జనవరి కొరకు సేవా కూటములు
జనవరి 3 తో ప్రారంభమగు వారం
పాట 101 (45)
5 నిమి: స్థానిక ప్రకటనలు. స్థానిక ప్రాంతంలోని ప్రజలను ఆకట్టుకొనే తాజా పత్రికల్లోని ప్రత్యేక విషయాలను క్లుప్తంగా ఉన్నతపర్చండి.
25 నిమి: “ధైర్యంగాను, నేర్పుగాను సువార్త ప్రకటించుట” అనే ఇన్‌సెర్ట్‌లోని అంశాన్ని సేవాధ్యక్షుడు లేదా వేరే యోగ్యతగల సంఘపెద్ద ప్రశ్నా సమాధానములతో పరిశీలించును. మూడు, ఐదు, ఆరవ పేరాలను చర్చించునప్పుడు ఆ పేరాలలో ఇవ్వబడిన మహాగొప్ప మనిషి పుస్తకంలోని అధ్యాయాలను చూడమని ప్రేక్షకులను ప్రోత్సహించండి. ఆ పుస్తకమందలి 69, 81 అధ్యాయాల్లోని బొమ్మలపై అవధానాన్ని నిలపండి. ఏడు నుండి పదకొండవ పేరాలను చర్చిస్తూ స్థానికంగా అన్వయించండి. అలాంటి సంఘటనలు ఒకవేళ జరిగితే ఆ స్థానిక ప్రదేశాలను, ప్రాంతాలను వాటిని పరిష్కరించగలిగే పద్ధతులను పొందుపర్చండి. మనం మనుష్యులకు భయపడం, కాని పరిచర్యలో కలహపూరితంగా నిలబడటంద్వారా ఏమీ సాధించలేమని చూపండి. (మత్త. 10:28; 1 పేతు. 3:15) బదులుగా, నేర్పుగాను, పరిస్థితులనుబట్టి ప్రవర్తించడంద్వారా వివాదం లేకుండా ఎలా చేయవచ్చో చూపండి, తద్వారా మన పనిని శాంతిగాను తక్కువ అడ్డంకులతోను కొనసాగించవచ్చును.
15 నిమి: “మన సాహిత్యాల విలువను మెచ్చుకొనేలా ఇతరులకు సహాయపడుట.” అనే శీర్షికను సంఘంతో చర్చించండి. మూడవ పేరాను చర్చించిన తర్వాత దేవుడు శ్రద్ధ కల్గియున్నాడా? అనే బ్రోషూర్ యొక్క ఉపయోగాన్ని ప్రదర్శించండి. ఒకవేళ సంఘంలో ఈ బ్రోషూర్ లభ్యంకాకపోతే, సంఘంలో లభ్యమయ్యే 192 పేజీల పాత పుస్తకాలను ప్రత్యేక ధరకు అందించవచ్చని తెలియజేయండి. వీటిలో దేనినైనా అందిస్తున్నట్లు 5 వ పేరా చర్చించిన తర్వాత క్లుప్తంగా ప్రదర్శించండి.
పాట 116 (37) ముగింపు ప్రార్థన.
జనవరి 10 తో ప్రారంభమగు వారం
పాట 147 (44)
10 నిమి: స్థానిక ప్రకటనలు, మనరాజ్య పరిచర్య నుండి తగిన ప్రకటనలు.
