జ్ఞాపకార్థ దినానికి సిద్ధంకండి
జ్ఞాపకార్థ ఆచరణ యొక్క కచ్చితమైన సమయం మరియు స్థలం గురించి ప్రసంగీకునితో సహా, ప్రతి ఒక్కరికీ తెలియజేయబడిందా? కార్యక్రమం 45 నిమిషాలకు మించకూడదని ప్రసంగీకునికి తెలుసా?
చిహ్నాలను తీసుకురావడానికి ఎవరైనా నియమించబడ్డారా? (కావలికోట, ఫిబ్రవరి 15, 1991, పుటలు 26-28, చూడండి.) శుభ్రమైన టేబుల్ క్లాత్ మరియు కావలసినన్ని ప్లేట్లు, గ్లాసులతో బల్లను సిద్ధం చేయడానికి ఏర్పాట్లు చేయబడ్డాయా?
ముందుగానే, అలాగే ఆ తర్వాత రాజ్య మందిరాన్ని శుభ్రం చేసే ఏర్పాట్లు చేయబడ్డాయా? అటెండెంట్లు, చిహ్నాలనందించేవారు నియమించబడ్డారా? వారు చేయవలసిన పనులను గూర్చి చర్చించడానికి సమావేశం జరిగిందా? అందరికీ సరైన విధంగా అందజేయబడేలా చూడడానికి ఏ విధానం అనుసరించబడుతుంది?
వృద్ధులైన, బలహీనులైన సహోదర సహోదరీలు హాజరయ్యేందుకు సహాయపడే ఏర్పాట్లు చేయబడ్డాయా? అభిషక్తులెవరైనా రోగులుగా ఉండి, హాజరు కాలేనట్లయితే, వారికి వాటిని అందించడానికి సిద్ధపాట్లు జరిగాయా?