కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 3/94 పేజీ 2
  • మార్చి కొరకు సేవా కూటములు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • మార్చి కొరకు సేవా కూటములు
  • మన రాజ్య పరిచర్య—1994
  • ఉపశీర్షికలు
  • మార్చి 7 తో ప్రారంభమగు వారం
  • మార్చి 14 తో ప్రారంభమగు వారం
  • మార్చి 21 తో ప్రారంభమగు వారం
  • మార్చి 28 తో ప్రారంభమగు వారం
మన రాజ్య పరిచర్య—1994
km 3/94 పేజీ 2

మార్చి కొరకు సేవా కూటములు

మార్చి 7 తో ప్రారంభమగు వారం

పాట 200 (108)

10 నిమి: స్థానిక ప్రకటనలు, మన రాజ్యపరిచర్య నుండి ఎన్నుకోబడిన ప్రకటనలు.

15 నిమి: “మీ నిరీక్షణ విషయమై బహిరంగంగా ఒప్పుకొన్నదానిని నిశ్చలముగా దృఢంగా పట్టుకోండి.” అనే అంశాన్ని కావలికోట పఠన నిర్వాహకుడు ప్రశ్నా సమాధానములతో పరిశీలించును. కూటాలలో వ్యాఖ్యానించే భయమున్నవారు తమ భయాన్ని ఎలా అధిగమించారో చెప్పమనండి. ముందుగానే సిద్ధపడే అవసరతను నొక్కిచెప్పండి. సంఘంలోని కావలికోట పఠనానికి ప్రతివారం పూర్తిగా భాగం వహించడానికి సిద్ధపడమని సంఘాన్ని ప్రోత్సహించండి.

20 నిమి: “గృహస్థుని అవసరాలకు తగినట్లుగా సాహిత్యాన్ని అందించండి.” ప్రేక్షకులతో చర్చ. బాగా సిద్ధపడిన ప్రచారకులు 2, 3 పేరాలలో అందింపులను ప్రదర్శించనీయండి. ప్రతి ప్రదర్శన తర్వాత అందింపు నుండి వారేమి నేర్చుకొన్నారో అనే విషయంలో ప్రేక్షకులను వ్యాఖ్యానించనీయండి. ఈ నెలలో యంగ్‌ పీపుల్‌ ఆస్క్‌ అనే పుస్తకాన్ని అందించడంలో భాగం వహించాలని అందరినీ ప్రోత్సహించండి.

పాట 225 (18) ముగింపు ప్రార్థన.

మార్చి 14 తో ప్రారంభమగు వారం

పాట 205 (118)

10 నిమి: స్థానిక ప్రకటనలు. దైవపరిపాలనా వార్తలు. ఈ వారం ప్రాంతీయసేవలో ఉపయోగించగల తాజా పత్రికల్లోని ప్రత్యేక అంశాలపై అవధానాన్ని మళ్లించండి. తమ బైబిలు పఠనాలనన్నింటినీ, ఆసక్తిగల వ్యక్తులను, పరిచయమున్నవారిని జ్ఞాపకార్థ దినానికి ఆహ్వానించడానికి ఈ వారము, అలాగే తర్వాత కూడా సందర్శించమని ప్రచారకులందరికీ గుర్తుచేయండి.

15 నిమి: “ఏప్రిల్‌ నెలలో యెహోవాకు మీ స్తుతులను విస్తరింప జేయుదురా?” ప్రశ్నా సమాధానములతో చర్చించండి. గతంలో సహాయ పయినీర్‌ సేవ చేసిన వారినుండి వ్యాఖ్యానాలను రాబట్టండి. ఈ ఆధిక్యతలోని అవకాశాలనందుకోడానికి తమ కార్యకలాపాలను ఎలా సరిచేసుకొన్నారో వారిని వివరించనివ్వండి. ఏప్రిల్‌ నెలలో సహాయ పయినీర్‌ చేయడానికి యోచన చేసేవారంతా తమ ధరఖాస్తులను సాధ్యమైనంత తొందరలో అందజేయాలని ప్రోత్సహించండి.

20 నిమి: “జ్ఞాపకార్థ కూటానికి వారు ఆహ్వానించబడ్డారని భావించేలా చేయండి.” ప్రశ్నా సమాధానములతో చర్చ. మూడవ పేరా చర్చించిన తర్వాత ఒక పరిచారకుడు క్రొత్త వ్యక్తిని జ్ఞాపకార్థ దినానికి ఆహ్వానించడాన్ని క్లుప్తంగా ప్రదర్శించండి.

పాట 150 (83) ముగింపు ప్రార్థన.

మార్చి 21 తో ప్రారంభమగు వారం

పాట 143 (76)

10 నిమి: స్థానిక ప్రకటనలు, అకౌంట్స్‌ రిపోర్టుతోపాటు విరాళం ముట్టినట్లు చెప్పబడిన మాటలను కూడ ఇమడ్చండి. “తగినవేళ ఆహారం” అనే అంశంతోవున్న బాక్స్‌ను చర్చించండి. ఏప్రిల్‌ 10 న యివ్వబడే ప్రత్యేక బహిరంగ ప్రసంగానికి ఆసక్తిగలవారినందర్నీ ఆహ్వానించమని అందర్నీ ప్రోత్సహించండి. జ్ఞాపకార్థ దినానికి సంబంధించిన ఏర్పాట్లను పునర్విమర్శించండి.

20 నిమి: “యెహోవా సేవలో ఆనందించుట.” ఇన్‌సర్ట్‌ నందలి 1-11 పేరాలను ప్రేక్షకులతో చర్చించండి. ఏప్రిల్‌లో స్థానిక ప్రచారకులు సహాయ పయినీర్‌ చేయడానికి తమ షెడ్యూళ్లను సరిచేసుకోగల్గే ఆచరణాత్మక మార్గాలను చూపండి. ఈ సేవలో సాధ్యమైనంత ఎక్కువమంది పాల్గొనేలా ప్రోత్సహించండి.

15 నిమి: “సరళమైన, ప్రభావవంతమైన పునర్దర్శనాలు.” ప్రేక్షకులతో చర్చించండి. పునర్దర్శనంలో సంభాషణను ఎలా ప్రారంభించాలో చూపిస్తూ ఒక ప్రదర్శనను చూపండి. ఒక మంచి, వివరణాత్మక ఇంటింటిసేవా రికార్డును కలిగివుండాల్సిన అవసరతనుగూర్చి ప్రేక్షకులకు గుర్తుచేయండి.

పాట 87 (47) ముగింపు ప్రార్థన.

మార్చి 28 తో ప్రారంభమగు వారం

పాట 112 (59)

10 నిమి: స్థానిక ప్రకటనలు. ఏప్రిల్‌ అందింపుతో స్థానిక ప్రాంతంలో సాక్ష్యమివ్వడానికి తగిన మార్గాలను చర్చించి, ప్రదర్శించండి. కొందరు ప్రచారకులు చందాలను ఎలా పొందారో చూపిస్తూ అనుభవాలను వివరించండి.

15 నిమి: “యెహోవా సేవలో ఆనందించుట.” ఇన్‌సర్ట్‌నందలి 12-20 పేరాలను ప్రేక్షకులతో చర్చించండి. ప్రజలను సత్యంలోకి నడిపించడానికి బైబిలు పఠనాలను నిర్వహించాల్సిన ప్రాముఖ్యతను చూపి, ఏప్రిల్‌లో కనీసం ఒక్క పఠనాన్నైనా పొందడానికి ప్రతి ప్రచారకుడూ ప్రయత్నించాలని సలహాయివ్వండి. ప్రత్యేక పత్రికాదినమైన ఏప్రిల్‌ 16 న పాల్గొనేందుకు పురికొల్పండి. ఆ రోజుకు సంబంధించిన ప్రాంతీయ సేవా ఏర్పాట్లను ప్రకటించి, అందరూ పాల్గొనాలని ప్రోత్సహించండి.

20 నిమి: “దైవిక బోధ బలమైన ప్రభావాన్ని కలుగజేస్తుంది.” అనే అంశాన్ని ప్రశ్నా సమాధానాలతో చర్చించండి. సమయం అనుమతించే కొలది యివ్వబడిన లేఖనాలను పేరాలను చదవండి. సమావేశానికి హాజరైనందువల్ల, సమావేశంలో విడుదలైన వాటిని ఉపయోగించినందువల్ల ప్రయోజనాలను పొందినందుకు వ్యక్తిగత మెప్పుదలను వ్యక్తంచేసే వ్యాఖ్యానాలను క్లుప్తంగా చెప్పడానికి అనుమతించండి.

పాట 15 (119) ముగింపు ప్రార్థన.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి