శిష్యులను చేయుటకు మనకు సహాయపడు కూటములు
ఫిబ్రవరి 4తో ఆరంభమగు వారము
పాట 18 (108)
10 ని: స్థానిక ప్రకటనలు మరియు మన రాజ్య పరిచర్య నుండి ఎంపిక చేయబడిన ప్రకటనలు. ఫిబ్రవరి అందింపును ఉన్నతపరచుము. స్థానికముగా అందుబాటులోయున్న పాత ప్రచురణల పేర్లను తెల్పుము. ప్రస్తుత సంభాషణ అంశముతో ఉపయోగించగల ఉపోద్ఘాతములను పరిశీలించుము.
20 ని: “అలయ వద్దు.” శీర్షికలోని ముఖ్యాంశముల చర్చ. పేరాగ్రాఫ్ 3ను చర్చించునప్పుడు ప్రేక్షకులనుండి సలహాలను ఉపయోగించుచు అర్హుడైన ప్రచారకుడు అందింపును ప్రదర్శించునట్లు చూడుము. ఎదురయ్యే ఉదాసీనత, లేక వ్యతిరేకతనుబట్టి నిరుత్సాహము లేక అలసిపోవుట జరుగకుండ ప్రాంతీయపరిచర్యలో పనిరద్దీగా యుండునట్లు సంఘమును ప్రోత్సహించుము.
15 ని: “మిమ్మును మీరు అవిశ్వాసులతో జోడుగా చేసికొనకుడి.” ది వాచ్‌టవర్, నవంబరు 1, 1989. (ప్రాంతీయ భాషలో: ది వాచ్‌టవర్, జూన్ 1, 1990.) ప్రేక్షకులు పాల్గొనుటతో కూడిన ప్రసంగము.
పాట 147 (38) మరియు ముగింపు ప్రార్థన.
ఫిబ్రవరి 11తో ఆరంభమగు వారము
పాట 30 (117)
10 ని: స్థానిక ప్రకటనలు. ఈ వారములో ఉపయోగించబడబోవు పత్రికలనుండి క్లుప్తముగా మాట్లాడదగు అంశములను ప్రస్తావించుము. అందుబాటులో ఉన్నట్లయిన ప్రతి ఒక్కరు లైఫ్ ఇన్ ఎ పీస్‌పుల్ న్యూ వరల్డ్ కరపత్రమును వచ్చేవారము సేవా కూటమునకు తేవలయును.
20 ని: మనమెట్లు బలముగా ఉండగలము? బలముగా ఉంటూ అలసిపోకుండుటయొక్క అవసరతను ఉన్నత ఇంటర్వ్యూలు. (1) అనేక సంవత్సరములనుండి సేవచేయుచు మంచి మాదిరులుగా ఉన్న ఇద్దరు లేక ముగ్గురితో ఇంటర్వ్యూ చేయుము. ప్రకటించు పనిని నిలుపుచేయుటకు వారి ఏ వత్తిడులను అనుభవించారు మరియు ఎట్లు అధికమించారు? అలసిపోకుండ ముందుకు వెళ్లుటకు వారికి ఏమి సహాయపడింది? (ప్రార్థన, క్రమముగా కూటములకు హాజరగుట, వ్యక్తిగత పఠనము, ఇతరులనుండి ప్రోత్సాహము మొదలగువాటిని చెప్పవచ్చును.) వదలివేయుట లేక నెమ్మదిగా తగ్గిపోవుటనుండి కాపాడుకొనుటకు వారు ఏమి చేశారు? (కూటములకు క్రమముగా హాజరగు ప్రాముఖ్యతను, వ్యక్తిగత పఠనమును నిలుపుకొనుటను, యెహోవాతో గల సంబంధమును మెచ్చుకొనుట యొక్క ప్రాముఖ్యతను చెప్పవచ్చును.) ఆత్మీయ సమతూకమును వారు ఎట్లు నిలబెట్టుకొన్నారు? (పెద్దలు లేక ఇతరుల యొక్క సహాయము, ఆత్మీయ శ్రద్ధలను జీవితములో ముందు పెట్టుట, యెహోవాకు ప్రార్థన చేయుట మొదలగువాటిని చెప్పవచ్చును.) (2) క్రమమైన ప్రచారకులు మరియు మంచి ఉదాహరణలుగా ఉన్న కొంతమంది పిల్లలను ఇంటర్వ్యూచేయుము. సేవలో క్రమముగా ఉండుటకు వారికి సహాయపడినదేమి? తల్లిదండ్రులు వారికెట్లు సహాయపడ్డారు? ప్రాంతీయసేవలో ఇతర ప్రచారకులు సహాయము చేస్తూ వారిని ప్రోత్సహిస్తారా? యెహోవా సేవలో వారి గురులేమి? ఇంటర్వ్యూలలో చెప్పబడిన అంశములను క్లుప్తముగా పునఃసమీక్షిస్తూ ముగించుము.
15 ని: “బంగారు సూత్రము—ఎందుకు ఇంకా విలువైయున్నది?” ది వాచ్‌టవర్ నవంబరు 1, 1989. (ప్రాంతీయభాష: ది వాచ్‌టవర్ జనవరి 1, 1991) ప్రేక్షకులతో భాగము వహిస్తు ప్రసంగము.
పాట 10 (88) మరియు ముగింపు ప్రార్థన.
ఫిబ్రవరి 18తో ఆరంభమగు వారము
పాట 121 (95)
10 ని: స్థానిక ప్రకటనలు. అకౌంట్సు రిపోర్టు మరియు చందాలు ముట్టినట్లు తెలిపినవి. ప్రపంచవ్యాప్త పని నిమిత్తమైన మద్దతుకై సంఘమును మెచ్చుకొనుము. “వాచ్‌టవర్ చందా ప్రత్యేక కార్యమునకు సిద్ధపడియుండుము”లోని సమాచారమునకు అవధానమును మళ్లించుము. అవసరమైన అదనపు పత్రికలను కోరమని ప్రచారకులను ప్రోత్సహించుము. వచ్చేవారము సేవా కూటమునకు ప్రచారకులు వాచ్‌టవర్ పబ్లికేషన్స్ ఇండెక్సె 1986-1989ని తెచ్చుకొనుటకు ఇష్టపడవచ్చును.
20 ని: “సువార్తనందించుట—కరపత్రములతో” ప్రశ్నాసమాధానముల చర్చ. లేఖనములను చదివించుము. పేరాగ్రాఫ్ 7ను చర్చించిన తరువాత పయినీరు లేక సామర్థ్యముగల ప్రచారకుడు పునర్దర్శనమందు లైఫ్ ఇన్ ఎ పీస్‌పుల్ న్యూ వరల్డ్ అను కరపత్రమును ఉపయోగిస్తూ పఠనమును ప్రారంభించుటను ప్రదర్శించనిమ్ము. పునర్దర్శనములందు, ప్రత్యేకముగా మొదటిసారి కలిసిన తరువాత ఇంటివారిని మరలా కలియుట కష్టతరముగా యున్న సందర్భములో ఈ విధమైన పద్ధతిలో సమీపించుటను ప్రోత్సహించుము. ఈ విధముగా సమీపించుట ద్వారా వారు కల్గియున్న విజయమునుగూర్చి సిద్ధపడియున్న ప్రచారకులను వ్యాఖ్యానించనిమ్ము.
15 ని: “నిజమైన సౌందర్యమును నీవు వృద్ధిచేసికొనవచ్చును.” సేవా కాపరిచే ప్రసంగము. ది వాచ్‌టవర్ ఫిబ్రవరి 1, 1989. (ప్రాంతీయభాష: ది వాచ్‌టవర్ జూన్ 1, 1990.)
పాట 108 (100) మరియు ముగింపు ప్రార్థన.
ఫిబ్రవరి 25తో ఆరంభమగు వారము
పాట 111 (20)
10 ని: స్థానిక ప్రకటనలు. దైవపరిపాలనా వార్తలు. వారాంతపు ప్రాంతీయ సేవా కార్యక్రమ ఏర్పాట్లను కూడా చేర్చుము. ప్రస్తుత పత్రికలలోని ఏ శీర్షికలు స్థానిక ప్రజలకు ప్రత్యేకముగా యిష్టకరంగా ఉండునో సూచనలను అందించుము.
23 ని: “ఇండెక్సె నుండి లభించు సహాయముతో మన రాజ్య పరిచర్యను నెరవేర్చుట.” ప్రేక్షకులు భాగము వహిస్తు పెద్దచే ప్రసంగము. ఒక పెద్ద మరియు పరిచారకుడు కాపరి దర్శనమునకు సిద్ధపడుటలో ఎట్లు ఇండెక్సెను ఉపయోగించవచ్చునో ప్రదర్శించుము. తమ వారపు బైబిలు పఠనమును దీవెనకరముగా చేసికొనుటకు ఇండెక్సెను ఉపయోగించుటకు ప్రచారకులకు ఎట్లు బోధించవచ్చునో చర్చించుము.
12 ని: లిటరేచర్ సేవకునియొక్క విధులు. తాను కలిగియున్న బాధ్యతలను పునఃసమీక్షిస్తూ, సేవాకాపరి లిటరేచర్ సేవకునితో ఇంటర్వ్యూ చేయును. కూటములకు ముందు మరియు తరువాత లిటరేటర్ను ఇచ్చు ఏర్పాట్లను వృద్ధిచేయు స్థానిక అవసరతలను ఉన్నతపరచుట మంచిది. సొసైటి యొద్ద యున్నట్లయిన నిలువయుంచుటకు అవసరమైన సాహిత్యములనుగూర్చి సలహాల కొరకు ప్రేక్షకులతో విచారించుము.
పాట 203 (71) మరియు ముగింపు ప్రార్థన.
మార్చి 4తో ఆరంభమగు వారము
పాట 192 (10)
8 ని: స్థానిక ప్రకటనలు
25 ని: “1991 జ్ఞాపకార్థపు ఆచరణ.” ప్రేక్షకులతో భాగము వహిస్తు పెద్దచే ప్రసంగము. క్రొత్తవారిని ఆహ్వానించుటకు వారు ఎట్లు పథకము వేసుకొనుచున్నారు. వారు హాజరగులాగున ఎట్లు సహాయపడగలరో చెప్పమని సంఘమును అడుగుము. జ్ఞాపకార్థ ఆహ్వానపు కరపత్రములు అందుబాటులో ఉన్నవని సంఘమునకు గుర్తుచేయుము.
15 ని: జ్ఞాపకార్థపు సమయములో మీరు సహాయ పయినీరుగా చేయగలరా? రెగ్యులర్ లేక ఆక్సిలరీ పయినీరుగా అనుభవమున్న సహోదరునిచే ఉత్సాహవంతమైన చర్చ. గతములో ఆక్సిలరీ పయినీర్లుగా చేసిన అనేకులను ఇంటర్వ్యూ చేయుము. తమ గురిని చేరుకొనుటకు వారు ఏ దిద్దుబాటులు చేసుకొన్నారు? వారు వేసుకొనిన ఆచరణాత్మక పథకములను ఉన్నతపరచుము. జ్ఞాపకార్థపు సమయము సమీపించుచుండగా ఆసక్తిగల ప్రచారకులు తమ పథకములను పెద్దతో చర్చించమని ప్రోత్సహించుము. ప్రస్తుతము అనుకూలవైఖరితో ఉండుట ద్వారా ఈ సేవను అనేకులు ఆనందించుదురు. కొంతమందికి ఇది రెగ్యులర్ పయినీరు సేవకు నడిపించునట్టి మెట్టయి యుండగలదు. (km 3/90 పే. 3) ప్రిసైడింగ్ ఓవర్సీర్ లేదా సెక్రటరీ నుండి అప్లికేషన్లను పొందవచ్చును.
పాట 151 (25) మరియు ముగింపు ప్రార్థన.