దైవపరిపాలనా పాఠశాల పునఃసమీక్ష
జూన్ 29 నుండి అక్టోబరు 19, 1992 మధ్యవారములలో నిర్దేశించబడిన ప్రసంగముల సమాచారముపై ఆధారపడి, పుస్తకములను మూసివేసి చేయవలసిన పునఃసమీక్ష. అనుమతించిన సమయములోపల, మీరు వ్రాయగల్గినన్ని ప్రశ్నలకు సమాధానము వ్రాయుటకు వేరే పేపరును ఉపయోగించండి.
[గమనిక: వ్రాతపూర్వక పునఃసమీక్ష సమయములో ఏ ప్రశ్నలకు సమాధానమిచ్చుటకైనను కేవలము బైబిలును మాత్రమే ఉపయోగించవచ్చును. వాటి ప్రక్కలోవున్న రెఫరెన్సులు మాత్రము మీ వ్యక్తిగత పరిశోధనకైయున్నవి. ది వాచ్‌టవర్ రెఫరెన్సులున్న ప్రతిచోట పేజీ మరియు పేరాగ్రాఫ్ నెంబర్లు ఉండకపోవచ్చును.]
ఈ క్రింది వాక్యములు సత్యమో, అసత్యమో సమాధానమిమ్ము:
1. బహిరంగముగా చదువునప్పుడు, సరియైన స్థానములో ఆగుట, విషయమును నొక్కి తెల్పుటలో ఒక ప్రముఖ భాగము. [యస్‌జి పే. 30 పేరా 6]
2. సమాచారమును ఆతర్వాత మన స్వంత జీవితములోనేగాని, లేక ప్రాంతీయ పరిచర్యలోనేగాని అన్వయింపజేసుకొనుటకై, జ్ఞాపకముంచుకోవాలనే దృష్టితో మనము పఠించవలెను. [యస్‌జి పే. 36 పేరా 10]
3. ఎక్కువగా పదజాలమును పెంచుకొనుటలో మన ఉద్దేశ్యమేమనగా యెహోవాసాక్షులు చాలా తెలిసినవారు, సామర్ధ్యముగలవారు అని లోకప్రజలు గ్రహించునట్లు చేయుటకే. [యస్‌జి పే. 55 పేరా 7]
4. ద్వితీయోపదేశకాండముయొక్క వాస్తవికతకు బలమైన ఆధారము పురావస్తు శాస్త్రము. [యస్‌ఐ పే. 37 పేరా 8 (1983 ఎడి., పే. 37 పేరా 8)]
5. సంఖ్యాకాండము 35:16 లో “ఒకడు చచ్చునట్లు వానిని ఇనుప ఆయుధముతో కొట్టువాడు” అని చెప్పుచున్నప్పుడు, ఆయుధమును బుద్ధిపూర్వకంగా వాడుట అని దాని భావము. [వారపు బైబిలు పఠనము; అవేక్ 78 12/22 పే. 27 చూడుము.]
6. ద్వితీయోపదేశకాండము 1:17 నందలి “ఘనుడు” తనకున్న సంపదనుబట్టి, విద్యాస్థాయినిబట్టి, సాధించిన గొప్పకార్యములనుబట్టి గొప్పగా కనబడువాడు. [వారపు బైబిలు పఠనము; డబ్ల్యు 77 పే. 148 చూడుము.]
7. ద్వితీయోపదేశకాండము 19:21 ప్రకారము బుద్ధిపూర్వకంగా నరహత్యచేయువానికి మరణశిక్ష దేవుని ధర్మశాస్త్రములో ఒక భాగమని మనం నిర్ణయించుకోవాలి. [వారపు బైబిలు పఠనము; అవేక్ 74 7/22 పే. 28 చూడుము.]
8. ద్వితీయోపదేశకాండము 29:29 లో చెప్పబడిన “బయలు పరచబడినవి” అనువాటిలో బైబిలులో లిఖితమైయున్న సమాచారమంతా ఇమిడి ఉన్నది. [వారపు బైబిలు పఠనము; డబ్ల్యు 87 5/15 పే. 31 చూడుము.]
9. ‘యాకోబునకు దేవుని న్యాయవిధులను ఇశ్రాయేలునకు దేవుని ధర్మశాస్త్రమును బోధించు’ ఏర్పాటును యెహోవా యూదా గోత్రమునకు అప్పగించెను. (ద్వితీ. 33:10) [వారపు బైబిలు పఠనము; కా89 11/1, పే. 10 పేరా 7 చూడుము.]
