ఇరుగుపొరుగునందు వెలుగు ప్రకాశకులు
1 ఇటీవలి జిల్లా సమావేశమునకు హాజరైన తరువాత, మన పొరుగువారిమధ్య వెలుగు ప్రకాశకులుగా ఉండవలసిన అవసరతను మనము వివరముగా తెలుసుకున్నాము. (మత్త. 5:15) ఆ కార్యక్రమంలో అందించబడిన సమాచారమంతటిని తలపోసుకొని, మన అనుదిన జీవితంలో అన్వయించుకొనుటకు కృషిచేసేకొలది, సత్యారాధనలో యెహోవాకు సమీపస్థులమవడానికి, ఇతరులు ఆయన వాగ్దానములను గూర్చి నేర్చుకొనేలా సహాయం చేయడానికి అది మనకు ఉపకరించింది.
2 శుక్రవారం ఉదయ కార్యక్రమ ముగింపులో విల్ దిస్ వరల్డ్ సర్వైవ్? అనబడే కరపత్రము విడుదల చేయబడినప్పుడు, వెలుగును ప్రకాశించుటకుగల మన అవకాశాలు వృద్ధి అయ్యాయి. ఈ కరపత్రాన్ని ఎలా ఉపయోగించవచ్చో చూపించుటకు శనివారం ఉదయం ప్రదర్శించబడిన ప్రదర్శనలు ఎంతో సహాయకరమైనవి. దీనితో త్వరలో మరి మూడు కరపత్రములు లభ్యమౌతాయని ఒక ప్రకటన చేయబడింది. వీటి పేర్లేమనగా కంఫర్ట్ ఫర్ ది డిప్రెస్డ్, ఎంజాయ్ ఫామిలి లైఫ్, హు రియల్లి రూల్స్ ది వరల్డ్? సులభంగా వెంటతీసుకొని పోగల ఈ ఉపకరణములను అవకాశం లభించేకొలది ఉపయోగించమని ప్రోత్సాహమివ్వబడింది. మన రాజ్య పరిచర్య ఈ సంచికలోని ‘ప్రకటనలు’ భాగంలో ఆ కరపత్రములన్నీ లభ్యమౌతున్నవని, సంఘములు వాటికొరకు ఆర్డరు చేయవచ్చునని తెల్పబడిన సంగతిని చూసి మీరు సంతోషిస్తారు. త్వరలో అనేక ఇతర భాషలలోను వాటిని సిద్ధంచేయ గలుగుతామని మేము నిరీక్షిస్తున్నాము.
3 శనివారం మధ్యాహ్నం యివ్వబడిన “యేసుక్రీస్తు ప్రత్యక్షతయందు విడుదల” అనే ప్రసంగపు ముగింపులో డజ్ గాడ్ రియల్లి కేర్ ఎబౌట్ అజ్? అనే మంచి క్రొత్త బ్రోషర్ విడుదల చేయబడింది. పూర్తి రంగులతో అందముగా వర్ణించబడిన ఈ బ్రోషర్ ప్రజలు అడిగే అనేక ప్రశ్నలకు సమాధానమిస్తుంది. వాటిలో కొన్ని: దేవుడు బాధను ఎందుకు అనుమతించాడు? బాధ ఎప్పుడైనా అంతమౌతుందా? మనము అంత్యదినములలో ఉన్నామని మనకెలా తెలుసు? భూమి పరదైసుగా ఎలా మార్చబడుతుంది? దేవుని నూతన లోకంలో నిత్యజీవమును మనము ఎలా పొందగలము? ఈ బ్రోషర్ కొత్త పఠనములను ప్రారంభించడానికి శ్రేష్టమైన ఉపకరణంగా ఉంటుంది. ఇది కూడా అందించడానికి ప్రస్తుతం ఇంగ్లీషులోనే లభ్యమౌతుంది. తగిన సమయంలో ఇతర భాషలలోను దీనిని పొందగలమని ఎదురు చూడగలము.
4 “వెలుగు ప్రకాశకుల” జిల్లా సమావేశంలో సమృద్ధిగా లభించిన ఆత్మీయ ఆహారానికి మనమెంత కృతజ్ఞులము! దేవుని ఆత్మీయ వెలుగును ప్రకాశించేవారముగా మనమందరము, మనము నేర్చుకొన్నదానిని మనఃపూర్వకంగా అన్వయించుకొనుట ద్వారా, ప్రతిచోటనున్న ప్రజలు యెహోవాను తెలుసుకొని ఆయనను సేవించునట్లు వారికి సహాయపడుటకై ఈ మంచి నూతన విడుదలలను ఉపయోగించుటకు పాటుపడుటద్వారా మన హృదయపూర్వక మెప్పును ప్రదర్శించుటకు తీర్మానించుకొందము.