విషయసూచిక
3 తమ జీవితాల్ని సంతోషంగా అంకితం చేశారు—మడగాస్కర్‌లో
ఫిబ్రవరి 26, 2018-మార్చి 4, 2018
7 ‘సొమ్మసిల్లినవాళ్లకు బలమిచ్చువాడు ఆయనే’
జీవన చింతలు మనల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తుంటే ఏమి చేయవచ్చు? ఈ ఆర్టికల్‌లో 2018 వార్షిక వచనం గురించి చర్చిస్తాం. అంతేకాదు మనల్ని బలపర్చే అవకాశాన్ని యెహోవాకు ఎందుకు ఇవ్వాలో, ఆయన మనల్ని ఎలా బలపరుస్తాడో కూడా చర్చిస్తాం.
మార్చి 5-11, 2018
12 జ్ఞాపకార్థ ఆచరణ దేవుని ప్రజల్ని ఐక్యం చేస్తుంది
ఈ సంవత్సరం క్రీస్తు మరణ జ్ఞాపకార్థ ఆచరణ 2018, మార్చి 31, శనివారం జరుగుతుంది. ఈ ఆచరణకు మనమెలా సిద్ధపడవచ్చు, దానికి హాజరవ్వడం వల్ల ఎలాంటి ప్రయోజనం పొందవచ్చు, వేర్వేరు చోట్ల ఉన్న దేవుని ప్రజలు ఈ ఆచరణ వల్ల ఎలా ఐక్యమౌతారు వంటి విషయాల గురించి ఈ ఆర్టికల్‌లో తెలుసుకుంటాం.
మార్చి 12-18, 2018
17 ఏ కొదువ లేని దేవునికి మనమేమి ఇవ్వగలం?
మన దగ్గర ఉన్నవన్నీ యెహోవా ఇచ్చినవే. అయినప్పటికీ, మన డబ్బును నేడు తన సంస్థ చేస్తున్న పనులకు మద్దతివ్వడానికి ఉపయోగించాలని ఆయన కోరుతున్నాడు. మన దగ్గరున్న విలువైన వాటితో యెహోవాను ఎలా ఘనపర్చవచ్చో, దానివల్ల ఎలాంటి ప్రయోజనం పొందవచ్చో ఈ ఆర్టికల్‌లో పరిశీలిస్తాం.
మార్చి 19-25, 2018
22 ఎలాంటి ప్రేమ నిజమైన సంతోషాన్నిస్తుంది?
మార్చి 26, 2018–ఏప్రిల్ 1, 2018
మొదటి ఆర్టికల్‌లో, నిజమైన సంతోషం ప్రేమగల దేవుని నుండే వస్తుందిగానీ, “చివరి రోజుల్లో” సర్వసాధారణమైన స్వార్థపూరిత ప్రేమవల్ల రాదని తెలుసుకుంటాం. (2 తిమో. 3:1) రెండవ ఆర్టికల్‌లో లోకంలోని ప్రజలకు, దేవుని ప్రజలకు ఉన్న స్పష్టమైన తేడా ఏమిటో తెలుసుకుంటాం.
32 మీకు తెలుసా?