ప్రశ్నాభాగము
• తాము నివసిస్తున్న ప్రాంతమును కలిగియున్న సంఘముతోనే ప్రచారకులు సేవచేయవలెనని ఎందుకు సిఫారసు చేయబడినది?
విషయములను క్రమముగాను, దైవిక విధానమందును చేపట్టుట ప్రాముఖ్యమైయున్నది. అపొస్తలుడైన పౌలు ఇలా వ్రాసెను: “దేవుడు సమాధానమునకే కర్తగాని అల్లరికి కర్తకాడు. . . . సమస్తమును మర్యాదగాను, క్రమముగాను జరుగనియ్యుడి.”—1 కొరిం. 14:33, 40.
ప్రయాణ సౌకర్యయిబ్బందులు, లౌకిక వృత్తి సమయములు, లేదా పర్యవేక్షణ సహాయము అవసరమున్నందున కొన్ని మినహాయింపులున్నను సాధారణంగా మనము ఏ ప్రాంతమందు నివసిస్తున్నామో ఆ ప్రాంతమందలి సంఘమునకే హాజరగుట మంచిది. ప్రాంతీయ సేవకు అది మరింత అనువుగా ఉంటుంది. మన ప్రాంతము వెలుపట గుంపుతో కలిసి పనిచేయుటకు ఎక్కువ దూరము ప్రయాణించవలసిన పని ఉండదు. అది మన సంఘములోని ఇతరులతో కలిసి బహుగా పనిచేయునట్లు చేయగలదు. మరియు క్రొత్తగా ఆసక్తిని చూపువారికి మరింత అనువుగా ఉండు కూటములకు నడిపించ వీలగును. అవసరతలో ఉన్నప్పుడు సహాయపడు వీలగులాగున మన ప్రాంతమందలి ఇతర సహోదర సహోదరీలతో సన్నిహిత సంబంధమును కలిగియుండునట్లు చేయగలదు.
స్వేచ్ఛాస్వభావమును మనము విడనాడవలెను. చేయబడిన ఏర్పాట్లకు లోబడి, రాజ్యాసక్తిని ముందుంచవలెను. (లూకా 16:10) క్రొత్త సంఘము ఏర్పడినట్లయిన లేక సంఘ పుస్తకపఠనములను విభజించినట్లయిన కొంతమంది స్నేహితులతోనే ఉండిపోవుటకు మనము ఎంచుకొనవచ్చును. కాని క్రొత్త ఏర్పాటును అంగీకరించుట ద్వారా మనము క్రొత్తగా స్నేహితులను చేసికొని, మన దైవపాలనా సహవాసము విస్తృత పరచుకొనవచ్చును. అంతేకాదు, ప్రచారకులు తాము సహవసిస్తున్న సంఘప్రాంతమందు నివసిస్తున్నట్లయితే, పెద్దలు మందను కాయుట, మరియు సంఘముయొక్క ఆత్మీయ స్థితిని వృద్ధిచేయుట సులభమగును.