ప్రపంచంలో అతి శ్రేష్ఠమైన పత్రికలను అందించండి
1 కావలికోట ఉద్దేశము “యెహోవా దేవుని విశ్వాధిపతిగా ఘనపరచుటయే” అని చెప్పబడింది. “కుటుంబమంతటికీ జ్ఞానోదయం కల్గించేదే” తేజరిల్లు! “ఈ పత్రిక . . . శాంతిసమాధానాలతో కూడిన ఒక నూతనలోకం వస్తుందని సృష్టికర్త చేసిన వాగ్దానమందు నమ్మకాన్ని వృద్ధిచేస్తుంది.” ఈ మాటలు ఆ పత్రికల నుండే ఎత్తి వ్రాయబడినవి. ఈ గమ్యాలను అనుసరించడమే వాటిని కోట్లాదిమంది చదువరులకు ఓదార్పును ఇచ్చే మూలంగా చేశాయి.
2 సాధ్యమైనంతవరకు ఏప్రిల్ మరియు మే నెలల్లో మనము మన ఇంటింటి పరిచర్యలో ఈ పత్రికలకు వీలైనన్ని చందాలను అందిస్తాము. దానిని ఫలవంతంగా చేయడానికి మనము వాటిలోని విషయాలతో పరిచయాన్ని కలిగి ఉండవలసిన అవసరం ఉంది. వాటిని అందించేటప్పుడు మీరు ఉపయోగించగలిగే విషయాలను గుర్తిస్తూ, ప్రతి సంచికను చదవండి. ప్రజలకు ఏది ఎక్కువ ఆసక్తికరంగా ఉంటుందో ఆలోచించండి. మీ ఇరుగుపొరుగు వారి ఆలోచనల్లో ఏ సాంఘిక, కుటుంబపర, లేక భావోద్రేక సంగతులు ఎక్కువగా ఉంటాయి? వారి హృదయాలను స్పర్శించి, మరి ఎక్కువగా నేర్చుకోవాలనే కోరికను ప్రేరేపించగలిగే విషయాలను మీరేమైనా చెప్పగలరేమో ఆలోచించటానికి ప్రయత్నించండి. మరి మీతోపాటు సరిపడేన్ని చందా స్లిప్పులను తీసుకొని వెళ్లటం మర్చిపోకండి.
3 ఏప్రిల్ 1 కావలికోట ను ఉన్నతపర్చడం: (పక్ష పత్రికలు.) వారి ఆనందానికి తరచుగా భంగం కలిగించే అనేక సమస్యలు లేని ఒక శ్రేష్టమైన లోకం కొరకు చాలామంది ప్రజలు తపిస్తున్నారు.
మిమ్మల్ని మీరు పరిచయం చేసుకున్న తరువాత, మీరిలా చెప్పవచ్చు:
◼ “‘ఒక శ్రేష్ఠమైన లోకం—కేవలం ఒక స్వప్నమా?’ అనే శీర్షికలో చేయబడిన ఒక ఆసక్తికరమైన వ్యాఖ్యానాన్ని నేను మీకు చూపించాలనుకుంటున్నాను. అదిలా చెబుతోంది: ‘మనం జీవిస్తున్న ఈ లోకం, నిజంగా ఒక మంచి స్థలంగా లేదు. . . . ప్రస్తుత శ్రమల పట్టిక అంతం లేనిదిగా కనిపిస్తున్నది.’ (ఆ శీర్షిక యొక్క 3 వ పేరాను చూడండి.) ఈ పరిస్థితి, భవిష్యత్తును గురించి ఆశాజనకంగా ఉండటాన్ని కష్టతరం చేస్తుంది, కాదంటారా? అయినా, భవిష్యత్తును గురించి కీర్తన 37:11 ఏమి చెబుతుందో నన్ను మీకు చూపనివ్వండి.” వచనాన్ని చదివిన తరువాత, ఈ వాగ్దానాన్ని గురించి అతనేమి భావిస్తున్నాడో ఇంటి యజమానిని అడగండి. ఒకవేళ అతను అనుకూలంగా స్పందిస్తే, “ఒక శ్రేష్ఠమైన లోకం—సమీపంలో ఉంది!” అనే శీర్షిక యొక్క 4 వ పేజీకి త్రిప్పి, యిలా అనండి: “మనము ఇందాక కీర్తన 37:11 నుండి చదివిన దానితోపాటు, అనేక లేఖనాలు సూచించబడ్డాయి. మీరు ఈ పత్రికలను క్రమంగా చదవడానికి సంతోషిస్తారని నేను విశ్వసిస్తున్నాను.” తరువాత కావలికోట కొరకు రూ. 60.00 కు ఒక సంవత్సరం చందాను అందించండి.
4 ఏప్రిల్ 15 కావలికోట ను ఉన్నతపర్చడం: పక్ష పత్రికలలోని 4 వ పేజీలోని శీర్షిక యిలా అడుగుతుంది: “నమ్మదగిన నడిపింపును మీరెక్కడ కనుగొనగలరు?”
మిమ్మల్ని మీరు పరిచయం చేసుకున్న తరువాత, మీరిలా చెప్పవచ్చు:
◼ “ఈనాడు ప్రపంచంలో అనేక సమస్యలు ఉన్నాయి, అవేమంటే [ఒక వార్తాశీర్షికను లేక ఆ ప్రాంతానికి సంబంధించిన ఈమధ్య జరిగిన సంఘటనను గురించి చెప్పండి]. అది అనేక సమస్యలతో ఉన్న నేటి పరిస్థితికి ఏదైనా పరిష్కారాన్ని ఎవరైనా కనుగొనగలరా అని మనం దిగ్భ్రాంతి చెందేలా చేస్తుంది. సంతోషకరంగా, ఒక ఆనందదాయకమైన, భద్రతగల జీవిత విధానానికి బైబిలే నడిపింపును ఇస్తుందని 2 తిమోతి 3:16, 17 మనకు అభయాన్నిస్తుంది.” ఈ వచనాలను చదివిన తరువాత, బైబిలు ఎందుకు ఒక నమ్మకమైన నడిపింపు నివ్వగలదు అనే విషయాన్ని అర్థం చేసుకొనడానికి కావలికోట మనకెలా సహాయం చేస్తుందో చూపించండి. కావలికోట యొక్క నెలసరి పత్రికలకు చందాలను అందించేటప్పుడు కూడ అటువంటి అందింపులనే ఉపయోగించవచ్చు.
5 మీరు తేజరిల్లు! ను అందించాలనుకుంటే, మీరు మే 8 వ సంచికలోని “రియల్ హోప్ ఫర్ ది చిల్డ్రెన్?” అనే శీర్షికను ఉపయోగించవచ్చు. తలిదండ్రులు పిల్లల అవసరతలను బట్టి స్పందించి వారికి సహాయం చేయడానికి ఏమి చేయబడగలదో తెలుసుకొనడానికి ఇష్టపడటాన్ని బహుశా మీరు కనుగొనవచ్చు. ప్రతీ పత్రిక యొక్క అనేక ప్రతులను వెంటబెట్టుకొనడం ద్వారా, ప్రచురింపబడిన వేర్వేరు శీర్షికలవైపు వారి అవధానాన్ని మరల్చడానికి మీకు వీలౌతుంది మరి వారు చందాను అంగీకరించడానికి వ్యక్తులను ప్రోత్సహించవచ్చు. ఒకవేళ చందా అందింపు నిరాకరించబడితే, కావలికోట మరియు తేజరిల్లు! రెండింటి యొక్క కొన్ని ప్రతులను లేక కనీసం ఒక్కొక్క ప్రతినైనా తీసుకొనవలెనని మీరు వారికి సలహా ఇవ్వవచ్చు.
6 ప్రపంచంలో అతి శ్రేష్ఠమైనవైన, మన పత్రికల విషయమై మనము ఆసక్తి కలిగి ఉంటే, వారు కూడ రాజ్య నిరీక్షణను హత్తుకొని, యెహోవాను విశ్వ సర్వాధిపతిగా ఘనపర్చడంలో పాల్గొనునట్లు మనము వాటిని ఇతరులకు అందించడానికి ఆతురతతో ఉంటాము.—కీర్త. 83:18.