15 నిమి: మీ విశ్వాసాన్ని సవాలుచేసే పరిస్థితిని ఎదుర్కోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? డిశంబరు 1990 మనరాజ్య పరిచర్య ఇన్‌సెర్ట్‌నందలి 1-3 పేరాల్లోని అంశాలను ఉపయోగిస్తూ, చికిత్స విధాన నిర్దేశకం/పత్రం యొక్క భద్రతా విలువను మెచ్చుకొనేలా సహోదరులకు సహాయపడడానికి, యోగ్యతగల పెద్ద యిచ్చే ఉత్తేజపూరిత ప్రసంగం. ఇటీవల జరిపిన విచారణలో కనుగొన్నదేమంటే, పరిశీలించిన కార్డుల్లో 50 శాతంకంటే ఎక్కువ కార్డులు సంతకం లేకుండా, సాక్ష్యంలేకుండా, లేదా గడువుతీరిపోయి ఉన్నాయి. బాప్తిస్మం పొందిన సహోదరులకు మాత్రమే కార్డులు పంచబడేటట్టు చూసి, కార్డులను పూర్తిచేసే విషయంలో నడిపింపునిచ్చిన అక్టోబరు 15, 1991 లో వ్రాసిన లెటర్‌ను పరిశీలించండి. ఇప్పుడే ఆ కార్డులను పూర్తి చేయకుండా, వాటిని ఇంటికి తీసుకువెళ్లి, ప్రార్థనాపూర్వకంగా వాటి అవసరతను పరిశీలించమని సహోదరులకు సలహా యివ్వండి. కాని ఆ సమయంలో కార్డుపై సంతకం చేయవద్దు. పూర్తిచేసిన కార్డును తర్వాతి సంఘపుస్తక పఠనానికి తీసుకువస్తే, అక్కడ సంఘపెద్దలు కార్డులపై సంతకం, సాక్ష్యం, తారీఖులు పూర్తి చేయడంలో సహాయపడతారు. సంఘపుస్తక పఠన నిర్వాహకుడు తన గుంపులోని వారంతా వాటిని కల్గియున్నారని రుజువుచేసుకోవడానికి తాజా పట్టికను ఉపయోగిస్తాడు. (బాప్తిస్మం పొందిన తలిదండ్రులు తమ పిల్లలకు గుర్తింపుకార్డును పూర్తిచేయుటలో సహాయపడగలరు.) ఆ పుస్తక పఠనానికి హాజరుకానివారు తర్వాత సేవా కూటంలో తమ కార్డులను పూర్తి చేసుకొనుటలో పఠన నిర్వాహకులు/పెద్దలు సహాయపడవచ్చు, అలా బాప్తిస్మం పొందిన ప్రచారకులందరు తమ కార్డులు సరిగ్గా నింపి, సంతకాలు చేయించుకునే వరకు సహాయపడగలరు. ఇంకా మిగిలిపోయినవారెవరైనా వుంటే వారి పట్టికను పెద్దలు కల్గియుండి, సాధ్యమైనంత త్వరలో వాటిని పూర్తిచేయడానికి ప్రయత్నించాలి.
20 నిమి: “మెప్పుదలను పెంపొందించడానికి తిరిగి దర్శించుట.” ప్రేక్షకులతో చర్చ. దేవుడు శ్రద్ధ కల్గియున్నాడా? అనే బ్రోషూర్‌ను ప్రచారకులు ఉపయోగిస్తున్నట్లైతే, 3 వ పేరాలోని సలహాను ఉపయోగిస్తూ, బ్రోషూర్ తీసుకున్న వ్యక్తిని ఎలా పునర్దర్శించాలో ప్రదర్శించండి. ప్రత్యేక అందింపు క్రింద 192 పేజీల పుస్తకాన్ని తీసుకున్న ఎవరినైనా పునర్దర్శిస్తున్నట్లు కూడ ప్రదర్శించండి.
పాట 154 (72) ముగింపు ప్రార్థన.
జనవరి 17 తో ప్రారంభమగు వారం
పాట 167 (110)
10 నిమి: స్థానిక ప్రకటనలు, అకౌంట్స్ రిపోర్టు. విరాళం ముట్టినట్లు చెప్పబడిన మాటలును కూడ ఇమడ్చండి. సొసైటీ సేవ నిమిత్తం, ఆలాగే సంఘ కార్యకలాపాల నిమిత్తం ప్రచారకులు ఇచ్చిన ఆర్థిక మద్దతు కొరకు మెప్పుదలను వ్యక్తంచేయండి. ఇంతవరకూ తమ చికిత్స విధాన నిర్దేశకం/పత్రాన్ని పూర్తిచేయని వారిని ఈ రోజే సంఘపుస్తక పఠన నిర్వాహకుని లేదా సంఘపెద్దలలో వేరే ఒకరిని సమీపించి పూర్తిచేయాలని జ్ఞాపకం చేయండి.
20 నిమి: “తరచూ ప్రకటించిన ప్రాంతాల్లో పనిచేయుట.” యోగ్యతగల పెద్దచే ప్రశ్నా సమాధానముల చర్చ. తరచూ పనిచేసిన ప్రాంతాలున్న సంఘాలలో, 4 వ పేరాను, ఆలాగే 6, 7 పేరాలలో దేనినైనా సూచించే రీజనింగ్ పుస్తకంలోని ఉపోద్ఘాతాలపై ఆధారపడి లేదా ప్రాముఖ్యంగా స్థానికంగా ఉపయోగపడే ప్రదర్శనను చూపండి. తరచూ పనిచేయని ప్రాంతాలున్న సంఘాలలో, రీజనింగ్ పుస్తకంలో తగిన ఉపోద్ఘాతాలపై ఆధారపడిన ప్రదర్శననివ్వండి. ప్రదర్శనలు బాగా సిద్ధపడినవైయుండాలి.
