గృహ బైబిలు పఠనముల కొరకు సిద్ధపడుట మరియు నిర్వహించుట
1 సువార్త ప్రకటించవలెనని మరియు “శిష్యులనుగా చేయవలెనని” యేసు తన అనుచరులకు ఆజ్ఞాపించెను. (మత్త. 24:14; 28:19, 20) గృహ బైబిలు పఠనములను నిర్వహించుట శిష్యులను చేయుటకు బహు ప్రభావవంతమైన మార్గమై యున్నది. ఈ ప్రాముఖ్యమైన పని మన ఆరాధనలో భాగమైయున్నందున, గృహ బైబిలు పఠనముల కొరకు సిద్ధపడుట మరియు నిర్వహించునప్పుడు మనము చేతనైంతలో శ్రేష్టమైనది చేయుటకు కృషిచేయవలెను.
2 పఠనము కొరకు సిద్ధపడుట: గృహ బైబిలు పఠనమును నిర్వహించుటకు సిద్ధపడుటలో కేవలము పాఠ్యభాగమును చదువుట మరియు సూచింపబడిన లేఖనములను చూచుటకంటే ఎక్కువ ఇమిడియున్నది. మన బైబిలు విద్యార్థి హృదయమును చేరుటకు, అతని కదిలించు విధముగా విషయమును అందించవలసిన అవసరము కలదు.
3 మొదట, విషయమును మనకై మనము స్పష్టముగా అర్థము చేసికొనియుండవలెను. పేరాలకు మరియు బైబిలు విద్యార్థికి లేఖనములన్నియు ఎట్లు అన్వయించునో మనము తెలిసికొనవలెను. కీలకమైన పదములు, పదభాగముల క్రింద గీత గీసికొనుట గుర్తించుకొనుటకు మనకు సహాయము చేయును. పాఠ్యభాగములోని ముఖ్యాంశములను ప్రత్యేకపరచుకొనవలెను. మరియు వాటిని బైబిలు విద్యార్థికి అందజేయు విధమునుగూర్చి తలంచవలెను. అంతేకాకుండా, విద్యార్థియొక్క లేఖన పరిజ్ఞానము యొక్క స్థాయిని, కొన్నికొన్ని విషయములను అంగీకరించుటలో అతను కలిగియుండిన సమస్యల పరిస్థితులను, తన క్రైస్తవ వ్యక్తిత్వమును అతను ఎక్కడ వృద్ధి చేసికొనవలెను ఇత్యాది విషయములను పరిగణనలోనికి తీసికొనవలెను. మనమిట్లు అడుగవచ్చును: ‘అతను అభివృద్ధి సాధించునట్లు సహాయము చేయుటకు పాఠ్యభాగములోని విషయమును మరియు లేఖనములను ఎట్లు ఉపయోగించవచ్చును?’ కొన్నిసార్లు అదనముగా పరిశోధన చేయుట అవసరము. విద్యార్థి నిజముగా ప్రయోజనము పొందవలెనంటే జాగ్రత్తగా సిద్ధపడుట అవసరము.
4 బైబిలు పఠనమునకు సిద్ధపడుటలో యెహోవాకు ప్రార్థనచేయుట ఒక ప్రాముఖ్యమైన భాగమైయున్నది. ఆ వ్యక్తినిగూర్చి అతని అవసరతలనుగూర్చి ప్రార్థించుటలో నిశ్చితముగా ఉండుము. అతని హృదయము చేరుటకు నీకు సహాయము చేయుమని యెహోవాకు ప్రార్థనచేయుము.—1 కొరిం. 3:6.
5 పఠనమును నిర్వహించుట: ఒక వ్యక్తి సత్యమును తన స్వంతము చేసికొనుటలో సహాయపడుటకు మన పక్షమై ప్రయత్నము అవసరము. పఠన విషయమును కేవలము విద్యార్థిరీతిలో పూర్తిచేయుట ఆ వ్యక్తి జ్ఞానము సంపాదించుటకు సహాయము చేయవచ్చును. అయితే అతను నేర్చుకొనునది అతడు నమ్మునా? వ్యక్తిగతముగా తాను నేర్చుకొనిన దానితో తానేమి చేయవలెనో చూచుటకు విద్యార్థికి సహాయము చేయుము.—కొలొ. 3:10.
6 పఠనము చేయుచున్న విషయమునకు సూటిగా సంబంధములేని ఇతర అంశములలోనికి చర్చ జారిపోవు ప్రమాదమును అరికట్టుము. వీటిని పఠనము అయిపోయిన తరువాత లేక మరొక సమయమున చేపట్టవచ్చును. అంతేకాకుండా, విద్యార్థి కేవలము పుస్తకమునుండి చదువుటకు బదులు జవాబులు తన స్వంతమాటలలో చెప్పడం ప్రాముఖ్యము. ఇది అతడు విషయమును అర్థము చేసికొనుచున్నాడా లేదాయని తీర్మానించుటకు నీకు సహాయము చేయును.
7 మంచి బోధకుడు విద్యార్థికి తప్పిపోని విధముగా కీలక అంశములను నొక్కి తెలియజేయును. హృదయములోనికి చొచ్చుకొనిపోవు ఆలోచనాపూర్వక ప్రశ్నలను వేయుట ద్వారా యేసు దీనిని చేసెను. (మత్త. 16:13-16; 17:24-27) ప్రశ్నలను విద్యార్థి అర్థము చేసికొనుచున్నాడని నిశ్చయముగా తెలిసికొనుటకు నీకు సహాయపడుటయేగాకుండా, అతని హృదయములో ఏమున్నదోకూడా బయల్పరచును. తను చెప్పుదానిని తనను వినువారు ఆలోచించుటకు సహాయపడులాగున యేసు సులభమైన, సరళమైన దృష్టాంతములను కూడా ఉపయోగించెను.—మత్త. 13:31-33; 24: 32, 33.
8 పఠన ముగింపులో పునఃసమీక్షయందు కీలకమైన లేఖనములను ఖచ్చితముగా చేర్చుము. విద్యార్థి నేర్చుకొనిన విషయమునుగూర్చి ఏమి భావించుచున్నాడో చూచుటకు నీకు సహాయము చేయునటువంటి మరియు తాను నేర్చుకొనినది అతడెట్లు అన్వయించగలడో అనుదానిపై దృష్టి నిల్చు ప్రశ్నలను ఉపయోగించుము. మరలా వచ్చినప్పుడు పఠనమునకు ముందు, అవసరమునుబట్టి ముఖ్యాంశములను క్లుప్తముగా పునఃసమీక్షించుము.
9 యెహోవా సేవకులుగా ఉండేందుకు ప్రజలకు మనము శిక్షణనిచ్చుచున్నాము. ఇది ఒక ఆధిక్యతేకాదు. ఒక గంభీరమైన బాధ్యతకూడా, గృహ బైబిలు పఠనముల బోధనయందు నీ నాణ్యతను నీవు మెరుగుపరచుకొనగలవా? గృహ బైబిలు పఠనముల కొరకు సిద్ధపడునప్పుడు, మరియు నిర్వహించునప్పుడు శ్రేష్టమైన దానిని మనము చేయవలెను.—1 తిమో. 4:15, 16.