అక్టోబరు నెలలో పత్రికా చందాలను సేకరించడంలో శ్రద్ధ కల్గివుండండి
1 కావలికోట, జరిల్లు! పత్రికల్లో నిత్య సువార్త యొక్క ఓదార్పుకరమైన ప్రోత్సాహకరమైన సమాచారం ఉంది. పత్రికల చందాలను సేకరించడమందు శ్రద్ధ కల్గివుండడంలో వాటిని శ్రద్ధగా చదవడం, అంతేకాక ఆ శీర్షికలు మన ప్రాంతంలోని ప్రజలకు ఎలా వర్తిస్తాయి అనే విషయాన్ని పరిశీలించడం చేరి ఉన్నాయి.
2 మొదట, ముఖ చిత్రంలో ఉన్నతపర్చబడిన శీర్షికలతో పరిచయం కల్గివుండండి. ముఖ చిత్రంలోని దృష్టాంతాలే తరచూ, చందా చేసేటట్లుగానీ లేక విడి పత్రికను అంగీకరించేటట్లుగానీ కదిలిస్తాయి. మీ ప్రాంతంలోని ప్రజలకు ఆసక్తికరమైనదిగా ఉంటుందని మీరు భావించే శీర్షికలను ఎన్నుకోండి. ప్రాముఖ్యంగా ప్రజలందురూ ఒకే మత విశ్వాసం గలవారా? వారి ముఖ్యాసక్తులేమిటి? ఈ ఆలోచనలను మనస్సులో ఉంచుకుని, మీరు ప్రభావితంచేసే ఒక అందింపును తయారుచేసుకోగలగాలి. క్రింద యివ్వబడినవాటిని గమనించండి.
3 అక్టోబరు 1 “కావలికోట“ను ఉపయోగించి చర్చికి వెళ్లే వ్యక్తికి మీరు చందాను అందిస్తున్నట్లైతే, “బిలు—దాని నిజమైన విలువేమిటి?” అనే శీర్షికను చూపించవచ్చు. అప్పుడు మీరు యిలా ప్పవచ్చు:
◼ “చర్చికి వెళ్ళేవారిలో అనేక మంది దగ్గర బైబిలుంటుంది. అది ఉన్నవారు దానిలో ప్రత్యేకమైన విలువగలదేదో ఉందని భావిస్తారు.” ఆ తర్వాత మీరు సూటిగా ఇలాంటి ప్రశ్నను ప్రశ్నించవచ్చు: “బైబిలును అపూర్వమైన దానిగా చేసేదేమిటని అనుకుంటున్నారు?” లేక “అనేకమంది ప్రజలు బైబిలునుండి ప్రయోజనం పొందేందుకు ఏది సహాయపడగలదని అనుకుంటున్నారు?” గృహస్థుడు మాట్లాడిన తర్వాత బహుశా మీరు దానికి తగిన వ్యాఖ్యానాన్ని చేయవచ్చు, అంటే యిలా చెప్పవచ్చు: “బైబిలును దేవుడు ప్రేరేపించాడని మరి అది మనం విశ్వసనీయమైన నడిపింపునిచ్చేదని నిరూపించేందుకు ఎంతో గొప్ప రుజువుంది. మనల్ని నిత్యజీవానికి నడిపించగల జ్ఞానం అందులో ఉంది. [యోహా 17:3 చదవండి.] అనేకమంది ప్రజలు దాన్ని గౌరవిస్తారు గాని, దాన్ని ఎలా ఉపయోగించాలో వారికి తెలియదు. కావలికోటలోని ఈ శీర్షిక, భవిష్యత్తును గూర్చిన మీ ప్రశ్నలకు జవాబులను పొందేందుకు మీరు వ్యక్తిగతంగా బైబిలును ఎలా ఉపయోగించవచ్చో వివరిస్తుంది. ఈ కావలికోటను మీరు మీ యింటికి క్రమంగా రప్పించుకోవాలని నేను ఆశిస్తున్నాను.”
4 అక్టోబరు 15 “కావలికోట,” ను ఉపయోగిస్తూ, యిలాంటి ఓ సరళమైన అందింపును యిచ్చేందుకు మీరు యిష్టపడవచ్చు:
◼ “ఇంచుమించు ప్రతి ఒక్కరు తమకు ప్రియమైనవారిని మరణమందు కోల్పోయారు. ‘చనిపోయినవారి పరిస్థితి ఏమిటి?’ అనే ప్రశ్నను ఈ శీర్షిక, లేవదీస్తుంది. ఒక వ్యక్తి చనిపోయినప్పుడు ఏమి సంభవిస్తుందని మీరనుకుంటున్నారు? [జవాబివ్వనివ్వండి.] దానికి మరితర ప్రశ్నలకు కూడా మీరు జవాబును పొందాలనుకుంటే, ఈ పత్రికకు మీరు చందాను చేస్తే బాగుంటుంది.”
5 అక్టోబరు 22 “జరిల్లు!” పత్రిక, అబద్ధ మత వైఫల్యాన్ని చూపించే అనేక రుజువుల్లో ఒకదాన్ని పరిశీలిస్తోంది. “యుద్ధంలో మతం ఒకరి పక్షం వహించినప్పుడు,” అనే శీర్షికను ఉపయోగిస్తూ, ఈ ప్రశ్నను వేయగలరు:
◼ “నేటి మతాలు, మత నాయకులూ యుద్ధాన్ని నిర్మూలించగలరని మీరనుకుంటున్నారా? మన చుట్టూ ఉన్న దౌర్జన్యాన్ని గూర్చి దేవుడు ఎలా భావిస్తాడని మీరనుకుంటున్నారు? [జవాబివ్వనివ్వండి.] మన శత్రువులతో సహా అందరినీ ప్రేమించమని బైబిలులో యేసు మనకు బోధించాడు. ప్రతిఒక్కరూ ఆ బోధను అనుసరించే సమయం వస్తుందని మీరనుకుంటున్నారా? [జవాబు చెప్పనివ్వండి.] ఈ జరిల్లు! సంచిక ఆ ప్రశ్నకు జవాబులనిచ్చి, దేవుని రాజ్యం దానికి ఎలా పరిష్కారాన్ని తెస్తుందనే విషయాన్ని వివరిస్తుంది.”
6 మీరు బైబిలును గూర్చి చర్చించలేకపోయినప్పటికీ, ప్రతి యింటి దగ్గిర పత్రిక చందాను సేకరించే ప్రయత్నం చేయండి. చందాను నిరాకరించబడినట్లైతే, విడి పత్రికలను తప్పకుండా అందించండి, బహుశ అది, పునర్దర్శనంలో చందాను సేకరించేందుకు మార్గాన్ని ఏర్పర్చవచ్చు.