15 నిమి: భూమియొక్క భవిష్యత్తు ఏమిటి? రీజనింగ్ పుస్తకమందలి 112 నుండి 117 పేజీలపై ఆధారపడిన ప్రసంగం. (5 నిమి.) నూటపన్నెండు మరియు నూట పదమూడు, పేజీలలో ఆరంభమయ్యే ఉపశీర్షికలక్రింద, ఆలాగే 114 వ పేజీ మధ్యభాగం వరకున్న సమాచారం మీద ఆధారపడిన ప్రసంగం. (7 నిమి.) ఒక క్రొత్త ప్రచారకుడును, పూర్ణసిద్ధిపొంది, అనుభవంగల ప్రచారకుడును కలిసి 114 నుండి 116 పేజీలలోని సమాచారాన్ని చర్చిస్తారు. భూమి నాశనం చేయబడుతుందని బైబిలు సూచిస్తుందని క్రొత్త ప్రచారకునియొక్క లోకసంబంధ బంధువులు వాదించారు. భూమిని గూర్చిన బైబిలు లేఖనాలను అర్థం చేసుకోవడానికి, క్రొత్త ప్రచారకుడు అనుభవంగల్గిన ప్రచారకుని సహాయాన్ని అడుగుతాడు. (3 నిమి.) ముగింపులో, 117 వ పేజీలోని “దేవుడు భూమిపై నిత్యజీవాన్ని ఎలాంటి ప్రజలకు అనుగ్రహిస్తాడు?” అనే ప్రశ్నను చర్చించండి. అలాంటి ఆశీర్వదించబడిన ఆధిక్యత కొరకు పాటుపడాలని ప్రతి ఒక్కరినీ ప్రోత్సహించండి.
పాట 176 (16) ముగింపు ప్రార్థన.
జనవరి 24 తో ప్రారంభమగు వారం
పాట 178 (67)
15 నిమి: స్థానిక ప్రకటనలు. “క్రొత్త ప్రత్యేక సమావేశ దిన కార్యక్రమం” అనే శీర్షికను చర్చించండి. ఈ 1994 లోని ప్రత్యేక సమావేశ దిన కార్యక్రమానికి హాజరవ్వడానికి ముందుగానే ఏర్పాటుచేసుకోమని అందర్నీ ప్రోత్సహించండి. ఒకవేళ తెలిస్తే తారీఖును, స్థలాన్ని ప్రకటించండి. దైవపరిపాలనా వార్తల్ని ముడిపెట్టండి. ఆలాగే ఈ వారాంతంలో ప్రాంతీయసేవలో పాల్గొనుమని అందరినీ ప్రోత్సహించండి. సంఘ ప్రాంతీయ సేవా ఏర్పాట్లను వివరించండి.
15 నిమి: ప్రశ్నా భాగము. కొంతవరకు ప్రేక్షకులతో చర్చతోకూడిన ప్రసంగం. మొదటి మూడు పేరాల్లో వివరించినట్లు ఎందుకు వ్యవహరించాలో అందరూ అర్థం చేసుకొనేలా సహాయపడండి. మా ఇండ్లకు రావద్దని అనేక సందర్భాల్లో మేము యెహోవాసాక్షులకు చెప్పాం, అయినా వారు వస్తూనే ఉన్నారని చెబుతున్న కోపోద్రేకులైన గృహస్థులనుండి అప్పుడప్పుడు సొసైటీ ఉత్తరాలను, టెలిఫోన్ కాల్స్‌ను అందుకుంటున్నది. కాబట్టి, ఇంటింటి సేవలో పాల్గొన్నప్పుడు, మనం తప్పనిసరిగా టెరిటరీ ఎన్‌వెలప్‌ను చెక్‌చేసి, మనలను రావద్దని చెప్పిన ఇండ్లను గూర్చి వ్రాసుకోవాలి. స్థానికంగా అన్వయింపజేస్తూ, “ధైర్యంగాను, నేర్పుగాను సువార్త ప్రకటించుట,” అనే ఇన్‌సెర్ట్ శీర్షికనుండి ఆలోచన రేకెత్తించే విషయాలను క్లుప్తంగా పునర్విమర్శించండి.