10. గిబియోనీయులు, శేషమునకు రాబోవు ఛాయగా ఉన్నారు. (యెహోషు. 10:1-11) [వారపు బైబిలు పఠనము; డబ్ల్యు86 12/15 పే. 22 పేరా 8 చూడుము.]
ఈ క్రింది ప్రశ్నలకు సమాధానమిమ్ము:
11. సంపూర్తిగా వ్రాయబడియున్న ప్రసంగమును (మ్యాన్‌స్క్రిప్ట్ టాక్) ఇచ్చునప్పుడు అధిగమించవలసిన ప్రధాన సమస్య ఏమిటి? [యస్‌జి పే. 31 పేరా 9]
12. ఒక ప్రసంగముయొక్క ముఖ్యాంశమును ఎలా నిర్ణయించవచ్చును? [యస్‌జి పే. 44 పేరా 2]
13. ద్వితీయోపదేశకాండము అనే పేరుకు అర్థమేమి, అది దేనిని ఉద్బోధించినది. [యస్‌ఐ పే. 36 పేరా 4 (పే. 36 పేరా 4)]
14. ద్వితీయోపదేశకాండము 33:8 నందలి ఊరీము మరియు తుమ్మీముల ఉద్దేశ్యమేమి? [వారపు బైబిలు పఠనము; డబ్ల్యు86 1/15 పే. 8 చూడుము.]
15. ఇశ్రాయేలీయులకు దేవుని ధర్మశాస్త్రము “వారి కన్నుల నడుమ బాసికమువలె” ఎట్లు ఉండేది? (ద్వితీ. 6:8) [వారపు బైబిలు పఠనము; డబ్ల్యు73 పే. 192. చూడుము.]
16. యెహోవా వాక్కులు మనలను ఎట్లు పోషించగలవు? (ద్వితీ. 8:2, 3) [వారపు బైబిలు పఠనము; కా86 1/1 పే. 14 పేరా 15 చూడుము.]
17. ద్వితీయోపదేశకాండము 22:28, 29లో ప్రధానము చేయబడని కన్యకతో ఒక ఇశ్రాయేలీయుడు శయనించినయెడల, ఎందుకతడు ఆమెను వివాహముచేసికొని ఆమెను ఎన్నటికిని విడనాడకూడదు అని దేవుని ధర్మశాస్త్రము చెప్పినది? [వారపు బైబిలు పఠనము; డబ్ల్యు89 11/15 పే. 31 చూడుము.]
18. ఇశ్రాయేలీయులను ఇతరులందరు యేకమై కలిసికట్టుగా ఎదుర్కొనుటను పరిశీలించుటలో, నేడు మనము ఏ సారూప్యమైన పరిస్థితిని చూచెదము? (యెహోషు. 9:1, 2) [వారపు బైబిలు పఠనము; డబ్ల్యు86 12/15 పే. 22 పేరా 5 చూడుము.]
19. యెహోషువ 10:13 నందు గ్రహముల కదలికకు సంబంధించిన విజ్ఞాన శాస్త్రపరమైన విషయమును చెప్పుటకు బదులు, యెహోషువ ఇచ్చట ఏమిచెప్పుటకు ఉద్దేశించుచున్నాడు? [వారపు బైబిలు పఠనము; డబ్ల్యు81 10/1 పే. 5 చూడుము.]
20. ప్రసంగంలోని ప్రారంభపు వాక్యాలు ఏ రెండు ఉద్దేశ్యములను నెరవేర్చాలి? [యస్‌జి పే. 46 పేరా 9]
ఈ క్రింది వాక్యములను పూరించుటకు అవసరమైన పదములను లేక మాటలను చేర్చండి:
21. మీరు బైబిలు చదవడం ముగించిన తర్వాత, దానిలోని అంశాలు స్పష్టంకానప్పుడు కొంత సమయం తీసికొని _____________________ చేయడం మంచిది. [యస్‌జి పే. 35 పేరా 7]
22. ప్రసంగమును సిద్ధపడునప్పుడు మీ _____________________ నిజముగా దోహదపడని అంశములను విడిచిపెట్టవలెను. [యస్‌జి పే. 41 పేరా 10]
23. దైవపరిపాలనా పరిచర్య పాఠశాలలో ఇవ్వబడు ప్రతి నియమిత ప్రసంగాన్ని బాగా సిద్ధపడుటద్వారా యెహోవాదయ చేసిన ఈ విద్యా కార్యక్రమమువలన మనము బాగా _____________________. [యస్‌జి పే. 43 పేరా 18]
24. “ఆత్మను తాకట్టు పట్టుట” (NW ప్రకారం) అనగా ఒకని _____________________ తాకట్టు పట్టుటే. (ద్వితీ. 24:6) [వారపు బైబిలు పఠనము; కా84 9/1 పే. 8]
25. సంఖ్యాకాండము 35:20, 21 లో బైబిలు _____________________ నిర్వచనాన్ని ఇస్తుంది. [వారపు బైబిలు పఠనము; అవేక్ 74 5/8 పే. 27.]
