అక్టోబరు కొరకు సేవా కూటములు
అక్టోబరు 12తో ప్రారంభమగు వారము
పాట 84 (30)
15 నిమి: స్థానిక ప్రకటనలు మరియు మన రాజ్య పరిచర్య నుండి సముచిత ప్రకటనలు. “ఆసక్తిని తిరిగి రేకెత్తించవచ్చా?” అను శీర్షికను చర్చించి, అలాంటి దర్శనం ఎలా చేయవచ్చో క్లుప్తమైన ప్రదర్శనను చూపుము.
15 నిమి: “సృష్టికి దేవుడైన వానిని స్తుతించుము.” ప్రశ్నా సమాధానముల పరిశీలన. పేరా 4లో సూచించబడిన ప్రచురణలలోనుండి అనుభవములను చెప్పటానికి మాదిరికరమైన యౌవనులను ముందుగా ఏర్పరచుము. మరొక ప్రచారకుడు 5వ పేరాలో చెప్పబడిన అనుభవమును వివరించవచ్చును. ఈ విలువైన ప్రచురణను అందించుటలో వివేకమును చూపవలసిన అవసరతను నొక్కితెల్పుము.
15 నిమి: “ఆసక్తిని రేకెత్తించు పరిచయ ప్రసంగములు.” స్థానికంగా మీ ప్రాంతములో ఈ సూచనలను ఏలా ప్రయోగించవచ్చునో ప్రేక్షకులతో చర్చించుము. రెండు లేక మూడు వాస్తవికమైన, బాగుగా సిద్ధపరచబడిన ప్రదర్శనలను ఏర్పాటుచేయుము.
పాట 96 (72), ముగింపు ప్రార్థన.
అక్టోబరు 19తో ప్రారంభమగు వారము
పాట 79 (50)
10 నిమి: స్థానిక ప్రకటనలు. అకౌంట్స్ రిపోర్టు. విరాళములు ముట్టినట్లు తెల్పిన అభినందనలు తెలుపుము. స్థానిక సంఘము కొరకు అలాగే సొసైటి ప్రపంచవ్యాప్త పనికొరకు అందించిన ఆర్ధిక మద్దతుకై సంఘమును మెచ్చుకొనుము. సమయము అనుమతించే కొలది క్రియేషన్ పుస్తకమును అందించు విషయములో సంబంధముగా సిద్ధపరచబడియున్న అనుభవములను చెప్పుటకు ఆహ్వానించుము.
20 నిమి: “రక్త దుర్వినియోగము నుండి మీ పిల్లలను సంరక్షించండి” పేరాలు 1-11లపై పెద్దచే ప్రసంగము. పేరాలు 5-7లలో చెప్పబడిన పరిస్థితులందు, వైద్యుడు తమ బిడ్డకు చికిత్సచేయుటకు తల్లిదండ్రులు అంగీకరించే ముగింపు వెనుకనున్న తర్కమునుబట్టి, దానిని రాజీపడుచున్నట్లుగా ఎంచవలసిన అవసరము లేదనేదాన్ని స్పష్టము చేయుము.
15 నిమి: “తప్పక తిరిగి దర్శించండి.” ప్రశ్నా సమాధానముల చర్చ. పేరా 6లో వివరించబడిన సమాచారము ఆధారంగా బాగుగా సిద్ధపరచబడిన ప్రదర్శనను అందించుము. ముందటి నెలలో పరిచయమైన ఆసక్తిగల వ్యక్తులను దర్శించే అవసరమును నొక్కితెల్పండి.
పాట 10 (18), ముగింపు ప్రార్థన.
అక్టోబరు 26తో ప్రారంభమగు వారము
పాట 125 (44)
5 నిమి: స్థానిక ప్రకటనలు. క్లుప్తమైన స్థానిక ప్రాంతీయ సేవానుభవమును చెప్పుము లేక ఈ వారము ప్రాంతీయ సేవలో ఉపయోగించగల మాట్లాడదగు అంశాలను ప్రస్తావించుము.
15 నిమి: “రక్త దుర్వినియోగము నుండి మీ పిల్లలను సంరక్షించండి.” 12-28 పేరాలపై ప్రశ్నాసమాధానముల చర్చ. పేరాలు 12 మరియు 20లలోని ప్రశ్నల సమాధానముపై అవధానము కేంద్రీకరించుము. తమ బిడ్డకు వైద్య శ్రద్ధతీసికొనే విషయంలో ముందుగా సిద్ధపడియుండుట తరచు రక్తమార్పిడిని నిషేధించుటలో గొప్ప కీలకమైయుండగలదు.
