శిష్యులను చేయుటకు మనకు సహాయపడు కూటములు
జూన్ 10తో ఆరంభమగు వారము
పాట 63 (32)
10 ని: స్థానిక ప్రకటనలు. మరియు మన రాజ్య పరిచర్య నుండి తగిన ప్రకటనలు. ప్రాంతీయాసేవా ఏర్పాట్లను సూచించుము. అంతవరకు స్వీకరించిన పత్రిక చందాలనుగూర్చి ఒకటిలేదా రెండు అనుభవములను పంచుకొనుము.
25 ని: “మనుష్యులను అంధకారమునుండి వెలుగునకు మరల్చుము.” ప్రశ్నాసమాధానముల చర్చ. 6వ పేరాలో, తమకుగాని తమ కుటుంబమునకుగాని ది వాచ్‌టవర్ ఎట్లు ప్రయోజనమిచ్చినదో ప్రేక్షకులనుండి కనీసం ఇద్దరి వ్యక్తిగత అనుభవములను ఆహ్వానించుము.
10 ని: ప్రశ్నా భాగము. ప్రశ్నాసమాధానముల చర్చ. దైవిక సిఫారసులను అనుసరించుటవలన కలుగు దీవెనలను వక్కాణించుము.
పాట 192 (10) మరియు ముగింపు ప్రార్థన.
జూన్ 17తో ఆరంభమగు వారము
పాట 221 (73)
10 ని: స్థానిక ప్రకటనలు. అక్కౌంట్స్ రిపోర్టు. చందా ముట్టినట్లు తెలియజేసినవాటిని చేర్చుము. స్థానికంగాను, ప్రపంచవ్యాప్తంగాను రాజ్యాసక్తుల విషయములో ఆర్థిక సహాయమును అందించినందుకు సంఘమును మెచ్చుకొనుము.
20 ని: “సువార్తను అందించుట—సాయంకాలవేళలలో.” ప్రశ్నాసమాధానముల పరిశీలన. సాయంకాల సాక్ష్యమునుగూర్చి సంఘయేర్పాట్లను పేర్కొనుము. సాయంకాల వేళలలో సాక్ష్యమిచ్చు విలువను ఉన్నతపరచుటకు స్థానిక అనుభవమును వాడవచ్చును.
15 ని: “డుయు హేట్ టు రిసీవ్ క్రిటిసిజమ్?” అవేక్! ఫిబ్రవరి 8, 1991పై ఆధారపడిన ప్రసంగము. విమర్శను మధురముగా చేసికొను ఆరు మార్గములను ప్రసంగీకుడు స్పష్టంగా పేర్కొనవలెను. (ప్రాంతీయ భాషలో: “కావలికోట మార్చి 1, 1991 నుండి, “దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేయుట.”)
పాట 65 (36) మరియు ముగింపు ప్రార్థన.
జూన్ 24తో ఆరంభమగు వారము
పాట 181 (10)
10 ని: స్థానిక ప్రకటనలు. ఇటీవల పత్రికలలోనుండి ఒకటి లేదా రెండు మాట్లాడదగు అంశములను ఉన్నతపరచుము.
17 ని: “ప్రాంతీయసేవలో ఉన్నప్పుడు ఇతరులకు సహాయపడుట.” కొంత ప్రేక్షకుల భాగము వహింపుతో ప్రసంగము. ప్రాంతీయసేవలో ఇతరులతో కలిసిపని చేయుట వలన కలుగు వ్యక్తిగత ప్రయోజనములను వివరించు మాదిరికరమైన ప్రచారకునితో క్లుప్త పరిచయము.
18 ని: “వై ఫియర్ గాడ్, నాట్ మెన్?” ది వాచ్‌టవర్ జూన్ 1, 1989పై ఆధారపడిన ప్రసంగము. (ప్రాంతీయ భాషలో: సెప్టెంబరు 1, 1990.) స్థానికంగా తలయెత్తు పరిస్థితులకు అన్వయించుము.
పాట 115 (36) మరియు ముగింపు ప్రార్థన.
జూలై 1తో ఆరంభమగు వారము
పాట 170 (95)
10 ని: స్థానిక ప్రకటనలు. దైవపరిపాలనా వార్తలు. జూలై అందింపును పునఃసమీక్షించుము. “దేవుని అన్వేషించుటకు ఇదియే సమయము” అను క్రొత్త సంభాషణ అంశముతో దానిని ఎలా ముడిపెట్టవచ్చును. దానికి సూచింపబడిన లేఖనములు యెషయా 55:6, 7 (నిజమైన దేవుని కనుగొనవచ్చును) మరియు అపొ. కార్యములు 17:26, 27 (మనుష్యుడు ఇప్పుడే దేవుని తప్పక అన్వేషించవలెను.)
20 ని: “ప్రాంతీయసేవలో బైబిలును ఉపయోగించుము.” ప్రశ్నాసమాధానముల చర్చ. 6వ పేరా సంబంధముగా, జూలై అందింపుతో క్లుప్త ప్రదర్శన. క్రొత్త సంభాషణ అంశమునుండి ఏదో ఒక లేఖనమును ఉపయోగించుము.
15 ని: “కుటుంబమునకు ఇండెక్స్ ఎట్లు ప్రయోజనము నివ్వగలదు.” సమాచారమును ప్రశ్నాసమాధానములతో పరిశీలించుట. 2వ పేరాను చర్చించునప్పుడు, “వివాహము” అను ముఖ్య శీర్షిక క్రింద ఆసక్తిని కలిగించు వివిధ ఉపశీర్షికలను పేర్కొనుచు ఇండెక్స్‌ను ఉపయోగించుటను వివాహ దంపతులను ప్రదర్శించనీయము.
పాట 151 (25) మరియు ముగింపు ప్రార్థన.