ఈ క్రింది వాక్యములనుండి సరియైన సమాధానములను ఎంపిక చేయండి:
26. ఇంటివారిని ప్రశ్నలడుగుట మంచిది, ఎందుకనగా అది వారిని (ఎక్కువ వినేందుకు ఇష్టపడునట్లు చేస్తుంది; సమాధానము వారికి తెలియదని వారు గ్రహించుకొనేలాగున చేస్తుంది; అబద్ధమతము వారికి సరిగా బోధించలేదని వారు గుణగ్రహించేలా చేస్తుంది). [యస్‌జి పే. 52 పేరా 12]
27. ఇత్తడి సర్పము భవిష్యత్తులోని (సాతాను; రాజైన దావీదు; యేసు)ను సూచించినది. (సంఖ్యా. 21:8, 9) [యస్‌ఐ పే. 35 పేరా 34 (పే. 35 పేరా 34)]
28. యేసే క్రీస్తు, మోషేకంటె గొప్ప ప్రవక్త అని తన వాదనను బలపరచుటకు పేతురు (లేవీయకాండము; సంఖ్యాకాండము; ద్వితీయోపదేశకాండము) నుండి ఎత్తిచూపుతున్నాడు. [యస్‌ఐ పే. 40 పేరా 31 (పే. 40 పేరా 31)]
29. యెహోషువ పుస్తకము సా.శ.పూ. (1513-1473; 1473-c. 1450; 1473-c. 1100) మధ్య కాలాన్ని గూర్చి వివరించు చున్నది. [యస్‌ఐ పే. 42 పేరా 5 (పే. 43 పేరా. 5)]
30. “చక్కగా ప్రవర్తించుట” అనగా (సంపాదించుకొన్న ఐగుప్తు జ్ఞానమంతటి ప్రకారము; వివేకముతో; జాగరూకతో) ప్రవర్తించుట అని భావము. (యెహోషువ 1:8) [వారపు బైబిలు పఠనము; కా90 7/1 పే. 24 చూడుము.]
ఈ క్రింద చూపబడిన వాక్యములకు సరైన లేఖనములను జతపర్చుము: సంఖ్యా. 21:5, 6; 23:23; 32:23; ద్వితీ. 12:24; మత్త. 28:19, 20
31. ఈ ఉపదేశముల దృష్టా, ప్రతి క్రైస్తవుడు తన బోధనా సామర్ధ్యమును అభివృద్ధిచేసికొనవలసిన అవసరమున్నది. [యస్‌జి పే. 49 పేరా 2]
32. సణుగుటకు వ్యతిరేకముగా హెచ్చరిస్తూ, పౌలు ఈ లేఖనమును సూచించెను. [యస్‌ఐ పే. 35 పేరా 36 (పే. 35 పేరా 36)]
33. ఈ నిషేధాన్నిబట్టి, యెహోవాసాక్షులు తమ స్వంత రక్తమును నిలువచేసి ఆ తర్వాత దాన్ని తమకే తిరిగి ఎక్కించుకొనే పద్ధతిని అనుమతించరు. [వారపు బైబిలు పఠనము; డబ్ల్యు89 3/1 పే. 30 చూడుము.]
34. ఇచ్చట ఇవ్వబడిన సూత్రము గలతీయులు 6:7లో “మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయునను” దానిని పోలినది. [3, వారపు బైబిలు పఠనము; డబ్ల్యు72 పే. 392 చూడుము.]
35. చేతబడికి సంబంధించిన దేనినైనను తిరస్కరించినట్లయితే, దాన్నిబట్టి ఏమైన కలుగుతుందని చేతబడికి లేక మంత్రానికి యెహోవాసాక్షులు భయపడరు. ఇలాంటి వాటినుపయోగించి వశపరచుకొనుట లేక అట్టి భూతవైద్యుల ద్వారా తయారుచేయబడిన “మందులను” కూడా తిరస్కరించుటకు వారు భయపడరు. [వారపు బైబిలు పఠనము; అవేక్70 8/22 పే. 7]