విషయసూచిక
ఆగస్టు 1-7, 2016
6 యెహోవాను మన కుమ్మరిగా గుర్తిస్తూ కృతజ్ఞత చూపిద్దాం
ఆగస్టు 8-14, 2016
11 మిమ్మల్ని మలిచే అవకాశం గొప్ప కుమ్మరికి ఇస్తున్నారా?
సాధారణంగా కుమ్మరి పని చేసేవాళ్లు, మట్టిని తమ చేతితో మలుస్తూ అందమైన పాత్రల్ని తయారుచేస్తారు. యెహోవాను “మన కుమ్మరి” అని ఎందుకు అనవచ్చో, ఆయన చేతిలో మనం మెత్తని మట్టిలా ఉండాలంటే ఏమి చేయాలో ఈ రెండు ఆర్టికల్స్‌లో తెలుసుకుంటాం.
ఆగస్టు 15-21, 2016
18 “మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా”
మన దేవుడైన యెహోవా “అద్వితీయుడగు యెహోవా” అంటే అర్థమేమిటి? యెహోవాతో, తోటి సహోదరసహోదరీలతో మనకున్న సంబంధంపై అది ఎలాంటి ప్రభావం చూపిస్తుంది? మనందరం వేర్వేరు నేపథ్యాల నుండి వచ్చినవాళ్లం కాబట్టి యెహోవాను ‘మన దేవునిగా’ కలిగివుండడానికి, ఆయన మన నుండి ఏమి కోరుకుంటున్నాడో అర్థంచేసుకోవాలి.
ఆగస్టు 22-28, 2016
23 ఇతరుల పొరపాట్లను చూసి యెహోవాకు దూరమవ్వకండి
మనుషులందరిలో లోపాలు ఉంటాయి. వాటివల్ల ఇతరుల్ని బాధపెడుతూ ఉంటాం. కాబట్టి మనల్ని బాధపెట్టేలా ఎవరైనా ఏదైనా అంటే లేదా చేస్తే మనమేమి చేయాలి? ఈ విషయంలో మనకు సహాయం చేసే బైబిల్లోని ఉదాహరణలను ఈ ఆర్టికల్‌లో పరిశీలిస్తాం.