కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 9/94 పేజీ 2
  • సెప్టెంబరు కొరకైన సేవా కూటములు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • సెప్టెంబరు కొరకైన సేవా కూటములు
  • మన రాజ్య పరిచర్య—1994
  • ఉపశీర్షికలు
  • సెప్టెంబరు 5తో ప్రారంభమగు వారం
  • సెప్టెంబరు 12తో ప్రారంభమగు వారం
  • సెప్టెంబరు 19తో ప్రారంభమగు వారం
  • సెప్టెంబరు 26తో ప్రారంభమగు వారం
మన రాజ్య పరిచర్య—1994
km 9/94 పేజీ 2

సెప్టెంబరు కొరకైన సేవా కూటములు

సెప్టెంబరు 5తో ప్రారంభమగు వారం

పాట 5 (28)

10 నిమి: స్థానిక ప్రకటనలు, మన రాజ్య పరిచర నుండి అనుకూలమైన ప్రకటనలు.

20 నిమి: “మీ రాజ్యసేవా సంపత్తిని విస్తృతపర్చండి.” సేవాధ్యక్షుడు, మరొక పెద్ద కలిసి ఈ శీర్షికలోని ముఖ్యాంశాలను చర్చిస్తారు. సంఘపు గత సంవత్సర పనిని పునఃసమీక్షించండి, మెచ్చుకొనుటతోపాటు అభివృద్ధిని సాధించడానికి సలహాలను కూడా యివ్వండి. పరిచర్యలో మన వ్యక్తిగత వంతును వృద్ధిచేసుకొనే గురిని నొక్కిచెప్పండి.

15 నిమి: “నిరంతరము జీవించగలరు పుస్తకంపై ఆసక్తిని పెంపొందించండి.” ఒక యౌవనస్థునితో పాటు ముగ్గురు లేదా నలుగురు ప్రచారకులు, శీర్షికను చర్చించిన తర్వాత అభ్యాస కార్యక్రమాన్ని చేయండి. వారు రెండు లేదా మూడు విధాల ప్రసంగాలను ప్రదర్శించి, ఒకరినొకరు మెచ్చుకొని అభ్యాససిద్ధమైన సలహాలనిచ్చుకొంటూ, వాటిని పునఃసమీక్షిస్తారు.

పాట 32 (10) ముగింపు ప్రార్థన.

సెప్టెంబరు 12తో ప్రారంభమగు వారం

పాట 54 (18)

7 నిమి: స్థానిక ప్రకటనలు.

20 నిమి: “నిరంతరము జీవించగలరు పుస్తకంతో బైబిలు పఠనాలను ప్రారంభించుట.” ప్రేక్షకులతో చర్చించండి. సూచింపబడిన ప్రసంగాల నుపయోగిస్తూ రెండు ప్రదర్శనలను ఏర్పాటుచేయండి.

18 నిమి: “వాళ్లు సాక్ష్యమివ్వక మానలేదు.” ప్రశ్నలు జవాబులు. మనమంతా ఒకే రకంగా పరిచర్యలో సమయాన్ని వెచ్చించలేకపోయినప్పటికి, మనం సంతోషిస్తూ, మనస్ఫూర్తిగా పనిచేయడానికి గట్టిగా ప్రయత్నించాలని ఉన్నతపర్చండి.

పాట 60 (86) ముగింపు ప్రార్థన.

సెప్టెంబరు 19తో ప్రారంభమగు వారం

పాట 36 (14)

7 నిమి: స్థానిక ప్రకటనలు. సంఘలెక్కల నివేదికను, చందాను గూర్చిన వ్యాఖ్యానాన్ని చదవండి.

13 నిమి: “పాఠశాలలో సిద్ధపడి ఉండండి.” ప్రశ్నలు జవాబులు. యౌవనస్థులు ఎదుర్కొనే సమస్యలనుగూర్చి చెబుతూ, తమ పిల్లలకెలా తల్లిదండ్రులు సహాయపడగలరో ఉన్నతపర్చండి.

20 నిమి: “1994 ‘దైవ భయము’ జిల్లా సమావేశము.” ఇన్‌సర్ట్‌. ఒక పెద్దచే 1-11 పేరాలు ప్రశ్నా సమాధానములుగా చర్చించబడతాయి. “జిల్లా సమావేశ జ్ఞాపికలకు” ప్రత్యేక అవధానాన్ని మళ్లించండి.

పాట 67 (38) ముగింపు ప్రార్థన.

సెప్టెంబరు 26తో ప్రారంభమగు వారం

పాట 44 (41)

10 నిమి: స్థానిక ప్రకటనలు. “క్రొత్త ప్రాంతీయ సమావేశ కార్యక్రమం” అనే శీర్షికలోని ఉన్నతాంశాలను పునఃసమీక్షించండి.

20 నిమి: “1994 ‘దైవ భయము’ జిల్లా సమావేశము.” ఇన్‌సర్ట్‌. సంఘ సెక్రటరీచే 12-25 పేరాలపై ఆధారపడిన ప్రసంగం ఇవ్వబడుతుంది.

15 నిమి: అక్టోబరులో కావలికోట, జరిల్లు! పత్రికలకు చందాలను అందించుట. ప్రపంచవ్యాప్త ప్రకటనా పనిలో మన పత్రికలు ప్రముఖ పాత్ర వహిస్తాయి; లక్షలాదిమంది సత్యాన్ని మొట్టమొదట విన్నది వీటిద్వారానే. ఎల్లప్పుడూ వాటిని ఉపయోగించే అవశ్యతను, యింటింటి సేవలో వేరే సాహిత్యాలు చూపినప్పటికి వీటిని అందించమని నొక్కి చెప్పండి. వారపు పత్రికా దినంయొక్క ప్రయోజనాలను ప్రస్తావించండి. పత్రికలందించడానికి, షాపు షాపుకు చెప్పే సాక్ష్యం, వీధిసాక్ష్యం అనేక అవకాశాలను ఎలా తెరుస్తుందో చర్చించండి. మ్యాగజీన్‌ రూట్‌ ప్రారంభించే గురితో, అందించిన పత్రికల రికార్డును వ్రాసుకోమని సహోదరులకు గుర్తుచేయండి. చందాలను అందించే విషయంలో అనుకూల దృక్పథాన్ని కల్గివుండమని ప్రోత్సహించండి. బయటకు వెళ్లేముందు సిద్ధపడాల్సిన ప్రాముఖ్యతను నొక్కిచెప్పండి. పత్రికను, చందాను అందించే రెండు క్లుప్త ప్రదర్శనలు చేయడానికి ముగ్గురు ప్రచారకులను తీసుకోండి, వారిలో ఒకరు యౌవనస్థుడైయుండాలి.

పాట 76 (72) ముగింపు ప్రార్థన.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి