సత్యాన్ని నేర్చుకొనటానికి ఇతరులకు సహాయపడండి
1 యేసు భూమికి వచ్చింది సత్యాన్ని గూర్చి సాక్ష్యమిచ్చుటకొరకే. యితరులకు సత్యాన్ని ప్రకటించటంకోసం, తన శిష్యులు బోధకులుగా ఉండేందుకు వారికి ఆయన తర్ఫీదు యిచ్చాడు. యితరులకు బోధించటంలో వారి సఫలతయెడల ఆయన ఎంత నమ్మకం కలిగి ఉన్నాడంటే వాళ్లని ‘ప్రజోపదేశకులు’ అని పిలిచాడు. (మత్త 13:52) ఆయన ప్రతిఒక్కరిని, వెలుపలికి తెచ్చే వాస్తవ ధననిధిగల ప్రజోపదేశకులకు పోల్చాడు. ఈనాడు యేసు శిష్యులు అతి వేగంగా రాజ్యసువార్త ప్రకటించడానికి ముద్రించిన సాహిత్యాలను ఉపయోగిస్తున్నారు. ఉదాహరణకు, శిష్యులుగా అయ్యేందుకు యితరులకు సహాయం చేయటానికి మనం వివిధ చిన్న పుస్తకాలను కలిగియున్నాం. విలువైన ఈ ఉపకరణాలను ఎలా ఉపయోగించాలి?
2 “సురక్షితమైన భవిష్యత్తును—నీవు ఎట్లు కనుగొందువు,” అనే చిన్న పుస్తకాన్ని అందించటానికి నడిపే సంభాషణను ప్రారంభించటానికి మీరిలా అడగవచ్చు:
◼ “మానవుడు అనేక ప్రయత్నాలు చేస్తున్నా, సురక్షితమైన భవిష్యత్తును గూర్చిన ఉత్తరాపేక్షలు చాలా తక్కువగా ఎందుకున్నాయో మీరు ఎప్పుడైనా ఆలోచించిరా? [జవాబు చెప్పనివ్వండి.] ఎందుకు యిన్ని ప్రయత్నాలు విఫలమయ్యాయో బైబిలు వివరిస్తుంది.” కీర్తన 146:3, 4. చదవండి. ఆరవ పేరాలోని సమాచారాన్ని హేతుబద్ధంగా గృహస్థునితో మాట్లాడిన తరువాత మీరిలా చెప్పవచ్చు: “దీర్ఘకాలిక భద్రతను మనకు వాస్తవంగా ఎవరు సమకూర్చగలరు?” గృహస్థుని జవాబుపై ఆధారపడుతూ, 7,వ పేరాలోని అంశాలను చర్చించవచ్చు లేదా భవిష్యత్తులో మరోసారి అలాచేయడానికి మీరు ఏదైనా ఏర్పాటు చేసుకోవచ్చు.
3 “సంరక్షించు దేవుడు ఉన్నాడా?” అనే చిన్నపుస్తకాన్ని మీరు ఉపయోగించ గల్గుటకు ఇదొక మార్గము:
◼ “ఈ రెండు బొమ్మలతో క్రింది భాగాన కన్పించే ప్రశ్నలను అనేకమంది అడిగారు. [6, 7 పేజీలలో క్రింద యివ్వబడిన ప్రశ్నను చదివి, జవాబు చెప్పనివ్వండి.] దేవుడు ప్రేమ గలవాడు గనుక ఒకే సమయంలో మంచి చెడులను సమర్థించడు. యెషయా 65:21-24 నందు వ్రాయబడిన వాగ్దానాన్నిగూర్చి మీరు ఏమని తలుస్తున్నారు?” దానిపై ఆ వ్యక్తిచేసే వ్యాఖ్యానం ఆసక్తిని వ్యక్తపరిస్తే, అప్పుడు 37వ పేరాకు త్రిప్పి, దేవుని రాజ్యం ఏమి నెరవేర్చునో వివరించండి.
4 “జీవితమునకు ఇంకను చాలా ఉన్నది!,” అను చిన్నపుస్తకమును అందించినపుడు మీరిలా అడగవచ్చు:
◼ “చాలమందికి వారి జీవిత శ్రేణి తగ్గుతూ నిరాశతో, హీనస్థితిలో ఉంది. జీవితాన్ని ఎక్కువ అర్థవంతంగా చేసికొనటానికి ఏమి ఆవశ్యకమని మీరు ఆలోచిస్తారు? [యింటి యాజమానిని అతని ఉద్దేశాన్ని చెప్పనివ్వండి.] దేవుడు మనకొరకు శ్రేష్ఠమైన విషయాలను దాచియుంచాడని బైబిలు చూపిస్తుంది. ఇక్కడ ప్రకటన 21:4, 5 నందు ఆయన ఏమి చెపుతున్నాడో చూడండి.” సముచితమయితే, చిన్నపుస్తకంలోని 42 వ పేరా నుండి చర్చను కొనసాగించండి.
5 “భూమిపై నిరంతరము జీవితమును అనుభవించుము!,” అనే బ్రోషూరు నుపయోగిస్తూ, ఒక యౌవన ప్రచారకుడు యిలా అడగవచ్చు:
◼ “ఇలాంటి పరదైసు భూమిలో మీరు జీవించటానికి యిష్టపడతారా? [వెనుక ముందు ఉన్న కవరును చూపిస్తూ, వ్యాఖ్యానం చెప్పనివ్వండి] యోహాను 17:3,లో బైబిలు యీ విధంగా చెబుతుంది కాబట్టి, మా కుటుంబం, నేను, ఇక్కడ జీవించటానికి ఎదురుచూస్తున్నాం.” లేఖనం చదివిన తరువాత ఆసక్తి ఉన్నట్లు మీరు గమనిస్తే, ఆ వ్యక్తికి బ్రోషూరును చదవటానికి అందివ్వండి.
6 మీరు యితర చిన్నపుస్తకాలను లేదా బ్రోషూర్లను యీనెలలో మీ పరిచర్యలో ఉపయోగిస్తున్నట్లైతే, మీ ఉపోద్ఘాతాలను, మీ అందింపులను ముందు యివ్వబడిన సలహాల మాదిరిగా సిద్ధపడవచ్చు. గృహస్థుల ఆసక్తి రేకెత్తించడానికి మీరు క్లుప్తంగా, అనుకూలమైన క్షేమాభివృద్ధికరమైన వ్యాఖ్యానాలు చేయాలని గుర్తుంచుకోండి.
7 యెహోవా మనకు సత్యమును అనుగ్రహించాడు. దీనిని యితరులతో పంచుకోవటానికి పత్రికలద్వారా, మరియు మనం కలిసే ప్రజలతో సంభాషించటంద్వారా మన ముందు ఉంచబడిన అవకాశాలను ఉపయోగించుకోవాలి. యీ విధంగా ప్రజోపదేశకులుగా యితరులకు తరిగిపోని ప్రయోజనమిచ్చేవారిగా మనలను మనం నిరూపించుకుంటాము.—మత్తయి 28.19, 20.