కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 4/93 పేజీలు 5-6
  • దైవపరిపాలనా పాఠశాల పునఃసమీక్ష

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • దైవపరిపాలనా పాఠశాల పునఃసమీక్ష
  • మన రాజ్య పరిచర్య—1993
మన రాజ్య పరిచర్య—1993
km 4/93 పేజీలు 5-6

దైవపరిపాలనా పాఠశాల పునఃసమీక్ష

మార్చి 1 నుండి జూన్‌ 14, 1993 మధ్య వారములలో నిర్దేశించబడిన ప్రసంగముల సమాచారముపై ఆధారపడి, పుస్తకములను మూసివేసి చేయవలసిన పునఃసమీక్ష అనుమతించిన సమయములోపల, మీరు వ్రాయగల్గినన్ని ప్రశ్నలకు సమాధానము వ్రాయుటకు వేరే పేపరును ఉపయోగించండి.

[గమనిక: వ్రాతపూర్వక పునఃసమీక్ష సమయములో ఏ ప్రశ్నలకు సమాధానమిచ్చుటకైనను కేవలము బైబిలును మాత్రమే ఉపయోగించవచ్చును. వాటి చివరనున్న రెఫరెన్సులు మాత్రము మీ వ్యక్తిగత పరిశోధనకైయున్నవి. ది వాచ్‌టవర్‌ రెఫరెన్సులున్న ప్రతిచోట పేజీ మరియు పేరాగ్రాఫ్‌ నెంబర్లు ఉండకపోవచ్చును.]

ఈ క్రింది వాక్యములు, సత్యమో, అసత్యమో సమాధానమిమ్ము:

1. బైబిలు పఠనమును నిర్వహించునపుడు, అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానము ఇవ్వకుండా, భవిష్యత్తులో సమాధానమిచ్చుటకు కొన్నిటిని విడిచిపెట్టుట ఒక్కోసారి మంచిదై యుండవచ్చును. [sg పు. 94 పేరా 14]

2. దైవ పరిపాలనా పరిచర్య పాఠశాల యొక్క ముఖ్య ధ్యేయములలో ఒకటేమనగా, మనము ప్రాంతీయ పరిచర్యలో ఎక్కువ సమర్థవంతులగుటకు సహాయపడుటే. [sg పు. 96 పేరా 1]

3. దైవపరిపాలనా పరిచర్య పాఠశాలలో, విద్యార్థికి తాను ముందు అభివృద్ధి చేసుకోమని సూచించబడిన అంశముల మీదనే ఎల్లపుడు సలహా ఇవ్వవలెను. [sg పు. 101 పేరా 7]

4. ఇప్పటి వరకు 1 రాజులను ధృవపరచుటకు పురావస్తు శాస్త్రమునుండి ఎటువంటి మద్దతు లేదు. [si పు. 65 పేరా 4 (1983 సంచిక, పు. 65 పేరా 4)]

5. పాఠశాల నిర్వాహకుడు ప్రసంగమిచ్చిన వారికి కేవలము చాలా చక్కగా చేశాడని లేక ఒక ప్రసంగ లక్షణముపై మరల పనిచేయాలని చెప్పుట సరిపోదు. [sg పు. 103 పేరా 13 (1971 సంచిక, పు. 103 పేరా 15)]

6. ఇంటింటి సేవలో మాట్లాడునపుడు తరచు ఉండే బలహీనత ఏదనగా ఉపోద్ఘాతము చాలా పొడవుగా ఉండి, సాక్షి ఎప్పుడు అసలు విషయానికొస్తాడా అని ఇంటి వారు అనుకుంటారు. [sg పు. 115 పేరా 14]

7. సంఘములో మైక్‌ సెట్‌ ఉన్నట్లయితే, విద్యార్థి ప్రసంగీకులకు స్వరము విషయములో సలహానివ్వనవసరము లేదు. [sg పు. 117 పేరా 6]

8. విద్యార్థి ప్రసంగమును ఇచ్చునపుడు, వ్యవధినిచ్చుట ఎంత ప్రాముఖ్యమనగా ప్రసంగీకుడు తన లిఖితప్రతి లేక సంక్షిప్తప్రతి మీద అతడు ఎక్కడ విశేషముగా వ్యవధినివ్వాలనుకుంటాడో అక్కడ గుర్తుపెట్టుకొనవలెనని సూచించబడుతుంది. [sg పు. 120-1, పేరా 20, 23]

9. ఏన్దోరులోని కర్ణపిశాచముగల స్త్రీ చెప్పిన శకునము ఏమాత్రము నిజము కాలేదు. (1 సమూ. 28:19) [వారపు బైబిలు పఠనము; w79 2/15 పు. 6 చూడుము.]

10. దావీదు మరియు బెత్షెబాల అనుభవము, తలిదండ్రుల ప్రవర్తన వారి పిల్లలపై గొప్ప ప్రభావము కలిగిస్తుందని నొక్కి తెలుపవలెను. (2 సమూ. 12:13, 14) [వారపు బైబిలు పఠనము; w86 3/15 పు. 31 చూడుము.]

ఈ క్రింది ప్రశ్నలకు సమాధానమిమ్ము:

11. ఏలీ మరియు సౌలు ఏయే విషయాల్లో తప్పిపోయారు? [si పు. 57 పేరా 27 (పు. 57 పేరా 27)]

12. ఉత్తరము వ్రాసేటపుడు, నీవు వ్రాస్తున్న వారిపై నీవెలా శ్రద్ధను చూపించగలవు? [sg పు. 89 పేరా 13]

13. మనం ప్రసంగమిచ్చునపుడు వినువారిని బైబిలు వైపు ఎలా మళ్లించగలము? [sg పు. 122 పేరా 3]

14. “నాటి దినమున కత్తిచేత కూలినవారికంటె ఎక్కువమంది అడవిలో చిక్కుబడి నాశనమైరి” అని 2 సమూయేలు 18:8 నందు చెప్పబడినదాని అర్థమేమి? [వారపు బైబిలు పఠనము; w87 3/15 పు. 31 చూడుము.]

15. ఇశ్రాయేలీయులను లెక్కించుటకు దావీదును ఎవరు పురికొల్పారు? (2 సమూ. 24:1) [వారపు బైబిలు పఠనము; w92 7/15 పు. 5]

16. మొదటి రాజులు 8:12లో “గాఢాంధకారమందు నివాసము చేయుదునని యెహోవా సెలవిచ్చియున్నాడు” అని రాజైన సొలొమోను ఎందుకు చెప్పాడు? [వారపు బైబిలు పఠనము; w79 7/15 పు. 31 చూడుము.]

17. మన దినములలో షీబా రాణి వంటి ప్రజలని కొందరు ఎలా నిరూపించుకున్నారు? (1 రాజు. 10:4, 7) [వారపు బైబిలు పఠనము; su పు. 149 పేరా 8 చూడుము.]

18. ఏ పురావస్తుశాస్త్ర నిదర్శనము 1 రాజు. 14:25, 26లో చెప్పబడిన దానిని బలపరుస్తుంది? [వారపు బైబిలు పఠనము; ce పు. 212 పేరా 31 చూడుము.]

19. ‘ఆసా ఉన్నత స్థలములను తీసివేయలేదని’ చెప్పినపుడు 1 రాజులు 15:14 యొక్క భావమేమైయున్నది? [వారపు బైబిలు పఠనము; w80 12/1 పు. 28 అథస్సూచి చూడుము.]

ఈ క్రింది వాక్యములను పూరించుటకు అవసరమైన పదములను లేక మాటలను చేర్చండి:

20. సాక్ష్యమివ్వడానికి ఉత్తరము వ్రాసేటప్పుడు ఎల్లపుడు—కవరు మీద వ్రాయాలి. [sg పు. 87 పేరాలు 7, 8]

21. ప్రసంగమును తయారు చేసేటప్పుడు వ్యక్తిగత ఊహపై ఆధారపడకుండా ఉండాలంటే—వాడుతూ, వాటిపై ఆధారపడవలెను. [sg పు. 111 పేరా 13]

22. ప్రసంగము యొక్క ఉద్దేశమును నెరవేర్చుటకు,—ఎక్కువ సమాచారమును తీసుకొనకూడదు. [sg పు. 112 పేరా 19]

23. మొదటి సమూయేలు 25:37, నాబాలు “గుండెపగిలెను” అని చెప్పినపుడు, అతనికి—వచ్చిందని దాని అర్థం. [వారపు బైబిలు పఠనము; w80 6/15 పు. 30 చూడుము.]

24. రెండవ సమూయేలు 7:12, 13 లో వివరించబడిన నిబంధన—[వారపు బైబిలు పఠనము; w90 2/1 పు. 14 చూడుము.]

ఈ క్రింది వాక్యములనుండి సరియైన సమాధానములను ఎంపిక చేయండి:

25. యిర్మీయా 1 రాజుల గ్రంథాన్ని సా.శ.పూ. (1040; 607; 580)లో వ్రాయుట పూర్తి చేశాడనుట స్పష్టమే. [si పు. 64 (పు. 64)]

26. రెండవ సమూయేలు సా.శ.పూ. (దాదాపు 1180-1078; 1077-దాదాపు 1040; 1040-911) మధ్య కాలచరిత్రను తెలియజేస్తున్నది. [si పు. 59 పేరా 3 (పు. 59 పేరా 3)]

27. ఉపోద్ఘాతములో కేవలము (ప్రేక్షకులకు ఆసక్తికరమైనదానిని; మీకు ఉల్లాసకరమైనదానిని; మీరు మాట్లాడుటకు గల సంకల్పమును పూర్తి చేయుదానిని) మాత్రమే చేర్చవలెను. [sg పు. 114 పేరా 8]

28. ఈనాడు ఆధునిక రెఫాయీము అనగా (నియంతృత్వ పరిపాలనలు; క్రైస్తవ మతాధికారులు; ఐక్యరాజ్య సమితి) (2 సమూ. 21:20) [వారపు బైబిలు పఠనము; w89 6/1 పు. 20 పేరా 8 చూడుము.]

29. మొదటి రాజులు 6:1 ప్రకారము సొలొమోను దేవాలయమును సా.శ.పూ. (1037; 1034; 1020)లో కట్టించుటకారంభించాడు. [వారపు బైబిలు పఠనము; si పు. 285 పేరా 8 (పు. 284 పేరా 8) చూడుము.]

30. మొదటి రాజులు 18:21-40లో ముఖ్యమైన సవాలు ఏదనగా ఏ దేవునికి (ఎక్కువ మంది ఆరాధికులు ఉన్నారు; పై అధికారులు మద్దతువున్నది; ఆరాధన చెందాలి). [వారపు బైబిలు పఠనము; w84 7/15 పు. 8-9 చూడుము.]

ఈ క్రింద చూపబడిన వాక్యములను సరైన లేఖనములను జతపర్చుము:

2 సమూ. 1:26; 6:6, 7; 13:14, 15; 1 రాజు. 1:1; హెబ్రీ. 10:23-25

31. ప్రతి ఒక్కరు కూటములలో వ్యాఖ్యానము చేసే వ్యక్తిగత బాధ్యతను కలిగి ఉన్నారు. [sg పు. 92 పేరా 7]

32. మంచి ఉద్దేశములు దేవుని నియమాలను మార్చలేవు. [si పు. 63 పేరా 30 (పు. 63 పేరా 30)]

33. “వేరే గొర్రెలు” మరియు శేషము మధ్య అత్యున్నతమైన ప్రేమ, ఐక్యతలతో కూడిన బాంధవ్యము ఉన్నది. (యోహాను 10:16) [వారపు బైబిలు పఠనము; w89 6/1 పుటలు 25-6 చూడుము.]

34. ఒక యౌవనస్థుడు ఒక కన్యపై మోహాన్ని చూపి, ఆమెతో శయనించాలని వత్తిడి చేసినంత మాత్రాన అతడు ఆమెను నిష్కపటముగా ప్రేమిస్తున్నాడని అర్థం కాదు. [వారపు బైబిలు పఠనము; yy పు. 140 పేరా 22 చూడుము.]

35. వృద్ధులైన వారు వెచ్చగా ఉండుట కష్టమని తలంచుట అసాధారణమేమి కాదు. [వారపు బైబిలు పఠనము; g82 6/8 పు. 22 కూడా చూడుము.]

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి