విషయసూచిక
జూన్ 27, 2016–జూలై 3, 2016
3 అభిప్రాయభేదాల్ని ప్రేమతో పరిష్కరించుకోండి
మనం అపరిపూర్ణులం కాబట్టి కొన్నిసార్లు తోటి సహోదరసహోదరీలతో మనకు అభిప్రాయభేదాలు రావచ్చు.అయితే ఇతరులతో మనకున్న విభేదాల్ని పరిష్కరించుకుని సమాధానంగా ఉండడానికి సహాయం చేసే బైబిలు సూత్రాల గురించి ఈ ఆర్టికల్‌లో తెలుసుకుంటాం.
జూలై 4-10, 2016
8 ‘మీరు వెళ్లి, సమస్త జనులను శిష్యులుగా చేయండి’
మత్తయి 24:14 లో యేసు ప్రవచించిన మాటల్ని భూమ్మీద నెరవేరుస్తున్న ప్రజలు కేవలం యెహోవాసాక్షులేనని నిరూపించే ఆధారాల్ని ఈ ఆర్టికల్ చర్చిస్తుంది. అంతేకాదు “మనుష్యులను పట్టుజాలరులుగా” ఉండడమంటే ఏమిటో కూడా ఈ ఆర్టికల్ వివరిస్తుంది.—మత్త. 4:19.
జూలై 11-17, 2016
13 వ్యక్తిగత నిర్ణయాల్ని మీరెలా తీసుకుంటారు?
ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు, మీకు ఏది కరెక్ట్ అనిపిస్తే అది చేసేస్తారా? లేదా ఏం చేయమంటారని వేరేవాళ్లను అడుగుతారా? దేవుని ఆలోచనల ప్రకారం తీసుకునే నిర్ణయాలే ఎందుకు సరైనవో ఈ ఆర్టికల్ వివరిస్తుంది.
జూలై 18-24, 2016
18 బైబిలు సహాయంతో మార్పులు చేసుకుంటూ ఉన్నారా?
బాప్తిస్మం తీసుకోవడానికి ముందు మీరు ఎన్నో పెద్దపెద్ద మార్పులు చేసుకుని ఉండవచ్చు. అయితే యెహోవాను, యేసును మరింత దగ్గరగా అనుకరించడానికి చిన్నచిన్న మార్పులు చేసుకోవడం ఇప్పుడు మీకు కష్టంగా అనిపిస్తోందా? అలా ఎందుకు అనిపిస్తుందో, ఈ విషయంలో బైబిలు మనకు ఏవిధంగా సహాయం చేయగలదో ఈ ఆర్టికల్ వివరిస్తుంది.
జూలై 25-31, 2016
23 యెహోవా ఇచ్చే ఆధ్యాత్మిక ఆహారం నుండి పూర్తి ప్రయోజనం పొందండి
మనం జాగ్రత్తగా ఉండాల్సిన ఓ ప్రమాదం గురించి ఈ ఆర్టికల్‌లో చర్చిస్తాం. అంతేకాదు యెహోవా అందిస్తున్న ఆధ్యాత్మిక ఆహారమంతటి నుండి మనమెలా ప్రయోజనం పొందవచ్చో కూడా తెలుసుకుంటాం.