ఆసక్తి కనపర్చేవారికి ప్రేమపూర్వకంగా సహాయపడండి
1 దేవుని వాక్య సత్యమందు యథార్థమైన ఆసక్తి కనపర్చిన ఒక ఐతియొపీయుని వద్దకు యెహోవా దూత నడిపించినప్పుడు శిష్యుడైన ఫిలిప్పును అతను చదివే దాన్ని అర్థం చేసుకునేందుకుగాను అతనికి సహాయపడడానికి ప్రేమపూర్వకంగా సంసిద్ధుడయ్యాడు. (అపొ 8:26-39) ఆసక్తి కనపర్చిన వారికి సహాయం చేసేందుకు మనం ప్రత్యేకమైన ప్రయత్నం చేస్తామా? మనం చెయ్యాలి, ఎందుకంటే మనకిచ్చిన దైవాజ్ఞలో శిష్యులను తయారుచేయడం యిమిడివుంది. (మత్తయి 28:19, 20) వారికి సహాయపడేందుకు మనం ఏమి చేయగలము?
2 పునర్దర్శనాలు చేసేందుకు ప్రతివారం సమయాన్ని కేటాయించండి. ఆసక్తి కనపర్చినవారిని పునర్దర్శించేందుకు ఏర్పాటు చేసుకోండి, అంతేకాకుండా మొదటి సందర్శనంలో మీరు చర్చించిన లేఖనాధార చర్చను పునఃప్రారంభించేందుకు ప్రయత్నించండి. బైబిలు పఠనాన్ని ప్రారంభించే గురిని మనస్సులో కల్గివుండండి. ఆ గృహస్థుడు పత్రికల చందా చేసేందుకు యింకా వెనుకాడుతున్నట్లైతే, కావలికోట, జరిల్లు! తాజా పత్రికలను అందించేందుకు మరలా క్రమంగా దర్శించండి.
3 మొదటి సందర్శనంలోనే మీరు బిలు విలువను గూర్చి చర్చించివుంటే, “రీజనింగ్” పుస్తకంలో 66 వ పేజీ నందు యిచ్చిన సలహాను ఉపయోగిస్తూ సంభాషణను మరలా ప్రారంభించవచ్చు. మరి మీరు యిలా చెప్పవచ్చు:
◼ “మన ఆధునిక లోకంలో బైబిలు సలహా ఆచరణీయమైనది కాదని కొందరు భావిస్తుంటారు. ఆ విషయాన్ని గూర్చి మీరేమనుకుంటారు? [జవాబివ్వనివ్వండి.] సంతోషభరితమైన కుటుంబ జీవితాన్ని అనుభవించడంలో మనకు సహాయపడగల శ్రేష్ఠమైన సలహాను అందించే పుస్తకం ఆచరణాత్మకమైందని మీరు అంగీకరించరా? [వ్యాఖ్యానించనివ్వండి.] కుటుంబ జీవితపు సిద్ధాంతాలూ అలవాట్లు మారిపోయాయి, మరి నేడు దాని ఫలితాలు బాగోలేనట్లు మనం చూస్తున్నాం. అయితే బైబిలు చెప్పేవాటిని అన్వయించుకునే కుటుంబాలు ప్రాధమికంగా స్థిరంగాను ఆనందంగాను ఉన్నాయి.” కొలొస్సయులు 3:18-21 చదవండి. మీరు బిలును ఎందుకు నమ్మగలరు అనే కరపత్రాన్ని అందించి, మనం ఉచిత బైబిలు పఠన కార్యక్రమాన్ని అందిస్తామని వివరించండి.
4 మరణించినవారి స్థితిని గూర్చిన చర్చను మీరు యిలా ప్రారంభించవచ్చు:
◼ “మరణించినవారి పరిస్థితిని గూర్చి ఎన్నో చర్చలు జరిగాయి. మనం చనిపోయినప్పుడు ఏమి సంభవిస్తుందని మీరనుకుంటున్నారు? [జవాబివ్వనివ్వండి.] మనం మరొక రూపంలో ఉనికిలో ఉంటామని అనేక మతాలు బోధిస్తాయి. ఈ విషయాన్ని గూర్చి బైబిలు చెప్పేదాన్ని తెలుసుకుని అనేకులు ఆశ్చర్యపోయారు. [ప్రసంగి 9:5 చదవండి.] మరణించినవారికి ఎలాంటి స్మారకమూ ఉండకపోయినప్పటికీ, వాళ్లు మరువబడలేదు. తన రాజ్య పరిపాలన క్రింద వారిని తిరిగి జీవింపజేస్తానని దేవుడు వాగ్దానం చేశాడు.” అక్టోబరు 15, 1994, కావలికోట పత్రికను లేక నిరంతర జీవితం పుస్తకంలోని 162 వ పేజీని చూపించి, అక్కడ యిచ్చిన లేఖనాలనూ దృష్టాంతాలనూ చర్చించండి. బైబిలు పఠనాన్ని ప్రారంభించే దృక్పథంతో మరో పునర్దర్శనాన్ని ఏర్పాటు చేసుకోండి.
5 మీరు, యుద్ధాన్ని గూర్చిన క్రైస్తవ దృక్పథం విషయంలో వివరణను యివ్వాలనుకుంటే, మీరు యిలా మాట్లాడేందుకు యిష్టపడవచ్చు:
◼ “వివాదాలను పరిష్కరించుకునేందుకు గల ఏకైక మార్గం కొట్లాటేనని కొందరు నమ్ముతారు. ఆ విషయాన్ని గూర్చి మీరేమనుకుంటున్నారు? [జవాబివ్వనివ్వండి.] ప్రజలు శాంతియుతంగా కలిసి జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడని బైబిలు చూపుతోంది. [రోమా. 12:17, 18 చదవండి.] దేవుని రాజ్య పరిపాలన క్రింద అది ప్రపంచవ్యాప్తంగా నిజమౌతుంది.” వుడు మన యెడల నిజంగా శ్రద్ధ కల్గియున్నాడా? అనే బ్రోషూరులోని 25-6 పేజీలను సూచించండి. భవిష్యత్తు విషయంలో బైబిలు ఏ నిరీక్షణను అందిస్తుందో వివరించేందుకు తిరిగి దర్శిస్తామని చెప్పండి.
6 ఎవరో ఒకరు తనకు నడిపింపునివ్వనిదే అర్థంచేసుకోలేనని ఐతియొపీయుడైన నపుంసకుడు అంగీకరించాడు. (అపొ 8:31) ఫిలిప్పు ప్రేమపూర్వకంగా అతనికి అవసరమైన సహాయాన్ని అందజేశాడు. మనం కూడా, అదే రీతిలో యితరులకు సహాయపడడం ద్వారా వారి యెడల యథార్థమైన ప్రేమను కనపర్చగలము.