కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w15 10/1 పేజీలు 14-15
  • దేవుడు మిమ్మల్ని వదిలేశాడని నిరాశపడుతున్నారా?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • దేవుడు మిమ్మల్ని వదిలేశాడని నిరాశపడుతున్నారా?
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2015
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • మనం బాధపడాలన్నది దేవుని ఉద్దేశమా?
  • ఎందుకిన్ని కష్టాలు?
  • ఈ సమస్యల్ని దేవుడు ఎలా పరిష్కరిస్తాడు?
  • నిరాశ కలిగితే ఏమి చేయాలి?
  • దేవుడెందుకు బాధను అనుమతిస్తున్నాడు?
    నిత్యజీవానికి నడిపించే జ్ఞానము
  • మానవ బాధలు—వాటిని దేవుడెందుకు అనుమతిస్తున్నాడు?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1994
  • బాధలనుభవిస్తున్న వారికి ఓదార్పు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2003
  • చెడుతనం, బాధలు ఎందుకు ఉన్నాయి?
    ఎల్లప్పుడూ సంతోషంగా జీవించండి!—దేవుడు చెప్పేది తెలుసుకోండి
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2015
w15 10/1 పేజీలు 14-15

దేవుడు మిమ్మల్ని వదిలేశాడని నిరాశపడుతున్నారా?

“నాకే ఎందుకిలా జరగాలి? దేవుడు దీన్ని ఎందుకు ఆపలేదు?” బ్రెజిల్‌ దేశానికి చెందిన ఒక 24 సంవత్సరాల కుర్రాడు ఈ ప్రశ్నలతో సతమతమయ్యాడు. అతని పేరు సిడ్నే. వాటర్‌స్లైడ్‌లో జరిగిన ప్రమాదం వల్ల అతను పూర్తిగా చక్రాల కుర్చీకి పరిమితమయ్యాడు.

యాక్సిడెంట్లు, జబ్బులు, ఇష్టమైన వాళ్ల మరణం, ప్రకృతి విపత్తులు, యుద్ధాల వల్ల ప్రజలకు దేవుని మీద నమ్మకం తగ్గిపోతుంది. ఇది ఎప్పటినుండో జరుగుతుంది. పూర్వకాలంలో యోబు అనే అతనికి ఒకదాని తర్వాత ఒకటి కష్టాలు వచ్చాయి. నిజం తెలియక ఆయన దేవున్ని తప్పు పడుతూ ఇలా అన్నాడు, “నీకు మొఱ్ఱపెట్టుచున్నాను అయితే నీవు ప్రత్యుత్తరమేమియు నియ్యకున్నావు నేను నిలుచుండగా నీవు నన్ను తేరి చూచుచున్నావు. నీవు మారిపోయి నాయెడల కఠినుడవైతివి నీ బాహుబలముచేత నన్ను హింసించుచున్నావు.”—యోబు 30:20, 21.

ఆయన సమస్యలకు కారణం ఏమిటో, అవి ఆయనకే ఎందుకు వస్తున్నాయో, దేవుడు ఎందుకు అలా జరగనిస్తున్నాడో యోబుకు తెలీదు. కానీ, ఇలాంటివన్నీ ఎందుకు జరుగుతున్నాయో, కష్టాలు వచ్చినప్పుడు మనమేమి చేయాలో దేవుని వాక్యంలో ఉంది.

మనం బాధపడాలన్నది దేవుని ఉద్దేశమా?

దేవుని వాక్యంలో ఇలా ఉంది: “ఆయన కార్యము సంపూర్ణము ఆయన చర్యలన్నియు న్యాయములు ఆయన నిర్దోషియై నమ్ముకొనదగిన దేవుడు ఆయన నీతిపరుడు యథార్థవంతుడు.” (ద్వితీయోపదేశకాండము 32:4) దేవుడు “నీతిపరుడు యథార్థవంతుడు” అనేదే నిజమైతే మనుషులు బాధపడాలనేది దేవుని ఉద్దేశమని, మనుషుల్ని శిక్షించడానికి లేదా పరీక్షించి వాళ్లలో చెడు తీసేయడానికి ఆయన విపత్తులు తెస్తున్నాడనడం ఎంతవరకు న్యాయం. అలా అనడంలో అర్థమే లేదు.

దేవుని వాక్యంలో ఇలా ఉంది: “దేవుడు కీడువిషయమై శోధింపబడనేరడు; ఆయన ఎవనిని శోధింపడు గనుక ఎవడైనను శోధింపబడినప్పుడు—నేను దేవునిచేత శోధింపబడుచున్నానని అనకూడదు.” (యాకోబు 1:13) మనుషుల జీవితం మొదలైన కొత్తలో వాళ్లకు ఏ లోటూ లేదని అంతా బాగుందని దేవుని వాక్యంలో ఉంది. దేవుడు మొదటి మనుషులకు అంటే ఆదాము హవ్వలకు ఒక అందమైన ఇల్లు ఇచ్చి అందులో వాళ్లకు అవసరమైనవన్నీ ఉంచి, చేయడానికి మంచి పనిని కూడా ఇచ్చాడు. “మీరు ఫలించి అభివృద్ధిపొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరచుకొనుడి; సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమిమీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పెను.” ఆదాము హవ్వలకు దేవున్ని తప్పు పట్టడానికి ఏ కారణమూ లేదు.—ఆదికాండము 1:28.

కానీ ఈ రోజు మనందరి జీవితం అలా లేదు. వేల సంవత్సరాల నుండి మనుషుల పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. “సృష్టి యావత్తు ఇదివరకు ఏకగ్రీవముగా మూలుగుచు ప్రసవవేదన పడుచునున్నదని యెరుగుదుము” అన్న మాటల్లో ఆ నిజం తెలుస్తుంది. (రోమీయులు 8:22) ఎందుకిలా జరిగింది?

ఎందుకిన్ని కష్టాలు?

అది తెలుసుకోవాలంటే అసలు ఈ కష్టాలు మొదలైన సమయానికి వెళ్లాలి. దేవుని దగ్గర ఉండే ఒక దూత ఆయనకు ఎదురుతిరిగాడు. అతనికి సాతాను అని పేరు వచ్చింది. మొదటి మనుషులైన ఆదాము హవ్వలు కూడా దేవునికి ఎదురుతిరిగేలా సాతాను చేశాడు. “మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను” తినవద్దనే ఆజ్ఞను దేవుడు ఇచ్చాడు. అది మంచి చెడులు నిర్ణయించడానికి దేవునికున్న హక్కుకు గుర్తుగా ఉంది. వాళ్లు దేవునికి ఎదురుతిరిగినా చనిపోరని సాతాను హవ్వకు చెప్పి దేవుడు అబద్ధికుడని నమ్మించాడు. అంతేకాదు మంచేదో చెడేదో నిర్ణయించుకోకుండా దేవుడు వాళ్లను ఆపుతున్నాడని కూడా నిందలు వేశాడు. (ఆదికాండము 2:17; 3:1-6) దేవుని అధికారం నుండి బయటకు వస్తే వాళ్లు ఇంకా సంతోషంగా ఉంటారని నమ్మించాడు. ఇదంతా, “దేవునికి మనుషుల్ని పరిపాలించే హక్కు ఉందా?” అనే పెద్ద ప్రశ్నను లేవదీసింది.

సాతాను ఇంకో ప్రశ్నను కూడా లేవనెత్తాడు. మనుషులు స్వార్థంతోనే దేవున్ని ఆరాధిస్తున్నారని అన్నాడు. నమ్మకస్థుడైన యోబు గురించి సాతాను దేవునితో “నీవు అతనికిని అతని యింటివారికిని అతనికి కలిగిన సమస్తమునకును చుట్టు కంచె వేసితివి గదా? అయినను నీవు ఇప్పుడు నీ చేయి చాపి అతనికి కలిగిన సమస్తమును మొత్తిన యెడల అతడు నీ ముఖము ఎదుటనే దూషించి నిన్ను విడిచిపోవును” అన్నాడు. (యోబు 1:10, 11) సాతాను ఆ మాటలు యోబు గురించే అన్నా నిజానికి మనుషులంతా స్వార్థంతోనే దేవున్ని ఆరాధిస్తున్నారని అన్నాడు.

ఈ సమస్యల్ని దేవుడు ఎలా పరిష్కరిస్తాడు?

మళ్లీ ఇలాంటి సమస్యలు రాకుండా అప్పుడు వచ్చిన ప్రశ్నలను దేవుడు ఎలా పరిష్కరిస్తే బాగుంటుంది. ఎంతో జ్ఞానమున్న దేవుని దగ్గర సరైన పరిష్కారం ఉంది. తర్వాత ఇంక ఏ మనిషీ “దేవుడు ఏమి చేస్తున్నాడు” అని బాధపడని, సందేహించని పరిష్కారం అది. (రోమీయులు 11:33) మానవులు వాళ్లను వాళ్లు పరిపాలించుకుని, ఎవరి పరిపాలన బాగుందో అర్థం చేసుకునేలా చేశాడు.

మానవ పరిపాలన పూర్తిగా విఫలమైంది అనడానికి ఇప్పుడు భూమ్మీదున్న ఈ ఘోరమైన పరిస్థితులే నిదర్శనం. ప్రపంచంలో ఉన్న ప్రభుత్వాలు శాంతిభద్రతలను, సంతోషాన్ని తీసుకురాకపోగా, భూమిని నాశనం అంచుల్లోకి తెచ్చాయి. “తమ మార్గము నేర్పరచుకొనుట నరులవశములో లేదని” దేవుని వాక్యంలో ఉన్న మాటలకు ఇది ఇంకా బలాన్నిస్తుంది. (యిర్మీయా 10:23) దేవుని పరిపాలనలోనే మనుషులు శాంతిసంతోషాలతో, సౌభాగ్యాలతో వర్ధిల్లుతారు. దేవుని ఉద్దేశం అదే.—యెషయా 45:18.

దేవుడు మనుషుల జీవితాలను, పరిస్థితులను ఎప్పుడు మారుస్తాడు? యేసు తన అనుచరులకు నేర్పించిన ప్రార్థనను గుర్తు చేసుకుందాం. “నీ రాజ్యము వచ్చుగాక; నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమియందును నెరవేరును గాక.” (మత్తయి 6:9) దేవుని రాజ్యం ద్వారానే దేవుడు తగిన సమయంలో, మన కష్టాలకు కారణమైన వాటన్నిటినీ తీసేస్తాడు. (దానియేలు 2:44) అప్పుడు పేదరికం, అనారోగ్యం, మరణం ఇక ఉండవు. పేదవాళ్లు “మొఱ్ఱపెట్టగా అతడు వారిని విడిపించును” అని దేవుని వాక్యంలో ఉంది. (కీర్తన 72:12-14) అనారోగ్యంతో బాధపడుతున్నవాళ్లు, “నాకు దేహములో బాగులేదని” అనేరోజు ఇక ఉండదని దేవుడు మాటిస్తున్నాడు. (యెషయా 33:24) చనిపోయి దేవుని మనసులో భద్రంగా ఉన్నవాళ్ల గురించి యేసు ఇలా చెప్పాడు: “ఒక కాలము వచ్చుచున్నది; ఆ కాలమున సమాధులలో నున్నవారందరు ఆయన శబ్దము విని . . . బయటికి వచ్చెదరు.” (యోహాను 5:28, 29) ఈ వాగ్దానాలు హృదయానికి ఎంతో ఆనందాన్ని ఇస్తాయి.

చక్రాల కుర్చీకి పరిమితమైన వ్యక్తి లేచి నడుస్తున్నాడు

దేవుని వాగ్దానాల మీద నమ్మకం పెంచుకుంటే మనం దేవున్ని అపార్థం చేసుకోము

నిరాశ కలిగితే ఏమి చేయాలి?

మొదట్లో చూసిన సిడ్నే, ప్రమాదం జరిగిన 17 సంవత్సరాల తర్వాత ఇలా అంటున్నాడు: “నాకు ప్రమాదం జరిగినందుకు నేను యెహోవాను ఎప్పుడూ నిందించలేదు. కాకపోతే ఇలా జరుగుతుంటే ఆయన ఎందుకు ఆపలేదు అని మాత్రం అనుకున్నాను. కొన్నిసార్లు నేను చాలా బాధపడ్డాను, ఇలా కదలలేకుండా అయిపోయాను అని ఎన్నోసార్లు ఏడ్చాను. కానీ దేవుడే నన్ను శిక్షించడానికి ఈ ప్రమాదం తీసుకురాలేదని ఆయన వాక్యం నుండి అర్థం చేసుకున్నాను. ఊహించని సంఘటనలు జరగడం వల్ల మనందరం బాధపడుతున్నామనే విషయం దేవుని వాక్యంలో ఉంది. యెహోవాకు ప్రార్థన చేస్తూ, నాకు అవసరమైన దేవుని మాటలు చదువుకుంటూ నేను ఆధ్యాత్మికంగా బలపడ్డాను, సంతోషంగా ఉంటున్నాను.”—ప్రసంగి 9:11; కీర్తన 145:18; 2 కొరింథీయులు 4:8, 9, 16.

దేవుడు కష్టాలను ఎందుకు ఉండనిచ్చాడు? కష్టాలను త్వరలో ఎలా తీసేస్తాడు? అనే విషయాలు మనసులో ఉంచుకుంటే మనకు దేవుని మీద ఏ అసంతృప్తి ఉన్నా పోతుంది. దేవుడు “తన్ను వెదకువారికి ఫలము దయచేయువాడనే” పూర్తి నమ్మకంతో ఉండవచ్చు. ఆయన మీద, ఆయన కుమారుడి మీద విశ్వాసముంచిన వాళ్లెవరూ నిరాశలో మిగిలిపోరు.—హెబ్రీయులు 11:6; రోమీయులు 10:11.▪ (w15-E 09/01)

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి