 15, 1994 కావలికోట 8-11 పేజీల ఆధారంగా “వ్యక్తిగతంగా పఠించడంలో మీరు ఆనందిస్తారా?” ప్రసంగం.)
20 నిమి: “బైబిలు విలువను గుణగ్రహించడానికి ఇతరులకు సహాయపడండి.” బైబిలు పఠనాలను ఆరంభించాలనే లక్ష్యంతో మనమెందుకు పునర్దర్శనాలను చేయాలో ఇద్దరు ముగ్గురు ప్రచారకులతో పెద్ద చర్చిస్తాడు. పునర్దర్శనాల కొరకైన అందింపులను పునఃసమీక్షించి, అభ్యాస కార్యక్రమంలో అన్నట్లుగా వాటిని ప్రదర్శించండి.
పాట 8 (88) మరియు ముగింపు ప్రార్థన.
నవంబరు 27తో ప్రారంభమయ్యే వారం
పాట 96 (30)
15 నిమి: స్థానిక ప్రకటనలు.
15 నిమి: “పైనున్నవాటి మీద మీ మనస్సును ఉంచండి.” ప్రశ్నా జవాబులు.
10 నిమి: “సరైన పదాలు తప్పుడు బోధను త్రిప్పి కొడతాయి.” ప్రసంగం. సొసైటీ ప్రచురణల్లో ఉపయోగించబడిన దైవపరిపాలనా పారిభాషిక పదాలను నేర్చుకోవడానికి అప్రమత్తంగా ఉండాలని సహోదరులను ప్రోత్సహించండి.
15 నిమి: డిశంబరు నెలలో జీవించిన వారిలోకెల్లా మహా గొప్ప మనిషి అనే పుస్తకాన్ని ప్రతిపాదించడం. పుస్తకంలోని ఆకర్షణీయమైన విశేషతలను—శ్రద్ధనాకర్షించే శీర్షికలను మరియు ఆసక్తికరమైన చిత్రాలను అలాగే వివరణల్లోని సరళతను, కుదించబడిన పరిమాణాన్ని, ప్రశ్నలను నిపుణతతో ఉపయోగించడాన్ని—పునఃసమీక్షించండి. స్థానిక ప్రాంతంలోని ప్రజలను ఆకర్షించే కొన్ని సంభాషణా అంశాలను ప్రత్యేకంగా చెప్పండి. మహాగొప్ప మనిషి అనే పుస్తక ప్రతిపాదనను, ప్రత్యామ్నాయ పుస్తకమైన నిరంతరం జీవించగలరు అనే పుస్తకాన్ని అందించడాన్ని ప్రదర్శించండి. నిరంతరం జీవించగలరు అనే పుస్తకం బైబిలు పఠనాలను నిర్వహించడానికి రూపకల్పన చేయబడింది, బైబిలు పఠనాలను ఆరంభించాలనే దృష్టితో పుస్తకాలను అందించిన అన్ని చోట్ల తిరిగి వెళ్ళేందుకు ప్రత్యేక ప్రయత్నాలు చేయాలి. డిశంబరులో ప్రాంతీయ పరిచర్యలో ఈ పుస్తకాలను చక్కగా ఉపయోగించేందుకు అందరినీ ప్రోత్సహించండి.
పాట 78 (112) మరియు ముగింపు ప్రార్థన.