శాంతి భద్రతలను తెచ్చే దేవుని మార్గమును ప్రకటించుము
1 శాంతి భద్రతలను సాధించుటకు మనుష్యులు అనేక సంగతులను ప్రతిపాదించారు, కాని వాటిలో ఒక్కటికూడా ప్రపంచవ్యాప్తంగా ప్రజల అవసరతలను తీర్చలేదు. రాజకీయ అత్యాశ, లోభత్వముతో పాటు, జాతి, తెగ, మత ద్వేషాలు ప్రపంచ శాంతి భద్రతలకు పెద్ద ఆటంకాలుగా కనిపిస్తున్నను, ఇందుకు ప్రధాన ఆటంకాలు అపవాదియైన సాతాను మరియు యెహోవా దేవునికి లోబడుటకు మానవుని తిరుగుబాటు అని నిజ క్రైస్తవులకు తెలుసు.—కీర్తన 127:1; యిర్మీ. 8:9; 1 యోహా. 5:19.
2 శాంతి భద్రతలకు దేవుని మార్గమే ఏకైక మార్గమని మానవజాతి సమస్యలన్నిటికి చివరి పరిష్కారం యెహోవా మాత్రమే కలిగియున్నాడని మన పొరుగువారు తెలుసుకొనేటట్లు సహాయం చేయుటకు జనవరి మాసములో మనము ప్రయత్నిద్దాము.
3 కరపత్రములను ఉపయోగించుము: సొసైటి మనకొరకు తయారుచేసిన మంచి కరపత్రములను ఉపయోగించుట ద్వారా ప్రోత్సాహకరమైన ఈ వర్తమానమును మనము ఇతరులకు అందించవచ్చును. గతములో అనేక రకములైన కరపత్రములను సంభాషణను ప్రారంభించుటలో, బైబిలు పఠనానికి నడుపుటలో ఎలా ఉపయోగించవచ్చనేది అనేక ప్రదర్శనలద్వారా చూశాము. ఈ ప్రపంచ అంతమును గూర్చిన అనేక ప్రవచనముల గొప్ప నెరవేర్పు అనేకుల అవధానాన్ని ఆకట్టుకొనవలెను. వీటిలో కొన్ని ఎందుకు నీవు బైబిలును నమ్మగలవు?, (ట్రాక్ట్ నెం. 13) అనే కరపత్రమందు 5, 6 పేజిలలో చూపబడియున్నవి.
4 వాట్ డు జెహోవాస్ విట్నెసెస్ బిలీవ్? అనే 14వ నెంబరు ట్రాక్ట్, క్లుప్తముగా ఆ ప్రశ్నకు సమాధానమిస్తుంది. క్రైస్తవమత సామ్రాజ్యము లోని చర్చీలకు మన నమ్మకములెందుకు భిన్నముగా ఉన్నవో వివరించి, ప్రజలు దేవుని రాజ్యము నందు విశ్వాసముంచునట్లు సహాయపడుటకు మనమెందుకు ఎడతెగక ప్రయత్నిస్తామో వివరిస్తుంది. ఈ రాజ్యము త్వరలో ఏమి చేయబోతుందో చూపిస్తూ, రానైయున్న నాశనమును తప్పించుకొనే అద్భుతకర నిరీక్షణను సూచిస్తుంది.
5 లక్షలాదిమంది ప్రజలు నేడు క్రుంగినవారై, స్వస్థత మరియు నిజమైన శాంతి భద్రత, ప్రశాంతతనిచ్చు సమయము కొరకు ఎదురుచూస్తున్నారు. లైఫ్ ఇన్ ఎ పీస్ఫుల్ న్యూ వరల్డ్ (ట్రాక్ట్ నెం. 15) కూడా అనేకులకు నిజమైన ప్రోత్సాహక మూలము కాగలదు.
6 వాట్ హోప్ ఫర్ డెడ్ లౌవ్డ్ వన్స్? అనే 16వ నెంబరు ట్రాక్టు మరణమందు తమ ప్రియులను కోల్పోయిన వ్యక్తులను ఓదార్చి, దేవుని నూతన లోకములో వారు తిరిగి లేచుటను చూడగలరనే నిరీక్షణను ఇస్తుంది.
7 బైబిలు పఠనములను ప్రారంభించండి: ఒక బైబిలు పఠనమును కరపత్రముద్వారా, ఒక బ్రోషూరుద్వారా, పత్రిక లేక పుస్తకముద్వారా ప్రారంభించవచ్చును. గృహస్థులయొద్ద అప్పటికే మన ప్రచురణలలో ఒకటి ఉన్నట్లు గమనిస్తే, బైబిలు పఠనములో దానిని ఎలా ఉపయోగించవచ్చునో నేర్పుగా ప్రదర్శించి చూపండి. మన కరపత్రములు, మన సమస్యలు వాటిని పరిష్కరించుటకు ఎవరు సహాయము చేయుదురు? అను బ్రోషూరు గృహస్థుని ఆసక్తిని రేకెత్తించి బైబిలు పఠనమును ప్రారంభించుటకు మంచి ఉపకరణములు. వీటితోపాటు ఈ మాసములో 192-పేజీల పాత ప్రచురణలను కూడా అందిస్తాము. దయచేసి ‘ప్రకటనలు’ భాగములో మీ భాషకొరకు సూచించబడిన పుస్తకములను గుర్తించి, పరిచర్యలో వీటిని ఉపయోగించుటకు కావలసినన్నిటిని సేకరించుము.
8 నిజమైన భద్రత సృష్టికర్తయైన యెహోవా దేవుని నుండి మాత్రమే రాగలదు. దేవుని వాక్య సత్యమునకు సాధ్యమైనంత ఎక్కువ మంది తమ హృదయములందు మనస్సులందు చోటిచ్చి, అది మనకొరకు చూపించే నిరీక్షణను హత్తుకొనునట్లు సహాయపడేందుకు మనము యిష్టపడతాము. శాంతి భద్రతలకు దేవుని మార్గమును ప్రకటించుటలో మనకున్న బోధనా సహాయకములను బాగుగా ఉపయోగించెదము గాక.—యెష. 2:3, 4.