కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • wp17 No. 1 పేజీలు 6-7
  • బైబిలు నాకు ఎలా ఉపయోగపడుతుంది?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • బైబిలు నాకు ఎలా ఉపయోగపడుతుంది?
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (సార్వజనిక)—2017
  • ఇలాంటి మరితర సమాచారం
  • కుటుంబాలకు సహాయం
    తేజరిల్లు!—2018
  • జీవితం గురించిన ప్రశ్నలకు జవాబులు ఎవరు ఇస్తారు?
    జీవితం గురించిన ప్రశ్నలకు జవాబులు ఎవరు ఇస్తారు?
  • మీరు సంతోషంగా జీవించడానికి దేవుడు ఎలా సహాయం చేస్తాడు?
    ఎల్లప్పుడూ సంతోషంగా జీవించండి!—దేవుడు చెప్పేది తెలుసుకోండి
  • మీరు సంతోషంగా జీవించడానికి దేవుడు ఎలా సహాయం చేస్తాడు?
    ఎల్లప్పుడూ సంతోషంగా జీవించండి!—దేవుడు చెప్పేది తెలుసుకోవడం మొదలుపెట్టండి
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (సార్వజనిక)—2017
wp17 No. 1 పేజీలు 6-7
భర్త, భార్య కలిసి వంటగదిలో పని చేసుకుంటున్నారు

పత్రిక ముఖ్యాంశం | బైబిలు నుండి ఎక్కువ ప్రయోజనం పొందాలంటే ఎలా చదవాలి?

బైబిలు నాకు ఎలా ఉపయోగపడుతుంది?

బైబిలు అన్ని పుస్తకాల వంటిది కాదు. ఇందులో సృష్టికర్త చెప్పిన సలహాలు ఉన్నాయి. (2 తిమోతి 3:16, 17) ఈ సమాచారం మనల్ని ఎంతగానో కదిలిస్తుంది. నిజానికి, బైబిలే ఇలా చెప్తుంది: దేవుని వాక్యం సజీవమైనది, శక్తివంతమైనది. (హెబ్రీయులు 4:12) ముఖ్యంగా బైబిలు రెండు విధాలుగా మన జీవితాన్ని మెరుగుపర్చుకోవడానికి సహాయం చేస్తుంది. రోజూ మన జీవితంలో కావాల్సిన నిర్దేశాన్ని ఇస్తుంది. దేవున్ని, ఆయన వాగ్దానాలను తెలుసుకోవడానికి సహాయం చేస్తుంది.—1 తిమోతి 4:8; యాకోబు 4:8.

ఇప్పుడు మీ జీవితాన్ని మెరుగుపర్చుకోవచ్చు. మీ వ్యక్తిగత విషయాల్లో కూడా బైబిలు సహాయం చేస్తుంది. ఈ విషయాల్లో మీకు ఉపయోగపడే సలహాలు ఇస్తుంది:

  • ఇతరులతో మీ సంబంధాల్లో—ఎఫెసీయులు 4:31, 32; 5:22, 25-28, 33.

  • మనసు, శరీరం ఆరోగ్యంగా ఉండే విషయంలో—కీర్తన 37:8; సామెతలు 17:22.

  • నైతిక విలువల విషయంలో—1 కొరింథీయులు 6:9, 10.

  • ఆర్థిక భద్రత విషయంలో—సామెతలు 10:4;28:19; ఎఫెసీయులు 4:27, 28.a

ఆసియాలో ఒక యువ జంట బైబిల్లో ఉన్న సలహాలను ఎంతో విలువైనవని చెప్తున్నారు. కొత్తగా పెళ్లైన చాలామంది ఒకరి స్వభావానికి ఒకరు అలవాటు పడే విషయంలో, మనసు విప్పి సరిగ్గా మాట్లాడుకునే విషయంలో ఇబ్బందులు పడుతుంటారు. వీళ్లకు కూడా అలాంటి సమస్యలే ఎదురయ్యాయి. కానీ బైబిల్లో వాళ్లు చదివిన విషయాలను పాటించడం మొదలుపెట్టాక వచ్చిన ఫలితం గురించి భర్త విసెంట్‌ ఇలా చెప్తున్నాడు: “బైబిల్లో నేను చదివిన విషయాలు వివాహ జీవితంలో వచ్చే సమస్యలను ప్రేమగా పరిష్కరించుకోవడానికి నాకు సహాయం చేశాయి. బైబిల్లో ఉన్న సలహాల ప్రకారం జీవించడం వల్ల ఇద్దరం సంతోషంగా ఉన్నాం.” ఆయన భార్య ఆనలూ ఇలా అంటోంది: “బైబిల్లో ఉన్న ఉదాహరణలు చదవడం మాకు సహాయం చేసింది. మా వివాహ జీవితంతో, మేము పెట్టుకున్న లక్ష్యాలతో ఇప్పుడు సంతోషంగా, సంతృప్తిగా ఉన్నాం.”

దేవుణ్ణి తెలుసుకోవచ్చు. వివాహం గురించి చెప్పిన విషయాలతో పాటు విసెంట్‌ ఇలా కూడా చెప్తున్నాడు: “బైబిలు చదవడం వల్ల ముందెప్పటికన్నా ఇప్పుడు యెహోవాకు మరింత దగ్గరయ్యాను.” విసెంట్‌ చెప్పిన దాన్ని బట్టి ఒక ముఖ్యమైన విషయం అర్థమౌతుంది. యెహోవా గురించి ఎక్కువ తెలుసుకోవడానికి బైబిలు మీకు సహాయం చేస్తుంది. అప్పుడు, ఆయన ఇచ్చే సలహాల నుండి ప్రయోజనం పొందడమే కాదు, ఒక స్నేహితునిగా ఆయన గురించి మరింత ఎక్కువ తెలుసుకుంటారు. మంచి భవిష్యత్తు గురించి ఆయన ఏమి చెప్తున్నాడో మీరు తెలుసుకుంటారు, ఆ భవిష్యత్తులో మీరు నిరంతరం ఉండే “వాస్తవమైన జీవమును” ఆనందిస్తారు. (1 తిమోతి 6:18, 19) ఇలాంటి భవిష్యత్తు గురించి మీరు ఇంకే పుస్తకంలో చూడరు.

బైబిలు చదవడం మొదలుపెట్టి మానకుండా చదువుతూ ఉంటే, మీరు కూడా అలాంటి ప్రయోజనాలనే పొందుతారు. మీ జీవితాన్ని మెరుగుపర్చుకుంటారు, దేవుని గురించి ఎక్కువ తెలుసుకుంటారు. మీరు బైబిలు చదువుతుండగా మీకు ఎన్నో ప్రశ్నలు రావచ్చు. అప్పుడు, 2,000 సంవత్సరాల క్రితం జీవించిన ఐతియోపీయుడైన అధికారి లాంటి మంచి ఉదాహరణ గుర్తు పెట్టుకోండి. ఆయనకు బైబిలు గురించి ఎన్నో ప్రశ్నలు ఉన్నాయి. చదువుతున్నది మీకు అర్థం అవుతుందా? అని అతనిని అడిగినప్పుడు, ఎవరో ఒకరు వివరించి చెప్పకపోతే నాకెలా అర్థమౌతుంది?b అని అన్నాడు. వెంటనే అతను యేసు తొలి శిష్యుడు, బైబిలు గురించి బాగా తెలిసిన బోధకుడైన ఫిలిప్పు నుండి సహాయాన్ని తీసుకున్నాడు. (అపొస్తలుల కార్యములు 8:30, 31, 34) అదే విధంగా, మీరు కూడా బైబిలు గురించి ఎక్కువ విషయాలు నేర్చుకోవాలంటే, www.jw.org వెబ్‌సైట్‌లో మీ రిక్వెస్ట్‌ను నింపండి లేదా ఈ పత్రికలో ఉన్న అడ్రసుల్లో మీకు దగ్గర్లో ఉన్న అడ్రస్‌కు లెటర్‌ రాయండి. మీకు తెలిసిన యెహోవాసాక్షులను అడగవచ్చు లేదా దగ్గర్లో ఉన్న రాజ్యమందిరానికి వెళ్లవచ్చు. ఈ రోజు నుండే బైబిలు చదవడం మొదలుపెట్టి సంతోషంగా ఉండే జీవన విధానాన్ని తెలుసుకోండి.

బైబిల్ని పూర్తిగా నమ్మవచ్చో లేదో అనే సందేహం మీలో ఉంటే, బైబిల్లో ఉన్న విషయాలను నిజమని మీరు ఎందుకు నమ్మవచ్చు? అనే చిన్న వీడియో చూడండి. కోడ్‌ స్కాన్‌ చేసి మీరు దాన్ని చూడొచ్చు. లేదా jw.org వెబ్‌సైట్‌లో ప్రచురణలు > వీడియోలు చూడండి

a ఉపయోగపడే ఎన్నో సలహాలు బైబిల్లో ఉన్నాయి, వాటి కోసం jw.org వెబ్‌సైట్‌లో బైబిలు బోధలు > బైబిలు ప్రశ్నలకు జవాబులు చూడండి.

b ఈ పత్రికలో ఉన్న “తప్పుగా అర్థం చేసుకుంటే ప్రమాదం ఉందా?” అనే ఆర్టికల్‌ కూడా చూడండి

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి