మనము తిరిగి వెళ్లనిదే వాళ్లు ఎలా వింటారు?
1 “ప్రకటించువాడు లేకుండ వారెట్లు విందురు?” (రోమా 10:14) నిజంగా, మనం ప్రభావవంతంగా పునర్దర్శనాలు చెయ్యందే, వాళ్లు ఎలా సత్యంలోని భావాన్ని గ్రహించగలరు? రాజ్యవర్తమానాన్ని గూర్చి గృహస్థునితో మనం సంభాషించగల్గిన ప్రతి సందర్శనము ఒక పునర్దర్శనమునకు తగినదే. మనం ఏ చిన్నపుస్తకం అందించినప్పటికి దానిలోనున్న అదనపు లేఖన సమాచారముతో మనం క్రితం సందర్శించిన వారిని ఈ నెలలో మరల సందర్శించవచ్చు. తద్వారా అది విజయవంతమైన పుస్తక పఠనానికి నడిపించగలదు.
2 “సురక్షితమైన భవిష్యత్తును—నీవు ఎట్లు కనుగొందువు,” అను చిన్నపుస్తకమును అందించినట్లయితే, పుస్తక పఠనానికి నడిపే సంభాషణను మీరు యీ విధంగా ప్రారంభించవచ్చు. కవరు చూపిస్తూ, మీరిలా అడగవచ్చు:
◼ “మీకు, మీకుటుంబానికి సురక్షితమైన భవిష్యత్తును అభయమిచ్చే లోకంలో జీవించటానికి మీరు యిష్టపడతారా? [జవాబును చెప్పనివ్వండి. ఆ తరువాత 2వ పేరాకు త్రిప్పండి.] చాలామంది అది ఎన్నడైనా సాధ్యమౌతుందా అని సందేహించినప్పటికిని, మనమందరమూ యిలాంటి కోరికను కలిగివున్నాము. ఈ వాగ్దానాలను వాస్తవం చేస్తానని చెప్పే, ఆ దేవునికి యిది అసాధ్యంకాదు.” 2వ పేరాలో ఉదహరించబడిన యెషయా 32:17, 18ను చదవండి లేదా మీ బైబిలు నుండి చదవండి. భవిష్యత్తు కొరకైన నిజమైన నిరీక్షణనిచ్చే ఆనందాన్ని, మనశ్శాంతిని అనుభవించే ప్రజలు ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ఉన్నారని ఇంకనూ వివరించండి. మూడవ పేరాలో యివ్వబడిన లేఖనపరమైన ఆలోచనను చర్చించిన మీదట, చిన్నపుస్తకంనుండి పఠనం చేయడంద్వారా యింకా ఎక్కువగా ఎలా నేర్చుకొన్నగలరో గృహస్థునితో వివరించండి. ఆ వ్యక్తి ఆసక్తిగా ఉన్నట్లైతే, ఈ చర్చను కొనసాగించటానికి త్వరితంగా పునర్దర్శనం చేయుట కొరకు ఏర్పాటు చేయండి.
3 “సంరక్షించు దేవుడు ఉన్నాడా?” అనే చిన్నపుస్తకమును అందించిన, తర్వాత పునర్దర్శనాన్ని చేసేటపుడు బహుశ యిలా చెప్పడం ఫలవంతముగా ఉంటుంది:
◼ “నేను క్రితంసారి దర్శించినప్పుడు, సంరక్షించు దేవుడు వున్నాడా? అనే ఒక ప్రశ్నను మనం చర్చించుకొన్నాం. బాధ, దౌర్జన్యం అంతమొందించేంతగా దేవుడు మనపై శ్రద్ధ కలిగియున్నాడని మీకు అనిపిస్తుందా? [ఆ వ్యక్తి జవాబు చెప్పిన తరువాత, 32,వ పేరాకు త్రిప్పి, కొనసాగండి.] ఈ దుష్టలోక స్థానంలోనే సమాధానంతో నివసించు సామర్థ్యంగల నీతిమంతులతో నిండివుండే ఒక క్రొత్త లోకం స్థాపిస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. [కీర్తన 37:11 చదవండి.] మనం బైబిలును విశ్వసిస్తూ, దాని సలహాలను అన్వయిస్తూ ఉన్నట్లయితే, మీరు, నేనూ ఆ నూతన లోకంలో జీవితాన్ని అనుభవించగలం.” బైబిలును పఠించుటలో ప్రజలకు సహాయపడటానికిగల మన ఏర్పాటును వారికి వివరించి చెప్పండి.
4 “ఇదిగో! నేను సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నాను” అను బ్రోషూరును అందించిన తర్వాత మీరు పునర్దర్శనాన్ని చేస్తున్నట్లైతే, కవరును చూపి ప్రారంభిస్తూ మీరిలా ప్రశ్నించవచ్చు:
◼ “ఒక శ్రేష్ఠమైన లోకంలో జీవించటం ఎలా ఉంటుందని మీరు తలస్తున్నారు? [గృహస్థుని వ్యాఖ్యానాన్ని పొందండి.] ఈ చిత్రంలో మీరు చూసింది కేవలం ఒక కల్పనతోకూడిన ఊహ కాదు: బైబిలునందు నిర్దిష్టంగా చెప్పబడిన కచ్చితమైన వాగ్దానాలపై యిది ఆధారపడి ఉంది. [ప్రకటన 21:4 మరియు కీర్తన 37:11, 29 చదవండి.] ఈ ఆశీర్వాదాన్ని మీరు, మీకుటుంబం ఎలా అనుభవించగలరో నేను వివరించి చెప్పటానికి యిష్టపడుచున్నాను.” గృహస్థుడు ఆసక్తిని వ్యక్తపరుస్తున్నట్లైతే, చర్చను కొనసాగిస్తూ, బైబిలు పఠనం కొరకు ఆహ్వానించండి.
5 సత్యాన్ని వెదకే యథార్థవంతులను మనం కనుగొన్నపుడు, వారు విన్న దానిపై చర్య తీసుకొనేటట్లు సహాయం చేయుటకు వారిని పునర్దర్శించుట ద్వారా మనం మన నిజమైన ప్రేమను ప్రదర్శిస్తాము. మనకును, వినేవారికినిగల నిత్యాశీర్వాదాల నిమిత్తమై మనకు అప్పగింపబడిన పరిశుద్ధ సత్యాలను మనం ఉపయోగిస్తాము.—1 తిమోతి 4:16.