కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 3/92 పేజీ 2
  • మార్చి కొరకు సేవా కూటములు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • మార్చి కొరకు సేవా కూటములు
  • మన రాజ్య పరిచర్య—1992
  • ఉపశీర్షికలు
  • మార్చి 9తో ప్రారంభమగు వారము
  • మార్చి 16తో ప్రారంభమగు వారము
  • మార్చి 23తో ప్రారంభమగు వారము
  • మార్చి 30తో ప్రారంభమగు వారము
మన రాజ్య పరిచర్య—1992
km 3/92 పేజీ 2

మార్చి కొరకు సేవా కూటములు

మార్చి 9తో ప్రారంభమగు వారము

పాట 63 (32)

10 నిము: స్థానిక ప్రకటనలు, మన రాజ్య పరిచర్య నుండి ఎన్నుకొనబడిన ప్రకటనలు. తాజా పత్రికలనుండి పత్రికా అందింపులను ప్రదర్శించుము. వారాంతములో గ్రూప్‌గా సేవచేయుటకు ప్రోత్సహించుము.

20 నిము: “మార్చి కొరకు మీ అందింపు ప్రసంగములను సిద్ధపడుము.” (10 నిము.) ప్రశ్నా సమాధానములు. (8 నిము.) రెండు లేక మూడు సూచించబడిన అందింపులనుండి ఆయాప్రాంతమునకు సరిపడు, బాగా సిద్ధపడిన ప్రదర్శనలు. (2 నిము.) సూచించబడిన అందింపులలో ఒకటి లేక ఎక్కువవాటిని నేర్చుకొని, ఉపయోగించమని అందరిని ప్రోత్సహించుము.

15 నిము: “ఆదాము హవ్వ,” రీజనింగ్‌ పుస్తకము, పేజీలు 27-9. (5 నిము.) “ఆదాము హవ్వలు ఊహాకల్పితమైన వ్యక్తులా?” అను ఉపశీర్షిక క్రింద ఉన్న సమాచారముపై ఆధారపడి ఉపోద్ఘాత ప్రసంగము. (6 నిము.) “ఆదాము చేసిన పాపము దేవుని చిత్తమా, దేవుని పథకమా?” అని ప్రశ్నవేసి వచ్చిన వ్యక్తియొద్దకు తిరిగివెళ్లి, పునర్దర్శనముచేయు ప్రదర్శన. (4 నిము.) రీజనింగ్‌ పుస్తకములో “ఎవరైన ఇలా అన్నప్పుడు—” అను శీర్షికల భాగమును పునర్దర్శనములలో చర్చకు అంశములుగా ఉపయోగించమని ప్రోత్సహించుము. ఇతర ఉదాహరణలను కూడ పేర్కొనుము.

పాట 30 (117), ముగింపు ప్రార్థన.

మార్చి 16తో ప్రారంభమగు వారము

పాట 215 (34)

10 నిము: వారపు సేవా ఏర్పాట్లను కలుపుతూ, స్థానిక ప్రకటనలు. ఈ వారములో, ఈ నెలలో పునర్దర్శనములను చేయుటకు అదనముగా కృషిచేయమని ప్రోత్సహించుము. ఈ సేవా కూటము, ఆసక్తిగలవారితో తిరిగికలిసినప్పుడు ఉపయోగించుటకు సూచించబడిన నాలుగు అభ్యాసయోగ్యమైన అందింపులను వివరించి, చూపును. ఒకటి లేక ఎక్కువ అందింపులను ఈ వారములో ఉపయోగించుటకు ఎన్నుకొనుము.

20 నిము: “నీవు తిరిగివెళ్లినప్పుడు సంభాషణను ప్రారంభించుట.” (3 నిము.) 1, 2 పేరాగ్రాఫ్‌లలోని అంశములను వివరించు ఉపోద్ఘాత ప్రసంగము. (15 నిము.) పేరాగ్రాఫ్‌లు 3-5లోగల మూడు అందింపులనుగూర్చి బాగా సిద్ధపడిన ప్రదర్శనలు. సమయము అనుమతించుకొలది, ప్రతి ప్రదర్శన తర్వాత, ఈ ప్రదర్శనల అభ్యాసయుక్తమైన విలువను వ్యాఖ్యానించవచ్చును. (2 నిము.) పేరాగ్రాఫ్‌ 6లోని తలంపులను బయల్పరచుచూ, సూచించబడిన అందింపులలో ఒక్కదానినైనా, ఆసక్తిని చూపినవారితో సంభాషణను ప్రారంభించుటకు సిద్ధపడి, ఉపయోగించమని అందరిని ప్రోత్సహించుము.

