కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 2/94 పేజీ 2
  • ఫిబ్రవరి కొరకైన సేవా కూటములు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ఫిబ్రవరి కొరకైన సేవా కూటములు
  • మన రాజ్య పరిచర్య—1994
  • ఉపశీర్షికలు
  • ఫిబ్రవరి 14 తో ప్రారంభమగు వారం
  • ఫిబ్రవరి 21 తో ప్రారంభమగు వారం
  • ఫిబ్రవరి 28 తో ప్రారంభమగు వారం
మన రాజ్య పరిచర్య—1994
km 2/94 పేజీ 2

ఫిబ్రవరి కొరకైన సేవా కూటములు

ఫిబ్రవరి 7 తో ప్రారంభమగు వారం

పాట 131 (44)

15 నిమి: స్థానిక ప్రకటనలు, మన రాజ్య పరిచర్యనుండి ఎన్నుకోబడిన ప్రకటనలు. క్రొత్త సంచికల ఆధారంగా పత్రికలను ఎలా అందించాలో చూపించండి. ప్రశ్నాభాగంలోని ముఖ్యమైన అంశాలను పునఃసమీక్షించండి.

20 నిమి: “సమాధానకరమైన దేవుని రాజ్యమందు ఆసక్తిని వృద్ధి చేయండి.” అనే శీర్షిక, ప్రేక్షకులతో చర్చ. రెండు ప్రదర్శనలు. రెండవ పేరాను చర్చించిన తర్వాత, పని రద్దీలోవున్న గృహస్థునికి కరపత్రాన్ని ఎలా అందించాలో చూపించండి. ప్రచారకుడు పునర్దర్శనానికి పునాది వేసే ప్రశ్నను గౌరవపూర్వకంగా అడగాలి. గృహస్థుడు ఆసక్తి చూపించినట్లు, ప్రచారకుడు నిరంతరము జీవించగలరు అనే పుస్తకాన్ని అందించినట్లు మూడవ పేరాలో చెప్పిన విధంగా ప్రదర్శించాలి. పునర్దర్శనం కొరకు పునాది వేయాలి.

10 నిమి: మీరు ఏప్రిల్‌లో సహాయ పయినీరుగా చేయగలరా? సంఘంలో గత నెలల్లో ప్రత్యేక పరిచర్యద్వారా సాధించిన విషయాలనుగూర్చి ప్రస్తావిస్తూ సంఘపెద్ద ఉత్సాహపూరితమైన ప్రసంగమివ్వాలి. ప్రచారకులను మార్చిలో సహాయ పయినీర్లుగా చేయడానికి, అయితే, ప్రత్యేక సేవా నెలయైన ఏప్రిల్‌లో సాధ్యమైనంత మంది సహాయ పయినీర్ల జాబితాలో తమ పేర్లు చేర్చుకోడానికి విశేషంగా ప్రోత్సాహం కలిగించాలి.

పాట 137 (105) ముగింపు ప్రార్థన.

ఫిబ్రవరి 14 తో ప్రారంభమగు వారం

పాట 126 (10)

10 నిమి: స్థానిక ప్రకటనలు. అక్కౌంట్సు రిపోర్టు. చందాలు పంపించినందుకు సొసైటీ మెచ్చుకున్నదాన్ని గూర్చి చెప్పండి, స్థానిక సంఘ అవసరాల్లో సంఘసభ్యులు యిచ్చిన మద్దతును మెచ్చుకోండి. వారాంతాల్లో రాజ్యపరిచర్యలో పాల్గొనాలని ప్రోత్సహించండి, ప్రాంతీయ సేవా ఏర్పాట్లను గూర్చి తెలపండి.

20 నిమి: “అర్థవంతమైన పునర్దర్శనాలద్వారా అభివృద్ధికి తోడ్పడండి” ప్రశ్నా-జవాబుల చర్చ. మూడవ పేరాలో యివ్వబడిన దాని ఆధారంగా పునర్దర్శనాన్ని ప్రదర్శించండి. ఆ దర్శనంలో ఎక్కువ అంశాన్ని చర్చించనవసరం లేదన్న వివేచన కలిగివుండవలసిన అవసరాన్ని, భవిష్యత్తు సందర్శనానికి వారి మనస్సులో ఆసక్తి కలిగించవలసిన ప్రాముఖ్యతను నొక్కి చెప్పాలి.

15 నిమి: “సకల జనముల చేత ద్వేషించబడుదురు.” అనుభవజ్ఞుడైన సంఘపెద్ద ప్రసంగమిస్తాడు.

పాట 122 (94) ముగింపు ప్రార్థన.

ఫిబ్రవరి 21 తో ప్రారంభమగు వారం

పాట 198 (50)

5 నిమి: స్థానిక ప్రకటనలు. దైవపరిపాలనా వార్తలు.

15 నిమి: “యెహోవా యొక్క ఆదిసంభూతున్ని స్తుతించండి!” శీర్షికతో ప్రశ్నా-జవాబుల చర్చ. జ్ఞాపకార్థ దినానికి, ఆ తర్వాత యివ్వబడే బహిరంగ ప్రసంగానికి ఆహ్వానించవలసిన వ్యక్తుల పట్టికను వేసుకోవాలని సంఘపెద్ద అందరిని ప్రోత్సహిస్తూ ఆప్యాయతతోను, ఉత్సాహంతోను ప్రసంగిస్తాడు. ఏడవ పేరాలో యివ్వబడిన అంశాలను ప్రదర్శించాలి. రాజ్యమందిరానికి వచ్చి చుట్టుప్రక్కలు పరికిస్తున్న వ్యక్తితో ప్రచారకుడు ఎలా మాట్లాడనారంభిస్తాడో చూపించాలి. ఆ వ్యక్తి మరొక నగరంలో నివసిస్తున్న తన బంధువు ప్రోత్సహించినందున యిక్కడికి హాజరయ్యాడని ప్రచారకుడు తెలుసుకుంటాడు. ప్రచారకుడు బైబిలును, పాటల పుస్తకాన్ని అతనికి కూడా చూపించడానికి వీలుగా ఆ వ్యక్తిని తనతోను, తన కుటుంబంతోను కూర్చోమని ప్రచారకుడు ఆహ్వానిస్తాడు. కూటం తర్వాత, ఆ వ్యక్తికి ఏవైనా ప్రశ్నలున్నట్లయితే తాను సమాధానాలిస్తానని ప్రచారకుడు చెబుతాడు. సంఘం జ్ఞాపకార్థ దినాన్ని ఆచరించే సమయాన్ని ప్రకటించి యీ భాగాన్ని ముగించాలి.

10 నిమి: బైబిలు—మన ప్రోత్సాహానికి శ్రేష్ఠమైన ఊట. రీజనింగ్‌ పుస్తకం, 117-21 పేజీలు. సంఘపెద్ద ప్రసంగమిస్తాడు. సంఘంలోను బయటను ఉన్న అనేకులకు ప్రోత్సాహం అవసరం. సంఘంలోని ప్రతి ప్రచారకుడు దేవుని వాక్యాన్ని ఉపయోగించి యితరులను ఎలా ప్రోత్సహించాలో చూపించాలి.

15 నిమి: “యెహోవా చేసిన దానిని వివరంగా చెప్పడం ఎంత ప్రయోజనకరమో!” అనే ఇన్‌సెర్ట్‌లోని 1-11 పేరాల ప్రశ్నా-జవాబుల చర్చ. వ్యక్తిగతంగానో కుటుంబంతోనో యీ పుస్తకాన్ని చదువుతున్న ఒకరిద్దరు సహోదరులు సిద్ధపడి వ్యాఖ్యానించాలి. తాము నేర్చుకున్నదానిలో వారు మెచ్చుకొనే వాటి విలువను చెప్పమనాలి.

పాట 208 (74) ముగింపు ప్రార్థన.

ఫిబ్రవరి 28 తో ప్రారంభమగు వారం

పాట 219 (8)

5 నిమి: స్థానిక ప్రకటనలు. మార్చి నెలలో సాహిత్యాల అందింపును గూర్చిన వివరణ.

15 నిమి: “యెహోవా చేసిన దానిని వివరంగా చెప్పడం ఎంత ప్రయోజనకరమో! అనే ఇన్‌సెర్ట్‌లోని 12-20 పేరాల్లోనుండి ప్రశ్నా-జవాబుల చర్చ. పుస్తకం చదివి ప్రయోజనం పొందిన యిద్దరు ప్రచారకులను వారి అభిప్రాయాలను సిద్ధపడి చెప్పమనండి.

15 నిమి: “మీ సంఘంలోని బహిరంగ కూట కార్యక్రమానికి పూర్తిగా మద్దతునివ్వండి.” ఇది ఒక ప్రసంగమే గాని, ప్రేక్షకులను ఒకటి రెండు ప్రశ్నలడగవచ్చు. ఆసక్తిగల ప్రజలు మొదటిసారిగా బహిరంగ కూటానికి హాజరైనప్పుడు వారు ఆహ్వానించబడినట్లు భావించేలా ఎలా మెలగాలో వివరించాలి. ఒక ప్రచారకుడు తాను క్రమంగా బహిరంగ కూటానికి హాజరౌతున్నందున ఎలా ప్రయోజనం పొందుతున్నాడో సిద్ధపడి చెప్పాలి.

10 నిమి: “అనర్హులకు దయ చూపించకుండా జాగ్రత్తపడండి” అనే ప్రసంగం.

పాట 197 (57) ముగింపు ప్రార్థన.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి