సంతోషించే తలిదండ్రులు!
1 మీరు క్రైస్తవ కుటుంబంలో జీవిస్తున్న యౌవనస్థుడైతే, మీరు మీ తలిదండ్రులను సంతోషపరచగల ఒక ప్రత్యేక మార్గముంది. మీరు నీతియుక్తమైన మార్గాన్ని చేపడితే, ‘మీ తలిదండ్రులు సంతోషిస్తారు.’ (సామె. 23:22-25) మీ తలిదండ్రులు సహజంగా మీ మంచినే కోరుతారు. మీరు సత్యాన్ని మీ స్వంతం చేసుకోవడాన్ని, మీ జీవితాన్ని యెహోవాకు సమర్పించుకోవడాన్ని చూడడంకన్నా ఎక్కువగా మరేదీ వారిని సంతోషపరచదు.
2 సత్యంలో ఉన్న తలిదండ్రులు మీకు ఉండడంవల్ల మీరు కృతజ్ఞులై ఉండగలరు. మీ జననం నుండి, వారు మీకు ఆహారాన్నిచ్చారు, దుస్తులనిచ్చారు, మీకు ఆశ్రయాన్నిచ్చారు, అలాగే మీకు ఆరోగ్యం బాగోలేని సమయాల్లో మీకు పరిచర్య చేశారు. మరి ముఖ్యంగా, యెహోవాను గూర్చి, ఆయన నీతియుక్తమైన మార్గాలను గూర్చి మీకు బోధించడానికి వారు శ్రమపడ్డారు; మీకు నిత్యజీవాన్ని ఖాయపరచే తర్ఫీదు ఇది. (ఎఫె. 6:1-4) మీరు మీ మెప్పుదలను ఎలా కనబరచగలరు?
3 సత్యాన్ని మీ సొంతం చేసుకోండి: సత్యాన్ని గంభీరంగా తీసుకోవాలని, ఆత్మీయ అభివృద్ధిని సాధించాలని, యెహోవా సంస్థకు సన్నిహితంగా ఉండాలని మీకు బోధించేందుకు మీ తలిదండ్రులు ప్రయత్నించారు. బలవంతం చేయనవసరంలేకుండానే కుటుంబ అధ్యయనంలో ఆసక్తిని చూపించడం ద్వారా మీ ప్రశంసను చూపించగలరు. కుటుంబమంతా కూటాలకు సమయానికి చేరుకునేలా సిద్ధపడేందుకు మీ అంతట మీరే చొరవ తీసుకోవడం ద్వారా కూటాలకు హాజరు కావాలన్న మీ కోరికను కనబరచండి. కూటాల్లో మీ తలిదండ్రుల ప్రక్కన కూర్చుని, పఠించబడుతున్న పుస్తకాన్ని చూస్తూ బాగా శ్రద్ధ చూపించండి. వ్యాఖ్యానాల ద్వారా కూటాల్లో పాల్గొనడానికి ప్రయత్నించండి. ప్రసంగాలను స్వీకరించి మీకు సాధ్యమైనంత చక్కగా వాటిని నిర్వహిస్తూ, దైవపరిపాలనా పరిచర్య పాఠశాలలో సంసిద్ధత గల విద్యార్థిగా మిమ్మల్ని మీరు కనబరచుకోండి. రాజ్యమందిరం చుట్టుప్రక్కల శుభ్రం చేయవలసిన పనుల్లో, మీ తోడ్పాటు ప్రయోజనకరంగా ఉండగల చోట సహాయపడేందుకు స్వచ్ఛందంగా వెళ్ళండి. అలాంటి పనులను చేయడం, ఆత్మీయంగా మీకు మేలైనదానిపై మీ హృదయాన్ని కేంద్రీకరింపజేయగలవు.
4 అభివృద్ధికరమైన లక్ష్యాలను పెట్టుకోండి: ప్రచారకునిగా యోగ్యత పొందే కోరికను కనబరుస్తూ, ప్రాంతీయ పరిచర్యలో అర్థవంతమైన భాగాన్ని కలిగి ఉండేందుకు ప్రయత్నం చేయండి. వారపు బైబిలు పఠన పట్టిక ప్రకారం చదవండి లేదా మరింత ఎక్కువ ప్రయోజనం పొందేందుకు బైబిలు మొత్తాన్ని మీ అంతట మీరే చదవండి. సమర్పణ మరియు బాప్తిస్మం మొదలగు వాటి కొరకైన యోగ్యతలను పొందేందుకు దృఢనిశ్చయం తీసుకోండి. యెహోవా సేవలో పూర్తి భాగాన్ని కలిగి ఉండేందుకు మిమ్మల్ని సంసిద్ధం చేసే తర్ఫీదును పొందాలనే దృష్టితో మీ పాఠశాలలో సబ్జెక్టులను జాగ్రత్తగా ఎంపిక చేసుకోవడానికి మీ తలిదండ్రులు మీకు సహాయపడగలరు. పయినీరింగ్ లేక బేతేలు సేవ వంటి ఆధిక్యతల కొరకు ఇతరులు మిమ్మల్ని సిఫారసు చేసేలా ప్రేరేపించే మంచి పేరును సంపాదించుకొనడంపై శ్రద్ధ నిలపండి. (అపొ. 16:1, 2) మీరు లక్ష్యాలను సాధించడం, ‘శ్రేష్ఠమైన కార్యములను వివేచించుటకు, . . . నీతిఫలముతో నిండుకొనుటకు’ మీకు సహాయపడుతుంది.—ఫిలి. 1:9-11.
5 యౌవనమనేది నేర్చుకొనే, అనుభవాన్ని పొందే, ఇతరులతో మెలిగే నైపుణ్యాలను సంపాదించుకునే సమయం. పెద్దరికంతో వచ్చే ఒత్తిళ్ళు, బాధ్యతలు ఏమీ లేకుండా జీవితంలో ఆనందించగల సమయం ఇదే. సొలొమోను ఈ విధంగా చెప్పాడు: ‘యౌవనుడా, నీ యౌవనమందు సంతోషపడుము, నీ యౌవనకాలమందు నీ హృదయము సంతుష్టిగా ఉండనిమ్ము.’ (ప్రస. 11:9) మీ యౌవనంలో యెహోవాను సేవించడానికి మీ హృదయాన్ని కేంద్రీకరిస్తున్నట్లయితే, నిరంతరమూ నిలిచే ఆశీర్వాదాలను మీరు పొందుతారు.—1 దిన. 28:9.
6 మీరు ‘యౌవనేచ్ఛలకు’ బదులుగా ‘నీతిని వెంటాడినట్లయితే’ మీరు మీ తలిదండ్రులను చింత మరియు హృదయవేదనల అమిత భారం నుండి విమోచించినవారౌతారు. (2 తిమో. 2:22) మీరు మీ హృదయాన్ని సంతోషింపజేస్తారు. (సామె. 12:25) అన్నింటికంటే ముఖ్యంగా, మీరు మీ సృష్టికర్తయగు యెహోవా దేవునికి సంతోషాన్ని తెస్తారు.—సామె. 27:11.