మహాగొప్ప మనిషిని గూర్చి యితరులు తెలుసుకోవడానికి సహాయపడండి
1 జీవించిన వారిలోకెల్లా మహాగొప్ప మనిషి అనే పుస్తకాన్ని చదివిన వారు, తమ జీవితాల్లో అది చూపిన ప్రభావాన్ని బట్టి హృదయపూర్వక మెప్పును వ్యక్తపర్చారు. ఒకరు యిలా వ్రాశారు: “ఈ పుస్తకాన్ని ముగించేటప్పటికి, యేసు నన్ను తనతో సహవసించమని, తనతో జీవించమని, తన బాధలను, భావోద్రేకాలను తన పరిచర్యలోని ప్రతి విషయాన్నీ పంచుకొమ్మని నన్ను ఆహ్వానిస్తున్నట్లు నాకనిపించింది. . . . ఈ పుస్తకాన్ని చదవడం, యేసు జీవితంపై ఒక చిత్రాన్ని చూచినట్లుంది.”
2 మహాగొప్ప మనిషి అనే పుస్తకం, యేసునే కాక యెహోవాను కూడా యింకా ఎక్కువగా తెలుసుకోవడానికి సహాయపడుతుంది. (యోహాను 14:9) పన్నెండేళ్ల ప్రాయమున్న ఒక కుర్రవాడు ఈ పుస్తకాన్ని గూర్చి యిలా అన్నాడు: “అది నన్ను ఎంతగా ఓదార్చిందంటే, దాన్ని చదివిన వెంటనే నేను యెహోవాకు ఆనంద బాష్పాలతో ప్రార్థించాను. నా హృదయాంతరాల్లో, యెహోవా, యేసు మనలను సంరక్షిస్తున్నారనే సురక్షిత భావాన్ని పొందాను.” యోహాను 17:3లో వ్రాయబడినట్లు, యెహోవాను ఆయన కుమారుని తెలుసుకోవడమే నిత్యజీవమని యేసు చెప్పాడు. “ఆయన తత్వముయొక్క మూర్తిమంతమునై” వున్నాడు గనుక, ఈ పుస్తకంలో యేసు జీవిత చరిత్రను చదవడం వల్ల యెహోవా వ్యక్తిత్వాన్ని గూర్చి ప్రత్యేకమైన అంతర్దృష్టిని పొందగలం.—హెబ్రీ. 1:3.
3 మహాగొప్ప మనిషి పుస్తకం 1 కోటి, 90 లక్షల ప్రతులు, 70 భాషల్లో ముద్రించబడ్డాయి. అది ఈ పుస్తకం ఎంత జన ప్రియమైందో కనపరుస్తోంది. అనేకులు ఈ పుస్తకాన్ని అందుకున్న వెంటనే చదువుతారు. ఆసక్తిగల ఒకతను, ఈ పుస్తకాన్ని స్వీకరించిన రెండు వారాల్లో చదివేశాడు. ఈ పుస్తకాన్ని స్వీకరించిన ఒక మతనాయకుడు యిలా పేర్కొన్నాడు: “నేను ఈ పుస్తకాన్ని క్రింద పెట్టలేకపోతున్నాను. ప్రతి రోజు రాత్రి పడుకునే ముందు నేనూ నా భార్యా ఈ పుస్తకంలోని కొంత భాగాన్ని చదువుతాము.”
4 తటస్థసాక్ష్యం: ఒక సహోదరుడు, తాను పనిచేసే ప్రాంతంలో మహాగొప్ప మనిషి పుస్తకాన్ని చూపించాడు. అతని దగ్గిర ఈ పుస్తకం వుందన్న విషయం అంతటా ప్రాకిపోయింది, అంతే కాకుండా ఈ పుస్తకంలోని సమాచార వృత్తాంతం అంతటా వ్యాపించింది. అతని సహూద్యోగులు, ఈ ప్రతులను కావాలని కోరినవారి లిస్టు తయారుచేసారు. అతను 461 పుస్తకాలను అందించాడు! ఈ పుస్తకాన్ని పొందిన వారిలో ఐదుగురు బైబిలు పఠిస్తున్నారు. ఒక సహోదరి విమానంలో ప్రయాణిస్తూ, కాథొలిక్ మతాధికారి నియామకానికి వెళ్తున్న ఒక ప్రీస్టుకు మహాగొప్ప మనిషి పుస్తకాన్ని అందించింది. ఈ ప్రీస్టు వాటిక్న్లో 40 ఏళ్లు వున్నాడు. మనమందరము యితరులకు ఈ పుస్తకాని సిఫారస్సు చేయడానికి గల ప్రతి అవకాశాన్ని వినియోగించుకోవాలి.
5 యువత దీన్ని మెచ్చుకుంటోంది: యౌవనులు ఈ పుస్తకంలో ఎంతో ఆసక్తిని కనపరుస్తున్నారు. తొమ్మిదేళ్ల అబ్బాయి యిలా వ్రాశాడు: “నా అభిమాన పుస్తకం జీవించిన వారిలోకెల్లా మహాగొప్ప మనిషి, ఎందుకంటే దాన్నుండి నేను ఎంతో నేర్చుకున్నాను.” ప్రాంతీయ సేవలో యౌవనులను కలిసినప్పుడు వారి తలిదండ్రులు అనుమతిస్తే, వారికి ఈ పుస్తకం చూపించి, అందులోని కొన్ని ముఖ్యాంశాలనూ చిత్రాలను సమీక్షించడానికి మనం సమయం తీసుకోవాలి. బహుశా యౌవనులకు మనము ఈ పుస్తకాన్ని అందించవచ్చు. యేసును తెలుసుకోగల అవకాశం దొరికినప్పుడు యౌవనులు ఆయనకు సన్నిహితులు కాగలరు మాట్లాడగలరు. యేసు అందరికీ అందుబాటులో వుండేవాడు.—మత్త. 19:14, 15.
6 మహాగొప్ప మనిషి పుస్తకం చదవడం మనుష్యుల జీవితాల్నే మార్చి వేయగలదు. మీకు వీలైనంత మందికి దాని లోని విషయాలను తెలియజేయడానికి ప్రయత్నించండి. పుస్తక ఉపోద్ఘాతంలోని చివరి పేజీలో, “ఆయననుగూర్చి నేర్చుకొనుటద్వారా కలుగు ప్రయోజనములు” అనే శీర్షికాంశం నందలి విషయాన్ని ఉపయోగించండి. ఈ సమాచారం, ఈ పుస్తకాన్ని చదవడంలో వారు పొందే ప్రయోజనంపై కేంద్రీకరించేట్లు వారికి సహాయపడుతుంది. పుస్తకాన్ని చదివి ఒక వ్యక్తి తన భావాతిశయాన్ని వ్యక్తపరచినట్లు, మీ ప్రాంతంలోని అనేకులు చేయవచ్చు: “నేను చదివిన వాటిలోకెల్లా యిదే చక్కటి పుస్తకం! అది నా జీవితాన్ని మార్చివేసింది.”