డిశంబరులోని సేవా కూటాలు
డిశంబరు 5 తో ప్రారంభమయ్యే వారం
పాట 68 (34)
12 నిమి: స్థానిక ప్రకటనలు మన రాజ్య పరిచర్య నుండి తగిన ప్రకటనలు. కొత్త పత్రికలను అందించేటప్పుడు నొక్కి చెప్పగల ఆకట్టుకునే ఒకటి రెండు శీర్షికలను చూపగలరు. ఆ శీర్షికల్లో ఒకదాన్ని ఉపయోగిస్తూ, సామర్థ్యంగల ఒక ప్రచారకునితో ప్రదర్శన చేపించాలి.
15 నిమి: “సన్నిహితంగా అనుసరించడానికి ఒక మాదిరి.” ప్రశ్నా జవాబులు.
18 నిమి: “మహాగొప్ప మనిషిని అనుసరించడానికి ఇతరులను ఆహ్వానించండి.” ప్రేక్షకులతో చర్చించండి. రెండు క్లుప్త ప్రదర్శనలకొరకు ఏర్పాటు చేయండి. కచ్చితమైన ఇంటింటి జాబితాను తయారు చేసుకోవలసిన అవసరతను నొక్కి చెప్పండి; ఏ సమాచారాన్ని రాసుకోవాలో క్లుప్తంగా పునఃసమీక్షించండి.
పాట 153 (44) మరియు ముగింపు ప్రార్థన.
డిశంబరు 12 తో ప్రారంభమయ్యే వారం
పాట 86 (45)
13 నిమి: స్థానిక ప్రకటనలు మరియు దైవపరిపాలనా వార్తలు. ఏవైనా చందా వివరాలతో సహా అకౌంట్స్ రిపోర్ట్. క్రిస్టమస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలవంటి లోక పండుగల శుభాకాంక్షలకు ఎలా ప్రతిస్పందించాలో కొన్ని సలహాలు యివ్వండి. “సెలవుదిన సాక్ష్యం” అనే భాగాన్ని చర్చించండి.
14 నిమి: “మీ బోధకు ఎడతెగక శ్రద్ధనివ్వండి.” పాఠశాల అధ్యక్షుని ప్రసంగం. సంఘానికి ముఖ్యంగా అవసరమైన ఏవైనా జ్ఞాపికలను చెబుతూ “దైవపరిపాలనా పరిచర్య పాఠశాల షెడ్యూల్ 1995” లోవున్న ఉపదేశాలను పునఃసమీక్షించండి.
18 నిమి: “దేవుని మందిరము యెడల మెప్పుదలను చూపండి” ప్రశ్నా జవాబులు. కూటాల్లో సమయాన్ని పాటించవలసిన అవసరాన్ని గూర్చి మరి కొన్ని వ్యాఖ్యానాలను చెయ్యండి.—కావలికోట జూన్ 15, 1990 (ఆంగ్లము), పేజీలు 26-9 చూడండి.
పాట 99 (33) మరియు ముగింపు ప్రార్థన.
డిశంబరు 19 తో ప్రారంభమయ్యే వారం
పాట 78 (112)
10 నిమి: స్థానిక ప్రకటనలు. రాబోవు సెలవు సమయంలో ప్రాంతీయ సేవ కొరకైన స్థానిక ఏర్పాట్లను గూర్చి పునఃసమీక్షించండి. స్థానిక ప్రాంతంలో తాజా పత్రికలను అందించవలసిన విధానాలను గూర్చి చెప్పండి.
20 నిమి: “ప్రవచన వాక్యమునకు శ్రద్ధనివ్వండి.” అనుబంధ శీర్షిక. ఒక పెద్ద 1-8 పేరాల్లోని ప్రశ్నా జవాబులను చర్చించాలి. ఉదాహరించబడిన లేఖనాల అన్వయింపును చర్చించాలి.
15 నిమి: “విస్తృతి కొనసాగడం రాజ్యమందిరాల అవసరతను పెంచుతుంది.” ఈ అనుబంధ శీర్షిక ప్రశ్నా జవాబుల చర్చ. “ఒక రాజ్యమందిరాన్ని ఏర్పరచుకోవడమెలా” అనే భాగంలోని అంశాలను పునఃసమీక్షిస్తూ సారాంశం చెప్పండి.
పాట 22 (91) మరియు ముగింపు ప్రార్థన.
డిశంబరు 26 తో ప్రారంభమయ్యే వారం
పాట 74 (41)
5 నిమి: స్థానిక ప్రకటనలు. మీ సంఘానికి వర్తించేదైతే, “మీ కూటాల సమయాలు మారుతాయా?” అనే శీర్షికను చర్చించండి.
20 నిమి: “ప్రవచన వాక్యమునకు శ్రద్ధనివ్వండి.” అనుబంధ శీర్షిక. ఒక పెద్ద 9-13 పేరాల్లోని ప్రశ్నా జవాబులను చర్చించాలి. సిద్ధపడి, క్రమంగా హాజరై, సంఘ పుస్తక పఠనంలో పాలుపంచుకొనవలసిన ప్రాముఖ్యతను నొక్కి చెప్పండి. అంత్యదినాల్లో మన నడిపింపుకు ఎంతో ప్రాముఖ్యమైన ఈ ఆత్మీయ ఉపదేశము యెడల మెప్పును చూపండి.
10 నిమి: “ఆయన అనుచరులయ్యేందుకు వారిని పురికొల్పండి.” ప్రేక్షకులతో చర్చించండి. ఒక క్లుప్త ప్రదర్శన ఉండాలి. అందరూ, ప్రతి వారం ప్రాంతీయ పరిచర్యలోని కొంత సమయాన్ని పునర్దర్శనాలకు ఉపయోగించాలని సిఫారసు చేయండి.
10 నిమి: జనవరి నెలలోని అందింపుకోసం సిద్ధపడండి. ప్రత్యేక అందింపు కోసం సంస్థ పట్టిక వేసిన 192-పేజీల ఏదైనా పాత పుస్తకం. స్థానికంగా స్టాకులో ఉన్న పుస్తకాలను అందించడానికి సరైన సమాచారాన్ని సిద్ధం చేయండి. ఇండ్లలో పుస్తకాలను ఎలా అందించగలమో చూపిస్తూ, సమాచారం ఆచరణాత్మక విలువగలదై ఉండాలి. చెప్పవలసిన సమాచారం తర్కించుట అనే పుస్తకంలోని 9-15 పేజీల్లో కనిపిస్తుంది. అందింపును సామర్థ్యంగల ఒక ప్రచారకునితో ప్రదర్శన చేపించాలి.
పాట 94 (59) మరియు ముగింపు ప్రార్థన.