15 నిము: “నీవు సహాయపయినీరుగా చేయగలవా?” గతములో సహాయపయినీర్లుగాచేసి, ఏప్రిల్‌, మే నెలలలో మరలా దానిలో ప్రవేశించుటకు పథకము వేసికొను ప్రచారకులు మరియు పెద్దచే చర్చ. శీర్షికలోని అంశములను వివరించునప్పుడు, ప్రచారకులు వారు ఎందుకు సహాయ పయినీర్లుగా చేయకోరుతున్నారో వివరిస్తారు. వారు అనుభవించిన ఆశీర్వాదములను, గంటలను చేరుకొనుటకు వారు చేసికొనవలసివచ్చిన సర్దుబాట్లను వివరించుదురు. చర్చ, సహాయపయినీర్లుగా చేయుటలోని ఆనందములను నొక్కితెలిపి, వారి వ్యక్తిగత పరిస్థితులు అనుమతించినట్లయిన ఈ సేవా ఆధిక్యతను పరిశీలించమని అందరిని ప్రోత్సహించుము.

పాట 114 (61), ముగింపు ప్రార్థన.

మార్చి 23తో ప్రారంభమగు వారము

పాట 211 (105)

10 నిము: స్థానిక ప్రకటనలు, అకౌంట్స్‌ రిపోర్టు, పంపిన విరాళమునుగూర్చి సొసైటి వ్యక్తపరచిన అభినందనలు. రాజ్యాసక్తులకొరకై వారి ఆర్ధిక మద్దతునకు సహోదరులను మెచ్చుకొనుము. ఈ వారాంతములో ప్రాంతీయ సేవలో పాల్గొనమని సహోదరులను ప్రోత్సహించుము.

20 నిము: “నిశ్చయముగా తిరిగివెళ్లి మాట్లాడుము.” ప్రశ్నా సమాధానములు, ప్రదర్శనలు. పేరాగ్రాఫ్‌ 5ను పరిశీలించిన తర్వాత కరపత్రమును విడిచివచ్చిన వ్యక్తి యొద్దకు వెళ్లిచేయు పునర్దర్శనమును ప్రదర్శించుము. చర్చ లివ్‌ ఫరెవర్‌ పుస్తకముద్వారా బైబిలు పఠనమునకు నడిపించును. ప్రదర్శన అయిపోయిన తర్వాత, మొదటిసారి దర్శించినప్పుడు సాహిత్యమును తీసికొనని వ్యక్తిని పునర్దర్శించునట్లు ప్రచారకుడు ఎందుకు తీర్మానించుకొన్నాడో అడుగుము.

15 నిము: “మీ కుటుంబ జీవితములో దేవునికి ప్రథమస్థానమివ్వుము.” ది వాచ్‌టవర్‌ మే 15, 1991, పేజీలు 4-7పై ఆధారపడిన ప్రసంగము. (ప్రాంతీయ భాషలో: “యేసుయొక్క దైవభక్తి మాదిరిని అనుసరించుము.” కావలికోట జూలై 1, 1990.)

పాట 133 (68), ముగింపు ప్రార్థన.

మార్చి 30తో ప్రారంభమగు వారము

పాట 115 (36)

10 నిము: వారపు సేవా ఏర్పాట్లను కలిపి, స్థానిక ప్రకటనలు. దైవపరిపాలనా వార్తలు.

15 నిము: “పయినీర్లకు మద్దతు చూపుట.” ప్రశ్నా సమాధానములు, ఇంటర్వూ. పయినీర్లకు అవసరమైన మద్దతునిచ్చినప్పుడు, సంఘము పొందిన ఆశీర్వాదములను నొక్కి తెలుపుము. పయినీర్లను ఇంటర్వూచేసి, వారు తమ పయినీరు పరిచర్యలో పెద్దలు మరియు సంఘములోని ఇతరులవలన ఎట్లు సహాయము పొందారో ఉన్నతపరచునట్లు చేయుము.

20 నిము: “క్రైస్తవ యౌవనులారా—విశ్వాసమందు స్థిరముగా ఉండుడి.” ది వాచ్‌టవర్‌ జూలై 15, 1991 పేజీలు 23-26లోగల శీర్షికపై ఆధారపడిన కుటుంబ చర్చ. భార్య, పిల్లలు కలసియున్న చర్చలో తండ్రి నాయకత్వము తీసికొనును. పాఠశాలలో అనేక రకములైన విశ్వాసపు పరీక్షలు ఎదుర్కొన్నప్పుడు యౌవనులు విజయవంతముగా జయించగల మార్గములను ప్రత్యేకించి చూపుము. (ప్రాంతీయ భాషలో: “సువార్తను గూర్చి సిగ్గుపడకుండ ఉండుట.” కావలికోట జూన్‌ 1, 1990.)

పాట 43 (103), ముగింపు ప్రార్థన.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి