సువార్తనందించుట ఇంటింటి సేవలో వివిధ రీతులను ఉపయోగించుట ద్వారా
1 యెహోవాయొక్క సృష్టి వివిధ రీతులలో నిండినదై లేదా? కీర్తనల రచయిత ఇలా ప్రకటించెను: “యెహోవా, నీ కార్యములు ఎన్నెన్ని విధములుగా నున్నవి! జ్ఞానముచేత నీవు వాటన్నింటిని నిర్మించితివి.” (కీర్త. 104:24) ఆలాగే ప్రకటించుమని ఆయన మనకాజ్ఞాపించిన సువార్తకుకూడా అనేక ముఖరూపములు కలవు. సాధ్యమైనంత ఎక్కువమంది ప్రజలను చేరుకొనుటకు మీ ఇంటింటి పరిచర్యలో మీరు వివిధ రీతులను ఉపయోగించుచున్నారా?
2 పత్రిక దినమందు: ప్రతి శనివారము పత్రికలను అందించు పనిలో అందరు భాగము వహించవలెనని సొసైటి ప్రోత్సహించుచున్నది. సంభాషణ అంశమును ఉపయోగించుటకు బదులు, కేవలము ఒక శీర్షికను చూపించుచు 30 నుండి 60 సెకన్లు మాట్లాడి, ఆ పిమ్మట రెండు పత్రికలను 5 రూ. అందించుట యుక్తముగా నుండును. గృహస్థుడు ప్రశ్నలడిగినట్లయిన లేక సాధారణ శ్రద్ధకంటే ఎక్కువ శ్రద్ధ చూపినట్లయిన, త్వరగా వేరొక యింటికి వెళ్లవలెనని మనము భావించనవసరము లేదు.
3 ది వాచ్‌టవర్ మరియు అవేక్! విషయానికొస్తే వైవిధ్యమునకు కొరతలేదు. తరచు, సేవాకూటములో మొదటి భాగము నిర్వహించు సహోదరుడు ప్రస్తుత పత్రికలనుండి మాట్లాడదగు అంశములను అందించును. వాటికి శ్రద్ధనివ్వండి; మీరు ఉపయోగించగల సలహాలను వ్రాసికొనండి. సేవాకూటములో ప్రదర్శన చేర్చబడినట్లయిన, అది ఎలా చేయబడినదో గమనించుము, దానిని అభ్యసించుము, మరియు ఆ పిమ్మట దానిని శనివారము ప్రాంతమందు ఉపయోగించుము. ప్రతిస్పందన తక్కువగా ఉన్నదని నీవు కనుగొంటే, అందించుటకు మరొక శీర్షికను ఎంపిక చేసికొనుము. వివిధ రీతులలో శ్రద్ధ కలిగియుండు ప్రజలకు తగినరీతిలో రూపొందించబడిన వివిధ అంశములనేకము ప్రతి సంచికలో ఉండును. రెండు పత్రికలలోని శీర్షికలతో పరిచయము కలిగియుండుట ద్వారా, గృహస్థుని శ్రద్ధ కనుగుణ్యముగా నీ అందింపును మార్చుకొనుట సులభమగును.
4 నీ ఉపోద్ఘాతమును మార్చుము: ఇతర సమయములలో సంభాషణ అంశమును అప్పటి సాహిత్య అందింపుతో ఉపయోగించవలెను. మన రాజ్య పరిచర్య ఆయాసమయముల కొరకు వివిధ సంభాషణ అంశములను సూచించును. క్రొత్తవారికి శిక్షణ ఇచ్చునప్పుడు, సులభమైన ప్రసంగములో అప్పటి సంభాషణ అంశమును ఉపయోగించుట ఉత్తమము. అయితే, ఇతర సమయములలో సమీపించుటలో మార్పుచేయుట మంచిదై యుండవచ్చును. సంభాషణను ఆరంభించు సాధనముగా ఒక కరపత్రము లేక హ్యండ్బిల్ను అందించుట ద్వారా మాట్లాడుటను ప్రారంభించుటకు నీవు ప్రయత్నించావా?
5 నిస్సందేహముగా నీవు ఇంకను ప్రయత్నించని కొన్ని ఉపోద్ఘాతములు రీజనింగ్ పుస్తకములో కలవు. ఉదాహరణకు, ప్రస్తుత సంఘటనలపై ఆధారపడిన ఉపోద్ఘాతములను 10-11 పుటలు సూచించును. అంతేకాకుండా, 1988, జూలై 15, వాచ్‌టవర్ పుటలు 15-20 నందుగల అద్భుతమైన సూచనలను మర్చిపోకుము. గృహస్థుడు తన అభిప్రాయమును నిశ్చయముగా వ్యక్తపరచుటకు అనుమతించుచు, పుట 19 పేరా 16లో బహుగా ఆలోచించి సూచించబడిన ప్రశ్నలలో కొన్నింటిని ప్రయత్నించుము.
6 మన ప్రాంతమందలి ప్రజలనేక వివిధ జీవనగతులనుండి, పరిస్థితులనుండి వచ్చిన వారైయుందురు. ఇతరుల సంక్షేమము కొరకైన శ్రద్ధతో చేయుటద్వారా, వినువారందరి తగినట్లుండుటకు సమీపించు విధమును మనము మార్చవలెను. (1 కొరిం. 9:19-23) ఇంటింటి పరిచర్యలో వివిధ రీతులను ఉపయోగించుట ‘మనలను మనము మరియు మనలను వినువారిని రక్షించుకొనుటకు’ మనకు సహాయము చేయును.—1 తిమో. 4:16.