మీరు కూడా మంచి అనుభవాలను పొందగలరు!
కొందరు ప్రచారకులు తమకు మరింత ఆనందాన్ని తెచ్చిపెట్టిన ఒక ఇంటికి వెళ్ళిన లేదా పునర్దర్శనాన్ని గూర్చిన ఆసక్తికరమైన, ప్రోత్సాహకరమైన అనుభవాలు చెప్పుకోవడానికి ఎప్పుడూ ఉన్నట్లు కనిపిస్తారు. సాధారణంగా మంచి అనుభవాలు అనేవి యాదృచ్ఛికంగా రావు. అందులో అనేకం శ్రద్ధ మరియు ఎడతెగని ప్రయత్నం వల్ల కలిగినవే. అవి ధారాళంగా మాట్లాడగల, ఎంతో సామర్థ్యంగల ప్రచారకులకు మాత్రమే పరిమితం కాదు.
ఎక్కువ సఫలత పొందినవారిలో గమనించబడిన కొన్ని విషయాలు ఇవి: (1) వారు క్రమంగా, అంటే సాధారణంగా ప్రతివారం అనేకసార్లు పరిచర్యలో పాల్గొంటారు, అది ఆసక్తిగలవారిని కలవడానికి అనేక అవకాశాలను ఇస్తుంది; (2) వారు గృహస్థుల ఎడల అనుకూల దృక్పథాన్ని కలిగి ఉంటారు, వారు ప్రతిస్పందించరు అనే నిర్ధారణకు ముందే రారు; (3) వారు వినేవారి ఎడల ఆప్యాయతను, నిజమైన ఆసక్తిని చూపిస్తూ కలివిడిగా ఉంటారు; (4) వారు పునర్దర్శనాలను చేయడంలో, ఇండ్లవద్ద లేనివారిని దర్శించడంలో శ్రద్ధను, పట్టుదలను చూపిస్తారు; మరియు (5) వారు బైబిలు పఠనాలను ఆరంభించాలనే లక్ష్యాన్ని కలిగి ఉంటారు.
మీ పరిచర్యను విశ్లేషించిన తర్వాత, పరిచర్యను ఫలవంతంగాను, సంతృప్తికరంగాను చేసే ఆ ఆహ్లాదకరమైన అనేక అనుభవాలను మీరెలా పొందగలరో బహుశ మీరు చూడగలరు.