చివరి రోజులను తప్పించుకున్న వాళ్లకోసం పరదైసు భూమి ఎదురుచూస్తుంది
బైబిలు ఏం చెప్తుంది?
మనం “చివరి రోజుల్లో” జీవిస్తున్నామా?
మీరేం నమ్ముతున్నారు?
అవును
కాదు
తెలీదు
పరిశుద్ధ లేఖనాలు ఏమంటున్నాయి?
“చివరి రోజుల్లో ప్రమాదకరమైన, కష్టమైన కాలాలు వస్తాయి.” (2 తిమోతి 3:1) బైబిలు ప్రవచనాలతోపాటు, ఇప్పుడు జరిగే సంఘటనలు బట్టి మనం “చివరి రోజుల్లో” జీవిస్తున్నామని చెప్పవచ్చు.
బైబిలు ఇంకా ఏమి చెప్తుంది?
చివరి రోజుల్లో యుద్ధాలు, కరువులు, భూకంపాలు, ప్రాణాంతక అంటువ్యాధులు ఎక్కువగా ఉంటాయి.—మత్తయి 24:3, 7; లూకా 21:11.
చివరి రోజుల్లో మానవ సమాజం అంతా నైతికంగా, ఆధ్యాత్మికంగా చెడిపోతుంది.—2 తిమోతి 3:2-5.
మనుషుల భవిష్యత్తు ఎలా ఉంటుంది?
కొందరి నమ్మకాలు: భూమితోపాటు ప్రజలు అందరూ నాశనం అవడంతో చివరి రోజులు ముగుస్తాయని కొందరు నమ్ముతారు, మరికొందరు పరిస్థితులు బాగవుతాయని నమ్ముతారు. మీరేమంటారు?
పరిశుద్ధ లేఖనాలు ఏమంటున్నాయి?
“నీతిమంతులు భూమిని స్వతంత్రించుకొందురు వారు దానిలో నిత్యము నివసించెదరు.”—కీర్తన 37:29.
బైబిలు ఇంకా ఏమి చెప్తుంది?
చెడునంతటినీ తీసి వేయడంతో చివరి రోజులు ముగుస్తాయి.—1 యోహాను 2:17.
భూమంతా అందమైన తోటలా మారుతుంది.—యెషయా 35:1, 6.