సరళమైన, ప్రభావవంతమైన పునర్దర్శనాలు
1 మీరు క్రమంగా పునర్దర్శనాలు చేస్తారా, లేదా సాధారణంగా ఏం చెప్పాలో తెలియక అది చాలా కష్టమైనదానిగా కనుగొన్నారా? అయితే భయపడవలసిన అవసరం లేదు. మీరు విజయాన్ని సాధించేందుకు మూడు విషయాలు మీకు సహాయపడతాయి: (1) మంచి సిద్ధపాటు; (2) కొన్ని సామాన్యమైన బైబిలు అంశాలను గూర్చి ఒకటి లేదా రెండు విషయాలను చర్చించగలిగే సామర్థ్యం; (3) గృహస్థుని దృక్పథాన్ని ఆలకించే యిష్టత.
2 పునర్దర్శించడానికి సిద్ధపడుటలో, గృహస్థునితో యే అంశం చర్చిస్తే బాగుంటుందో అనే విషయాన్ని పరిశీలించండి. అతనొక విద్యార్థా? ఈ నెలలో తమ పరీక్షలకు ముందు సిద్ధపడడానికి అనేకమంది విద్యార్థులకు సెలవులుంటాయి, కాబట్టి పాఠశాలకు వెళ్లేందుకు బదులుగా వారు తమ యిళ్లలోనే ఉంటారు. అందువల్ల మీరు వారితో బైబిలు అంశాన్ని చర్చించడంలో ఆనందించవచ్చు, ఆలాగే వారు కూడా తమ చదువులనుండి కొంచెం అంతరాయాన్ని కూడా వారు యిష్టపడతారు. కొందరు రాజ్య వర్తమానం వినడానికి యిష్టపడడాన్ని సాధారణంగా మీరు కనుగొనవచ్చు. క్రితం మీరు దర్శించినప్పుడు ఏదైనా ప్రశ్నను విడిచివచ్చారా, లేదా గృహస్థుడు ఒక ప్రత్యేకమైన అంశంపై ఆసక్తిని కనపర్చాడా? మీరు వ్రాసుకొన్న విషయాలను పునర్విమర్శించి, ప్రభావవంతమైన పునర్దర్శనం చేయడానికి అవసరమైన సమాచారాన్ని గుర్తించడానికి రీజనింగ్ పుస్తకాన్ని ఉపయోగించండి. మీరు సందర్శిస్తున్నప్పుడు, ఆప్యాయంగా స్నేహపూరితంగా ఉండండి. గృహస్థుని పేరుతో పిలిచి నమస్కరించండి.
3 మీరొకవేళ కావలికోట, తేజరిల్లు! పత్రికలను గృహస్థునికి అందిస్తే, పత్రికనుండి మీరు ఎన్నుకున్న సరళమైన ఒకటి రెండు విషయాలపై మీ పునర్దర్శనం ఆధారపడివుండవచ్చు. మొదటి సందర్శనలో కరపత్రాన్ని అందించినట్లైతే, ఆ కరపత్రంలోని విషయాలనైనా చర్చించవచ్చు, లేదా పత్రిక లేదా బ్రోషూర్లోని తగిన అంశాన్ని సూచిస్తూ వాటిని అందించవచ్చును.
4 చర్చ జరుగుతుండగా, సరైనవికాని అనేక దృక్పథాలను గృహస్థుడు వ్యక్తం చేయవచ్చు. ఆయన చెప్పే ప్రతి విషయాన్ని గూర్చి వాదించాల్సిన పనిలేదు. బదులుగా, చర్చించబడుతున్న అంశాన్నే హత్తుకుని ఉండండి. ఏవైనా లేఖనాధారంలేని అభిప్రాయాలు ఆయనకున్నట్లైతే, తర్వాతి పునర్దర్శనాలలో సరిదిద్దవచ్చును.
5 ఈ నెలంతటిలోనూ వ్యక్తులను పునర్దర్శించేటప్పుడు, మార్చి 26 న జరుగబోయే క్రీస్తు మరణ జ్ఞాపకార్థ దినానికి వారిని పదే పదే ఆహ్వానిస్తూ ఉండాలని జ్ఞాపకముంచుకోండి, మరియు ఆచరణ జరుగబోయే స్థలాన్ని, సమయాన్ని గూర్చి వారికి జ్ఞాపకం చేయండి. ఆ సంఘటన ప్రాముఖ్యతను, హాజరవ్వాలని యిచ్చిన ఆజ్ఞకు లోబడే అవసరతను గూర్చి వారితో పునర్విమర్శించండి. మార్చి నెలలో సరళమైన, ప్రభావవంతమైన పునర్దర్శనాలు చేయడం ద్వారా ఆసక్తిగలవారిని దర్శించడానికి అన్ని విధాలా కృషిచేయడానికి యోచనచేయండి.