కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 5/93 పేజీ 3
  • సాహిత్యం యెడల మెప్పు కనుపర్చుట

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • సాహిత్యం యెడల మెప్పు కనుపర్చుట
  • మన రాజ్య పరిచర్య—1993
  • ఇలాంటి మరితర సమాచారం
  • మన సాహిత్యాన్ని జ్ఞానయుక్తంగా ఉపయోగించండి
    మన రాజ్య పరిచర్య—1999
  • సమృద్ధిగానే అయినా వివేచనతో విత్తండి
    మన రాజ్య పరిచర్య—2003
  • మన సాహిత్యాలను నీవు విలువైనవిగా ఎంచుదువా?
    మన రాజ్య పరిచర్య—1992
  • ప్రశ్నాభాగం
    మన రాజ్య పరిచర్య—2011
మరిన్ని
మన రాజ్య పరిచర్య—1993
km 5/93 పేజీ 3

సాహిత్యం యెడల మెప్పు కనుపర్చుట

1 “పుస్తకములు అధికముగా రచింపబడును, దానికి అంతము లేదు.” (ప్రసంగి 12:12) చాలా పుస్తకాలు అవి ముద్రింపబడిన పేపరంత విలువైనవి కూడకాదు. కాని వాచ్‌టవర్‌ సంస్థ ప్రచురించే సాహిత్యం విషయంలో ఇది నిజంకాదు. అందులో జీవాన్నికాపాడే ఆత్మీయాహారం వుంది గనుక అది విలువైనది. ఆసక్తిగల వారు యెహోవాను తెలుసుకొనుటకు అది సహాయం చేస్తుంది, మరి ఇప్పటికే యెహోవా సమర్పిత సేవకులుగా వున్నవారి విశ్వాసాన్ని దృఢపరుస్తుంది.

2 మన సాహిత్యం నుండి ఇతరులు మేలు పొందగలరని మనకు తెలుసు గనుక, వాటిని ఇతరులకు యివ్వాలని మనమిష్టపడతాము. దాన్ని ప్రచురించి, పంచిపెట్టడం చాల ఖర్చుతోకూడిన పని. అందుకే మన ప్రచురణలను మనం అనాలోచితంగా యిచ్చివేయము. మనమందజేసే వివిధ రకాలైన సాహిత్యాలకు, అలాగే వాచ్‌టవర్‌, అవేక్‌! పత్రికలకు తగిన చందాను, ఒకొక్క ప్రతి వెలను స్పష్టంగా నిర్ణయించారు. సాహిత్యాన్ని తీసుకునే ప్రతి ఒక్కరిని తిరిగి దర్శించాలి. ఒక వ్యక్తి మనం కలిసిన మొదటిసారి సాహిత్యం తీసుకొనకపోయినా, మన సమాచార మందాసక్తి కనుపరిస్తే కూడ, మనం కచ్చితంగా తిరిగి దర్శించాలి. మీ దర్శనాల మధ్య చదువుకోవటానికి ఆ వ్యక్తి యొద్ద ఒక ప్రచురణ ఉండేలా, ఒకవేళ మరోసారి వెళ్లినప్పుడు సాహిత్యాన్ని లేక పత్రికలను అందజేస్తే యుక్తంగా వుంటుంది.

3 సాహిత్యానికి వెలెంతో గృహస్థునితో చెప్పటానికి కొంతమంది వెనుకాడుతారు. అది, గృహస్థుడు సాహిత్యం తనకు ఉచితంగా ఇవ్వబడుతుందేమోనని అనుకునేలా సందిగ్ధంలో పడవేస్తుంది. మనం సాహిత్యాన్ని అందజేసేటప్పుడు, దాని వెలను స్పష్టంగా తెలియజేయాలి. కొన్ని సందర్భాలలో మన పని వ్యాపారనిమిత్తం కాదని, ఇంకా ఎక్కువ సాహిత్యాన్ని ప్రచురించటానికి ఆ డబ్బును ఉపయోగిస్తారని వివరించడం మంచిది. మన ఉద్దేశం రాజ్యసువార్త ప్రకటించి, శిష్యులను చేయడమన్న వాస్తవాన్ని ప్రధమంగా వారికి తెలియజేయండి. గృహస్థుడు సాహిత్యాన్ని తీసుకుంటే అతనికి ఆసక్తివుందని తెలుసుకొనుటకది మనకు సహాయం చేస్తుంది. ప్రజల వద్ద పొగాకు లేక లోకసంబంధ సాహిత్యం కొరకు డబ్బు వుంటుంది. మీరు చెప్పిన దానిలో నిజంగా వారికి ఆసక్తి వుంటే, మంచి సాహిత్యాన్ని పొందటానికి వెల చెల్లించడంలోని వివేచనను వారు గ్రహిస్తారు.

4 వెలను గూర్చి తగినరీతిగా వివరిస్తే, మనం సాహిత్యాన్ని అమ్మడం లేదుకాని, సాహిత్యాన్ని ప్రచురించుటకైన ఖర్చు తీసుకుంటున్నామని గృహస్థుడు తెలుసుకుంటాడు. ఒకవ్యక్తి సాహిత్యాన్ని తీసుకున్నా, తీసుకొనక పోయినా రాజ్యసువార్త వారి హృదయాలను చేరి, యెహోవా యొక్క అద్భుతమైన సంకల్పాలను గూర్చి ఇంకా ఎక్కువ నేర్చుకోవాలన్న ఆసక్తి వారిలో పెంపొందింప చేయాలన్నదే మన ఆకాంక్ష.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి