శిష్యులను చేయుటకు మనకు సహాయపడు కూటములు
గమనిక: మన రాజ్య పరిచర్య సమావేశముల కాలమందును ప్రతివారము సేవకూటమును ఏర్పాటుచేయును. జిల్లాసమావేశమునకు హాజరగుటకు వీలగునట్లు మరియు ఆ తదుపరి వార సేవకూటమందు 30 నిముషముల కార్యక్రమ ముఖ్యాంశముల పునఃసమీక్షను చేయునట్లు అవసరమునుబట్టి సంఘములు దానిలో మార్పులు చేసికొనవచ్చును. కీలకాంశములను ఎత్తిచూపగల ఇద్దరు లేక ముగ్గురు అర్హులైన సహోదరులను అనుదిన పునఃసమీక్షను చేయుటకు ముందుగనో నియమించవచ్చును. బాగుగా సిద్ధపడిన ఈ పునఃసమీక్ష వ్యక్తిగత అన్వయింపునకు, మరియు ప్రాంతములో ఉపయోగించుటకు కీలకాంశములను గుర్తించుకొనులాగున సహోదరులకు సహాయపడును. ఉపయోగించబడిన అనుభవములు మరియు ప్రేక్షకులనుండి వ్యాఖ్యానములు క్లుప్తముగాను అంశమునకు సూటిగాను ఉండవలెను.
జూలై 9తో ఆరంభమగు వారము
పాట 151 (25)
7 ని: స్థానిక ప్రకటనలు మరియు మన రాజ్య పరిచర్య నుండి తగిన ప్రకటనలు. వారాంతపు ప్రాంతీయ సేవా ఏర్పాట్లను చేర్చుము.
15 ని: “మీ పరిచర్యలో నిపుణులు కమ్ము.” శీర్షిక యొక్క ప్రశ్నాసమాధానముల చర్చ. 5, 6 పేరాగ్రాఫ్‌లను పరిశీలించునప్పుడు జూలై 15, 1988, వాచ్‌టవర్ మరియు రీజనింగ్ పుస్తకములలో కనుగొనబడు సలహాల ఉపయోగమును ప్రదర్శించుము. యెహోవా సంస్థ నుండి పొందిన సలహాలను అన్వయించుటద్వారా స్థానికముగా పొందిన మంచి ఫలితములను ప్రచారకులను తెలుపనిమ్ము.
23 ని: “1990వ సంవత్సరపు ‘స్వచ్ఛమైన భాష’ యను జిల్లా సమావేశమునకు రండి”—ఒకటవ భాగము. 1-15 పేరాగ్రాఫ్‌లను ప్రేక్షకులతో చర్చించుము మరియు “జిల్లా సమావేశపు జ్ఞాపికల”ను గూర్చిన క్లుప్తమైన పునఃసమీక్ష.
పాట 178 (67) మరియు ముగింపు ప్రార్థన.
జూలై 16తో ఆరంభమగు వారము
పాట 43 (103)
5 ని: స్థానిక ప్రకటనలు. అకౌంట్స్ రిపోర్టు, చందాలను పంపినట్లు తెలిపినవాటిని తెలియజేయుట.
10 ని: “సాక్ష్యమిచ్చు అవకాశములను పట్టుకొనుము” శీర్షిక యొక్క ప్రశ్నాసమాధానముల పరిశీలన.
15 ని: బైబిలు పఠనములను ఎట్లు ప్రారంభించవలెను. బైబిలు పఠనములను ప్రారంభించుటలో విజయవంతులైన ఇద్దరు లేక ముగ్గురు ప్రచారకులను ఇంటర్వ్యూ చేయము. దేనిని ప్రభావితమైన దానిగా వారు కనుగొనిరి? మొదట చూపిన ఆసక్తిని వారు ఎట్లు సజీవముగా ఉంచుదురు? మొదటిసారి కలిసినప్పుడు లేదా పునర్దర్శనము చేయునప్పుడు బైబిలు పఠనమును ఎట్లు ప్రారంభించవలెనో క్లుప్తమైన ప్రదర్శనలను అందించుము.
పాట 143 (76) మరియు ముగింపు ప్రార్థన.
జూలై 23తో ఆరంభమగు వారము
పాట 91 (61)
10 ని: స్థానిక ప్రకటనలు. దైవపరిపాలనా వార్తలు. మిగతా వారమంతటి ప్రాంతీయసేవా ఏర్పాట్లను చేర్చుము. సమయము అనుమతించుకొలది, ప్రస్తుత పత్రికలలోని మాట్లాడదగు అంశములను చూపుము.
18 ని: “మీ ఆత్మీయ అవసరమును తీర్చుకొనుట.” శీర్షిక యొక్క ప్రశ్నాసమాధానముల పరిశీలన. ఒక కుటుంబ శిరస్సును, ఒంటరి ప్రచారకుని వారు తమ ఆత్మీయ అవసరమును తీర్చుకొనుటకు సమయమును కలుగజేసుకొను సవాలునెట్లు ఎదుర్కొనుచున్నారో ఇంటర్వ్యూ చేయము. తమ స్వంత ఏర్పాట్లను పరిశీలించుకొని అవసరమగు అభివృద్ధిని చేసుకొనుటలో ఆతురతతో పనిచేయుటకు సహోదరులను ప్రోత్సహించుము.
17 ని: “సమయోచితమైన సహాయము.” ప్రేక్షకులతో సేవాకాపరి సమాచారమును చర్చించుము. సంఘపుస్తక పఠన గ్రూపులను సేవాకాపరి దర్శించు ఏర్పాటుయొక్క ప్రయోజనములను ఉన్నతపరచుము. సేవాకాపరియొక్క దర్శనపు వారములోని కార్యక్రమమందు పాల్గొనుటకు ప్రత్యేక ప్రయత్నము చేయుమని అందరిని ప్రోత్సహించుము.
పాట 177 (52) మరియు ముగింపు ప్రార్థన.
జూలై 30తో ఆరంభమగు వారము
పాట 213 (85)
8 ని: స్థానిక ప్రకటనలు. గాడ్స్ వర్డ్ పుస్తకమునుపయోగించుటలో ప్రచారకులు పొందిన ఒకటి లేక రెండు ప్రాంతపు అనుభవములను తెలియజేయుము. ఆగస్టులో ప్రాంతములో ఉపయోగించుటకు సంఘములో అందుబాటులో యున్న బ్రొషూర్ల పేర్లు తెలుపుము. స్థానిక ప్రాంతములో ఒక బ్రొషూరునెట్లు ఉపయోగించవలెనో ప్రదర్శించుము. ఈ వారాంతములో ప్రాంతీయ సేవలో పాల్గొనుటకు ప్రచారకులను ప్రోత్సహించుము.
15 ని: “సువార్తనందించుట—ఒక కుటుంబముగా.” సమాచారపు ప్రశ్నా సమాధానముల పరిశీలన. పేరాగ్రాఫ్‌లు చదువబడలాగున పేరాగ్రాఫ్కు ఒకటి లేక రెండు ప్రశ్నలను మాత్రమే అడుగుము.
22 ని: “1990వ సంవత్సరపు ‘స్వచ్ఛమైన భాష’ జిల్లా సమావేశమునకు రండి,”—రెండవ భాగము. ఇన్సర్ట్లోని 16 నుండి 34 పేరాగ్రాఫ్‌లను ప్రేక్షకులతో చర్చించుము. సమావేశములయందు మన ప్రవర్తనను నడపవలసిన లేఖన సూత్రములను నొక్కి తెలుపుము. ఇన్సర్ట్ను బైబిలు విద్యార్థులతో చర్చించి హాజరగుటకు ఏర్పాట్లను చేసుకొనులాగున సహాయపడుమని సహోదరులను ప్రోత్సహించుము.
పాట 214 (23) మరియు ముగింపు ప్రార్థన.