విషయసూచిక
జనవరి 15, 2015
© 2015 Watch Tower Bible and Tract Society of Pennsylvania
అధ్యయన ప్రతి
మార్చి 2-8, 2015
యెహోవాకు కృతజ్ఞతలు చెప్పండి, దీవెనలు పొందండి
మార్చి 9-15, 2015
మనం ప్రభువు రాత్రి భోజనాన్ని ఎందుకు ఆచరిస్తాం?
మార్చి 16-22, 2015
భార్యాభర్తలుగా సంతోషంగా ఉంటూ, మీ బంధాన్ని బలపర్చుకోండి
18వ పేజీ • పాటలు: 36, 51
మార్చి 23-29, 2015
యెహోవా సహాయంతో మీ వివాహ బంధాన్ని బలపర్చుకోండి, కాపాడుకోండి
23వ పేజీ • పాటలు: 26, 50
మార్చి 30, 2015 – ఏప్రిల్ 5, 2015
అధ్యయన ఆర్టికల్స్
▪ యెహోవాకు కృతజ్ఞతలు చెప్పండి, దీవెనలు పొందండి
యెహోవా మనకిచ్చిన ఆశీర్వాదాల గురించి ఆలోచిస్తూ, ఆయనకు కృతజ్ఞతలు చెప్తూవుంటే మనం కృతజ్ఞతా స్వభావాన్ని అలవర్చుకుంటాం, దాన్ని కాపాడుకుంటాం. యెహోవా మనకోసం చేసినవాటి పట్ల మనకు కృతజ్ఞత ఉన్నప్పుడు కష్టాలను తట్టుకోగలుగుతాం. ఈ విషయాన్నే 2015 వార్షికవచనం, మనకు ఈ సంవత్సరమంతా గుర్తు చేస్తుంది.
▪ మనం ప్రభువు రాత్రి భోజనాన్ని ఎందుకు ఆచరిస్తాం?
మనం యేసు మరణాన్ని ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలో ఈ ఆర్టికల్ వివరిస్తుంది. అంతేకాక, జ్ఞాపకార్థ ఆచరణలో ఉపయోగించే రొట్టె, ద్రాక్షారసం వేటికి సూచనగా ఉన్నాయో, వాటిని తీసుకోవాలా వద్దా అని ఒక వ్యక్తికి ఎలా తెలుస్తుందో కూడా ఈ ఆర్టికల్ వివరిస్తుంది. అలాగే ఆ ఆచరణ కోసం మనలో ప్రతీ ఒక్కరం ఎలా సిద్ధపడవచ్చో నేర్చుకుంటాం.
▪ భార్యాభర్తలుగా సంతోషంగా ఉంటూ, మీ బంధాన్ని బలపర్చుకోండి
▪ యెహోవా సహాయంతో మీ వివాహ బంధాన్ని బలపర్చుకోండి, కాపాడుకోండి
భార్యాభర్తలు అంతకంతకూ పెరిగిపోతున్న ఒత్తిళ్లతో, శోధనలతో పోరాడుతున్నారు. అయితే వాళ్లు యెహోవా సహాయంతో తమ బంధాన్ని బలపర్చుకుంటూ సంతోషంగా ఉండవచ్చు. అందుకోసం వాళ్లు చేయాల్సిన ఐదు పనుల గురించి మొదటి ఆర్టికల్‌లో చూస్తాం. వాళ్లు తమ వివాహ బంధాన్ని ఎలా కాపాడుకోవచ్చో రెండవ ఆర్టికల్‌లో చూస్తాం.
▪ ఎప్పటికీ చెక్కుచెదరని ప్రేమ నిజంగా ఉంటుందా?
స్త్రీపురుషుల మధ్య ఉండే నిజమైన ప్రేమ ఎలా ఉంటుంది? ఎప్పటికీ చెక్కుచెదరని ప్రేమ నిజంగా సాధ్యమేనా? అలాంటి ప్రేమను ఎలా వ్యక్తం చేయవచ్చు? ఎప్పటికీ నిలిచివుండే నిజమైన ప్రేమ గురించి పరమగీతము పుస్తకం ఏమి చెప్తుందో చూడండి.
ఇంకా ఈ సంచికలో
ముఖచిత్రం: అందమైన గ్రిండెల్‌వాల్డ్‌లో, బైబిల్ని చేత్తో పట్టుకుని సాక్ష్యమిస్తున్న దృశ్యం. వెనుక కనిపించేవి బెర్నీస్ ఆల్ప్స్ పర్వతాలు
స్విట్జర్లాండ్
జనాభా
78,76,000
ప్రచారకులు
18,646
జ్ఞాపకార్థ ఆచరణ హాజరు (2013)
31,980