15 నిమి: సంఘ ప్రాంతీయ సేవా ఏర్పాటు. సంఘంయొక్క గత నాలుగు నెలల సేవనుగూర్చి సేవాధ్యక్షుడు, మరొక పెద్ద కలిసి పునర్విమర్శిస్తారు. సేవాసంవత్సరంలోని మూడువంతుల్లో ఒకవంతు గతించిపోయింది (సెప్టెంబరు నుండి డిశంబరు వరకు). సంఘం ఎలా పనిచేస్తుంది? మంచిగా పనిచేసే విషయాల్లో సంఘాన్ని బాగా మెచ్చుకోండి. ఆలాగే సంఘం అభివృద్ధి సాధించాల్సిన విషయాలను కూడ వివరించి, అభ్యాససిద్ధమైన సలహాలను అందించండి. సేవా సంవత్సరమందలి మొదటి నాలుగు మాసాలనుండి ప్రోత్సాహకరమైన ప్రాంతీయ సేవా అనుభవాలను ఒకటి లేదా రెండింటిని ఇమడ్చండి. మంచి, ఉత్తేజకరమైన మాటలతో ముగించండి. పరిచర్య చేయడంలో యేసు ఆనందాన్ని పొందాడు. మనం కూడ యెహోవా ఇచ్చిన పనిలో ఎక్కువ సమయాన్ని గడపడంలో గొప్ప ఆనందాన్ని పొందగలము.—యోహాను 4:34; 1 కొరిం. 15:58.
పాట 179 (29) ముగింపు ప్రార్థన.
జనవరి 31 తో ప్రారంభమగు వారం
పాట 186 (111)
5 నిమి: స్థానిక ప్రకటనలు. ఈ వారాంతంలోని ప్రాంతీయ సేవను ఉదయాన్నే ఆరంభించడానికి అందర్నీ ప్రోత్సహించండి. తాజా పత్రికల నందించడానికి సహాయకరమైన సలహాలను ఇవ్వవచ్చును.
10 నిమి: ఇంటింటి సేవలో మీరు నిరంతరము పరదైసు భూమిపై జీవించగలరు అనే పుస్తకాన్ని అందించండి. పుస్తకంలోని నిజమైన విలువను ప్రజలు తెలిసికొని, యెహోవాను ఆరాధించేలా సహాయపడే విషయంలో ఉత్సాహపూరితమైన క్లుప్త ప్రసంగం. ఈ పుస్తకాన్ని ప్రాంతీయ సేవలో ఉపయోగించడానికి సిద్ధపడుటలో మనరాజ్య పరిచర్య యొక్క ఈ సంచికలోని సలహాలను ప్రచారకుడు ఎలా ఉపయోగించవచ్చునో ప్రదర్శించండి.
20 నిమి: “కూటములకు హాజరగుట—ఒక గంభీరమైన బాధ్యత.” ప్రశ్నా సమాధానములతో చర్చ. రెండవ పేరాకు సంబంధించి, క్రమంగా కూటములకు హాజరగుటలో ఎదురైన అడ్డంకులపై విజయం సాధించిన ప్రచారకులను పరిచయం చేయండి.
10 నిమి: ప్రాంతీయ అవసరతలు. లేదా అక్టోబరు 1, 1993 వాచ్‌టవర్ పక్షపత్రిక సంచికలన్నింటిలో 22 నుండి 25 పేజీలలో వెలువడిన “దేవుని కనికరముపట్ల సరైన దృష్టిని కలిగివుండండి,” అనే శీర్షికపై ఆధారపడిన సంఘపెద్ద ప్రసంగం. వాచ్‌టవర్ మాసపత్రికగా ముద్రించబడుతున్న భాషలనుపయోగించే సంఘాలు, ఈ ప్రసంగాన్ని అక్టోబరు 1, 1993 సంచికలోని 8 నుండి 11 పేజీలందలి “వేచివుండుటకు నేర్చుకొనుటలోగల సమస్య,” అనే శీర్షికపై ఆధారపడి ఇవ్వవచ్చు. ఈ శీర్షిక ఇంగ్లీషు, ఇతర పక్షపత్రికలలో అక్టోబరు 15, 1993 సంచికలలో ఉంది.
పాట 188 (81) ముగింపు ప్రార్థన.