ప్రకటనలు
◼ సాహిత్య అందింపులు: సెప్టెంబరు: నిరంతరము జీవించుము పుస్తకము 40 రూ. (చిన్న సైజు 20 రూ.లు) అక్టోబరు: క్రియేషన్ పుస్తకము 40 రూ. (చిన్న సైజు రూ. 20) ఇవి అందుబాటులో లేనట్లయిన నిరంతరము జీవించుము లేక బైబిల్ స్టోరీస్ పుస్తకములను ఉపయోగించుము. నవంబరు: అవేక్! లేక/మరియు వాచ్‌టవర్ చందాలు. పక్షపత్రికలకు పూర్తి సంవత్సర చందా రూ. 60. ఆరునెలల చందా రూ. 30. నెలసరి పత్రికలకు పూర్తి సంవత్సర చందా రూ. 30. నెలసరి పత్రికలకు ఆరు నెలల చందా ఏర్పాటు లేదు. డిశంబరు: న్యూవరల్డ్ ట్రాన్స్‌లేషన్ బైబిలు మరియు ది బైబిల్—గాడ్స్‌వర్డ్ ఆర్ మ్యాన్స్? అను పుస్తకములు రూ. 60. (ప్రాంతీయ భాషలో సాహిత్య అందింపు: ప్రత్యేక ధరలో పాత సాహిత్యములు) జనవరి 1993: ది గ్రేటెస్ట్ మ్యాన్ పుస్తకము రూ. 40. అది అందుబాటులో లేనట్లయిన బైబిలు స్టోరీస్ పుస్తకము లేక నిరంతరము జీవించుము పుస్తకమును అందించుము.
◼ సంఘముతో సహవసించు ప్రతి ఒక్కరు, ది వాచ్‌టవర్ మరియు అవేక్! కొరకు తమ చందాలను పునఃప్రారంభించునప్పుడు, మాకు నేరుగా పంపించకుండ సంఘము ద్వారా పంపవలెను.
◼ సాహిత్యములను ఆర్డరు చేయునప్పుడును, సంఘముతో సహవసించువారు సంఘముద్వారా ఆర్డరుచేయవలెను. నిర్దిష్టమైన సాహిత్యములు కోరుకొనువారు, లిటరేచర్ సర్వెంట్‌కు వాటిని సూచించిన, ఆయన తదుపరి లిటరేచర్ ఆర్డరులో వాటిని ఆర్డరుచేయును.
◼ ప్రతి సంఘమునకు మూడు లిటరేచర్ ఇన్వెంటరీ ఫారంలు (S-18) పంపబడినవి. సెప్టెంబరు 1, 1992 లేక ఆపైన వెంటనే సంఘములోని లిటరేచర్ స్టాకులను ఖచ్చితముగా తీసుకొనవలెను. ఫారంలను పూర్తిగా నింపి, తప్పులేమి లేకుండునట్లు రెండు సార్లు పరిశీలించి అసలు ప్రతిని సెప్టెంబరు 6 లోగా సొసైటికి పంపండి. కార్బన్ కాపీని మీ ఫైల్‌లో ఉంచండి. మీరు పనిచేయటానికి రఫ్ షీట్‌గా మూడవ దానిని మేము పంపుతున్నాము.
◼ ఆగస్టు మాసము రిపోర్టులను తయారుచేసిన వెంటనే కాంగ్రిగేషన్ అనాలసిస్ రిపోర్టు ఫాంను (S-10) పూర్తిచేసి సెప్టెంబరు 6 లోగా సొసైటికి పంపవలెను. ఆగస్టు రిపోర్ట్సు ముట్టిన వెంటనే ఆ ఫారంనకు అవతలి ప్రక్క రెగ్యులర్ పయినీర్ ఇన్‌ఫర్‌మేషన్ రిపోర్టును సెక్రెటరీ పూర్తిచేయవలెను. ప్రతి సంఘమునకు ఇవి రెండు ఫారంలు పంపబడును. దయచేసి ఒర్జినల్‌ను సొసైటికి పంపి, కార్బన్ కాపీని మీ ఫైళ్లలో ఉంచండి.
◼ సంఘాధ్యక్షుడు (ప్రిసైడింగ్ ఓవర్‌సీర్), లేక ఆయనచే నియమింపబడిన మరొకరు సెప్టెంబరు 1, లేక ఆపై సాధ్యమైనంత త్వరలో సంఘ అకౌంట్స్‌ను ఆడిట్‌చేయవలెను.
◼ అప్పుడప్పుడు మేము ప్రత్యేక ధరలో అందించవలసిన పాత 192-పేజీల పుస్తకముల లిస్టును మన రాజ్య పరిచర్య లో చూపాము. కొన్ని మాసములలో వీటిని మేము అందించవలసిన సాహిత్యముల లిస్టులో సూచించి, వాటిని ప్రజలకు అందునట్లు చేయుటలో అవధానమివ్వండి అని సూచించడం జరిగింది. అయితే కొన్ని సార్లు వేరే పుస్తకములను సాహిత్య అందింపుగా సూచించినను, సహోదరులు ఇంటివారి ఆసక్తిని బట్టి ఈ పుస్తకములను అందించటం మంచిదని కనుగొన్నారు. అలాంటి సమయాల్లో కూడ ప్రత్యేక ధర లిస్టులో పేర్కొనబడినవాటిని ప్రత్యేక ధర క్రింద అందించ వచ్చును. లిటరేచర్ కౌంటర్స్, వీటిని సంవత్సరమంతటిలో ప్రత్యేక ధర క్రింద ఇచ్చును, కావున ప్రచారకులు, పయినీర్లు ప్రత్యేక చందా ధర క్రిందనే వీటిని అందించ వచ్చును. సంఘములు ఏ నెలలోనైనను ప్రత్యేక ధర పుస్తకములకు క్రెడిట్ అడుగ వచ్చును.
◼ లభ్యమగు క్రొత్త సాహిత్యములు:
ఉర్దు: వాట్ డు జెహోవాస్ విట్‌నెసెస్ బిలీవ్? (T-14)