15 నిమి: “చేరుకొని, అర్హులగులాగున పురుషులకు సహాయపడుట.” ప్రశ్నా సమాధానములు. స్థానిక సంఘాలలో బాధ్యతలను అంగీకరించేందుకు అర్హులనుగా చేసే ఆచరణాత్మకమైన మార్గాలను వెలికితీయుము.
10 నిమి: సంఘ కార్యక్రమమును పునఃసమీక్షించుట. సెప్టెంబరు ప్రారంభంలో సొసైటికి పంపిన కాంగ్రిగేషన్ ఎనాలసిస్ రిపోర్టు (S-10) నందలి మొదటి పేజీలోని సంఖ్యలను ఉపయోగిస్తూ సంఘాధ్యక్షుడు, మరియు సేవాధ్యక్షుడు గతసంవత్సరపు సంఘ కార్యక్రమమును చర్చిస్తారు. సేవలో వారి స్వయంత్యాగపూరితమైన ప్రయత్నాలకు, కూటములకు హాజరగుటలో వారు చూపు నమ్మకత్వానికి ప్రచారకులను, పయినీర్లను ఆప్యాయకరంగా మెచ్చుకొనుము. ఏ రంగాలలో అధికంగా చేశారో నిర్దిష్టంగా ప్రస్తావించుము. రిపోర్టులు ఫైల్లో ఉన్నట్లయిన గత సంవత్సరములలోని సేవాకార్యముతో పోల్చవచ్చును. 1993 సేవా సంవత్సరములో ఏయే రంగాలలో అభివృద్ధి సాధించవచ్చో సూచించుము.
పాట 43 (11), ముగింపు ప్రార్థన.
నవంబరు 2తో ప్రారంభమగు వారము
పాట 51 (24)
15 నిమి: స్థానిక ప్రకటనలు. దైవపరిపాలనా వార్తలు. ప్రాంతీయ సేవలో ఉపయోగించటానికి ఏయే పత్రికలు అందుబాటులో ఉన్నవో ప్రకటించి, వాటిలో నుండి స్థానికంగా ఇష్టకరంగా ఉండే ఒకటి లేక రెండు మాట్లాడు అంశములను సూచించుము. వెనుక పేజిలో శీర్షిక పైభాగాన సూచించబడినట్టి లేఖన సంబంధమైన పరిచయ ప్రసంగమును ఉపయోగిస్తూ తాజా పత్రికలను ఎలా అందించవచ్చునో ప్రదర్శించుము.
15 నిమి: “బాప్తిస్మము,” రీజనింగ్ పుస్తకము పేజీలు 54-8. “డెఫినిషన్” ను ఆధారంగా తీసుకొని ఉపోద్ఘాత ప్రసంగము. బాప్తిస్మము తీసుకోకుండ వెనుకకు పోతున్న వారితో ఒక పెద్ద ఎలా మాట్లాడవచ్చునో ప్రదర్శించుము. పేజి 54లోని సమాచారమును ఉన్నతపరచుము. సమర్పించుకొని బాప్తిస్మము ద్వారా దానిని సూచించవలసిన ప్రాముఖ్యతను నొక్కి తెల్పుము. పరిశుద్ధాత్మతో బాప్తిస్మము, మృతుల కొరకు బాప్తిస్మము, అగ్నితో బాప్తిస్మములపై గల సమాచారమును క్లుప్తముగా పరిశీలిస్తూ ప్రసంగీకుడు ముగించును.
15 నిమి: నవంబరు మాసములో పత్రికలను అందించుము. అవేక్! మరియు ది వాచ్‌టవర్‌యొక్క విలువను ఉన్నతపరచే క్లుప్తమైన ప్రసంగము. ప్రచారకులు చందాలు ఆహ్వానించేటప్పుడూ, ఇతరులు చదువుటకు సిఫారసు చేసేటప్పుడు ఉత్సాహముతో మాట్లాడుటకు ప్రచారకులు క్రొత్త సంచికలను వెనువెంటనే చదవాలి. ఒక ప్రచారకుడు పత్రికను అందించి, మరో సంచికతో పునర్దర్శనముచేసి పత్రికా మార్గమును ఎలా ప్రారంభించగలడో ప్రదర్శించుము.
పాట 48 (28), ముగింపు ప్రార్థన.