కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 3/95 పేజీ 2
  • ప్రశ్నాభాగము

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ప్రశ్నాభాగము
  • మన రాజ్య పరిచర్య—1995
  • ఇలాంటి మరితర సమాచారం
  • సువార్తను వ్యాప్తి చేయడానికి కరపత్రాలు ఉపయోగించండి
    మన రాజ్య పరిచర్య—2012
  • బ్రోషర్లను ఉపయోగించుటకు జ్ఞాపకముంచుకోండి
    మన రాజ్య పరిచర్య—1993
  • ప్రాంతీయ సేవకొరకైన కూటములు
    మన రాజ్య పరిచర్య—1991
  • మన పత్రికల్ని బాగా ఉపయోగించండి
    మన రాజ్య పరిచర్య—1996
మరిన్ని
మన రాజ్య పరిచర్య—1995
km 3/95 పేజీ 2

ప్రశ్నాభాగము

◼ మనం సాక్ష్యపు పనిలో ఉపయోగించే ఉపకరణాలకు ఎలాంటి అవధానాన్నివ్వవలసిన అవసరముంది?

1 మనస్సులో సరైన లేఖనాధార సమాచారాన్ని కలిగి ఉన్నప్పటికీ, ఒక సువార్త ప్రచారకుడు తాను ఉపయోగించే ఉపకరణాల విషయంలో సరిగ్గా సిద్ధపడి ఉండకపోవచ్చు. ఇంటి ద్వారము వద్దకు వచ్చేసరికి అతని సాక్ష్యపు బ్యాగ్‌లో ప్రస్తుతం అందించవలసిన సాహిత్యం ఉండకపోవచ్చు. పత్రికలు, బ్రోషూర్‌లు, కరపత్రాలు మడతలు పడి, చినిగిపోయి ఉండవచ్చు. అతడు ఒక పెన్నును లేదా ఇంటింటి రికార్డును కనుగొనలేకపోవచ్చు, ఎందుకంటే, అతని బ్యాగ్‌ సరైన విధంగా సంస్థీకరించబడలేదు. ప్రాంతీయ పరిచర్యలో పాలుపంచుకొనే ముందు మీ ఉపకరణాలకు జాగ్రత్తతో కూడిన అవధానమివ్వడం ప్రాముఖ్యము.

2 చక్కగా సిద్ధంచేయబడిన ఒక సాక్ష్యపు (బ్రీఫ్‌) కేస్‌లో ఏ వస్తువులు ఉండాలి? బైబిలు అత్యవసరము. అనేక ప్రాంతాల్లో మీరు ఎక్కువగా ఉపయోగించవలసి వచ్చే రెండు మూడు భాషల్లో ఒక్కో బైబిలును ఉంచుకోవడం ఆచరణయోగ్యం. ఇంటింటి రికార్డులను కూడా పెట్టుకోండి. ఆయా నెలల్లో అందించవలసిన ప్రచురణలు మీ దగ్గర తప్పకుండా ఉండేలా చూసుకోండి. బహుశ, అనేక భాషల్లోని పత్రికల ప్రస్తుత సంచికలు, అలాగే కరపత్రాలు మరియు బ్రోషూరులు కూడా అవసరమే. తర్కించుట (ఆంగ్లం) పుస్తకం కూడా అందులో ఉంచుకోండి. క్రొత్త మన రాజ్య పరిచర్య తీసుకుంటే, దానిలో సలహా ఇవ్వబడిన సమాచారాన్ని ఇంటింటా ద్వారం వద్దకు వెళ్ళే ముందు పునఃసమీక్షించుకోవడానికి మీకు వీలుంటుంది. మీకు తెలియని భాషను మాట్లాడేవారిని కలిసే అవకాశమున్న ప్రాంతంలో పని చేసేటప్పుడు, సకల జనములకు రాజ్య సువార్త (గుడ్‌ న్యూస్‌ ఫర్‌ ఆల్‌ ది నేషన్స్‌) అనే చిన్న పుస్తకాన్ని కలిగి ఉండడం మంచిది. మన ప్రచురణలలో యౌవనస్థుల కొరకు తయారు చేయబడిన ఒక ప్రచురణను కల్గి ఉండడం యౌవనపు తొలి ప్రాయంలోని వారితో మాట్లాడడానికి సిద్ధంగా ఉండేందుకు మీకు సహాయపడుతుంది.

3 ఉపయోగించే ప్రతి వస్తువును మీ బ్యాగ్‌లో శుభ్రంగా అమర్చుకోవాలి. (బ్రీఫ్‌) కేస్‌ క్రొత్తదై ఉండాలని కాదు గాని, అది శుభ్రంగాను, మంచి స్థితిలోను ఉండాలి. మీ సాక్ష్యపు బ్యాగ్‌, సువార్తను ప్రకటించడంలో ఉపయోగించబడే ఉపకరణాలలో ఒక భాగం. దానిని క్రమబద్ధంగా ఉంచుకోండి.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి