కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • w14 12/15 పేజీలు 17-20
  • మీరు మనసు మార్చుకోవాలా?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • మీరు మనసు మార్చుకోవాలా?
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2014
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • మనసు మార్చుకోవడం ఎప్పుడు తప్పు?
  • మనసు మార్చుకోవడం గురించి ఎప్పుడు ఆలోచించవచ్చు?
  • మనసు మార్చుకోవడం ఎప్పుడు ఖచ్చితంగా అవసరం?
  • దేవుడు మనసు మార్చుకుంటాడా?
    బైబిలు ప్రశ్నలకు జవాబులు
  • మన సహోదర సహోదరీలు ఎవరు?
    గొప్ప బోధకుడు—ఆయన దగ్గర నేర్చుకోండి
  • దేవునిని ప్రేమించడం అంటే ఏమిటి?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1996
  • విభిన్న వైఖరులను పెంపొందించుకున్న సహోదరులు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2002
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2014
w14 12/15 పేజీలు 17-20
ఓ సినిమా హాలులోని వేర్వేరు సినిమాల పోస్టర్లను చూస్తున్న యువ క్రైస్తవులు

మీరు మనసు మార్చుకోవాలా?

కొంతమంది యౌవన క్రైస్తవులు సినిమాకు వెళ్లాలనుకున్నారు. స్కూల్లో వాళ్ల స్నేహితులు ఆ సినిమా చూసి చాలా బాగుందన్నారు. కానీ, హాలుకు వెళ్లి చూస్తే, ఆ సినిమా పోస్టర్లలో భయంకరమైన ఆయుధాలతోపాటు, చాలీచాలని బట్టలు వేసుకున్న అమ్మాయిలు కనిపిస్తున్నారు. ఇప్పుడు వాళ్లేమి చేస్తారు? ఏం ఫర్వాలేదులే అనుకుని ఆ సినిమా చూస్తారా?

పై సన్నివేశం చూపిస్తున్నట్లుగా మనం చాలాసార్లు నిర్ణయాలు తీసుకోవాల్సివస్తుంది. అవి మనల్ని యెహోవాకు దగ్గర చేయవచ్చు లేదా దూరం చేయవచ్చు. కొన్నిసార్లు మనం ఒక పని చేయాలనుకుంటాం, కానీ దానిగురించి బాగా ఆలోచించిన తర్వాత మనసు మార్చుకుంటాం. అంటే మనకు నిర్ణయాలు తీసుకోవడం రాదని దానర్థమా? లేదా మనసు మార్చుకుని మంచి పనే చేశామా?

మనసు మార్చుకోవడం ఎప్పుడు తప్పు?

మనం యెహోవాను ప్రేమిస్తున్నాం కాబట్టే ఆయనకు మన జీవితాన్ని సమర్పించుకుని, బాప్తిస్మం తీసుకున్నాం. దేవునికి ఎల్లప్పుడూ నమ్మకంగా ఉండాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుంటాం. కానీ మన శత్రువైన సాతాను మన యథార్థతను పాడుచేయాలని కంకణం కట్టుకున్నాడు. (ప్రక. 12:17) అయితే యెహోవాను సేవించాలని, ఆయన ఆజ్ఞలకు లోబడాలని మనం నిర్ణయించుకున్నాం. అలా నిర్ణయించుకున్నాక మనసు మార్చుకుంటే మనం మన ప్రాణాన్నే కోల్పోవచ్చు.

సుమారు 2,600 సంవత్సరాల క్రితం, బబులోను రాజైన నెబుకద్నెజరు ఓ పెద్ద బంగారు విగ్రహాన్ని నిలబెట్టించి, అందరు దానికి సాగిలపడి మొక్కాలని ఆజ్ఞాపించాడు. అలా చేయని వాళ్లను మండుతున్న అగ్నిగుండంలో పడేస్తారు. షద్రకు, మేషాకు, అబేద్నెగో అనే ముగ్గురు యెహోవా ఆరాధకులు మాత్రం ఆ ఆజ్ఞకు లోబడలేదు. విగ్రహానికి నమస్కరించని ఆ ముగ్గురిని మండుతున్న అగ్నిగుండంలో పడేశారు. యెహోవా వాళ్లను అద్భుత రీతిలో రక్షించాడు. అయితే వాళ్లు దేవుణ్ణి సేవించే విషయంలో రాజీపడకుండా తమ ప్రాణాలు వదులుకోవడానికి కూడా సిద్ధపడ్డారు.—దాని. 3:1-27.

దానియేలు ప్రవక్త విషయానికి వస్తే, సింహాల గుహలో పడేస్తారని బెదిరించినా ఆయన ప్రార్థన చేయడం మానలేదు. రోజుకు మూడుసార్లు యెహోవాకు ప్రార్థిస్తూనే ఉన్నాడు. సత్య దేవుణ్ణి ఆరాధించే విషయంలో ఆయన తన మనసు మార్చుకోలేదు. అందుకే, “సింహముల నోటనుండి” దేవుడు ఆయనను రక్షించాడు.—దాని. 6:1-27.

మన కాలంలో కూడా దేవుని ప్రజలు తమ సమర్పణకు తగ్గట్లు జీవిస్తున్నారు. ఆఫ్రికాలో, యెహోవాసాక్షులైన కొంతమంది స్కూల్‌ పిల్లలు జాతీయ చిహ్నానికి మొక్కే వేడుకలో పాల్గొనలేదు. స్కూల్‌ నుంచి తీసేస్తామని బెదిరించినా వాళ్లు రాజీపడలేదు. కొంతకాలానికి, విద్యాశాఖ మంత్రి ఆ ఊరుకు వచ్చినప్పుడు ఆ సాక్షులతో మాట్లాడాడు. ఆ పిల్లలు తమ నమ్మకాల గురించి మర్యాదగా, భయపడకుండా ఆయనకు వివరించారు. దాంతో ఆ తర్వాత నుండి సాక్షుల పిల్లలకు మళ్లీ అలాంటి ఒత్తిడి ఎదురవ్వలేదు. ఇప్పుడా పిల్లలు యెహోవాకు ఇష్టం లేనివాటిని చేయాలనే ఒత్తిడి లేకుండా స్వేచ్ఛగా స్కూల్‌కు వెళ్లగలుగుతున్నారు.

జోసెఫ్‌ విషయమే తీసుకోండి. ఆయన భార్య క్యాన్సర్‌తో అకస్మాత్తుగా చనిపోయింది. ఆమెకు అంత్యక్రియలు ఎలా చేయాలో నిర్ణయించే హక్కు జోసెఫ్‌కు ఉందని ఆయన బంధువులు అర్థం చేసుకున్నారు. అయితే భార్య తరఫువాళ్లు సత్యంలో లేరు. వాళ్లు అంత్యక్రియలకు సంబంధించిన కొన్ని ఆచారాలు చేయాలని కోరుకున్నారు. వాటిలో కొన్ని యెహోవాకు ఇష్టంలేనివి. జోసెఫ్‌ ఇలా చెబుతున్నాడు, “నేను నా మనసు మార్చుకోకపోవడంతో, వాళ్లు నా పిల్లలమీద ఒత్తిడి తీసుకొచ్చారు. కానీ పిల్లలు కూడా ఏమాత్రం ఒప్పుకోలేదు. అంత్యక్రియలకు సంబంధించిన ఓ ఆచారాన్ని మా ఇంట్లో చేయాలని కూడా మా బంధువులు ప్రయత్నించారు. అయితే అలాంటి ఆచారాన్ని మా ఇంట్లో చేయడానికి ఒప్పుకోనని చెప్పాను. అది నా నమ్మకాలకు, చనిపోయిన నా భార్య నమ్మకాలకు విరుద్ధమైనదని వాళ్లకు తెలుసు. చివరికి తీవ్రమైన వాదనల తర్వాత వాళ్లు వేరే స్థలంలో దాన్ని ఏర్పాటు చేసుకున్నారు.”

“ఎంతో దుఃఖంతో ఉన్న ఆ సమయంలో, నా కుటుంబం యెహోవా నియమాలను మీరకుండా ఉండేందుకు సహాయం చేయమని నేను ఆయనను వేడుకున్నాను. ఆయన నా ప్రార్థనలను విని, ఒత్తిడిని తట్టుకొని నిలబడేందుకు సహాయం చేశాడు.” జోసెఫ్‌, ఆయన పిల్లలు యెహోవాకు లోబడే విషయంలో మనసు మార్చుకోవాలని ఎప్పుడూ అనుకోలేదు.

మనసు మార్చుకోవడం గురించి ఎప్పుడు ఆలోచించవచ్చు?

సా.శ. 32 పస్కా పండుగ తర్వాత, సీదోను ప్రాంతంలో ఉన్న యేసుక్రీస్తు దగ్గరకు ఒక సురోఫెనికయ మహిళ వచ్చింది. ఆమె తన కూతురికి పట్టిన దయ్యాన్ని వదిలించమని చాలాసార్లు యేసును ప్రాధేయపడింది. కానీ, యేసు ఆమెతో ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఆయన తన శిష్యులతో, “ఇశ్రాయేలు ఇంటివారై నశించిన గొఱ్ఱెలయొద్దకే గాని మరి ఎవరియొద్దకును నేను పంపబడలేదు” అని అన్నాడు. అయితే ఆమె మళ్లీమళ్లీ అడగడంతో, “పిల్లలరొట్టె తీసికొని కుక్కపిల్లలకు వేయుట యుక్తము కాదు” అని యేసు అన్నాడు. దానికి ఆమె, తనకు ఎంత విశ్వాసముందో చూపిస్తూ ఇలా జవాబిచ్చింది, “నిజమే ప్రభువా, కుక్కపిల్లలుకూడ తమ యజమానుల బల్లమీదనుండి పడు ముక్కలు తినును గదా.” అప్పుడు యేసు మనసు మార్చుకుని, ఆమె కూతుర్ని స్వస్థపరిచాడు.—మత్త. 15:21-28.

అలా, పరిస్థితుల్ని బట్టి మనసు మార్చుకోవడానికి ఇష్టపడడం ద్వారా యేసు యెహోవాను అనుకరించాడు. ఉదాహరణకు, ఇశ్రాయేలీయులు బంగారు దూడను చేసినప్పుడు, దేవుడు వాళ్లను నాశనం చేయాలనుకున్నాడు. కానీ ఆ నిర్ణయం గురించి మోషే వేడుకున్నప్పుడు, ఆయన మనసు మార్చుకున్నాడు.—నిర్గ. 32:7-14.

పౌలు యెహోవాను, యేసును అనుకరించాడు. మొదటి మిషనరీ యాత్ర మధ్యలో, మార్కు పౌలును, బర్నాబాను వదిలేసి వెళ్లిపోయాడు. అందుకే పౌలు మిగతా మిషనరీ యాత్రలకు మార్కును తీసుకెళ్లకూడదనుకున్నాడు. అయితే మార్కు మారాడని, తనకు బాగా సహాయపడతాడని పౌలు ఆ తర్వాత గ్రహించాడు. అందుకే పౌలు తిమోతితో ఇలా అన్నాడు, “మార్కును వెంటబెట్టుకొని రమ్ము, అతడు పరిచారము నిమిత్తము నాకు ప్రయోజనకరమైనవాడు.”—2 తిమో. 4:11.

మరి మన సంగతేంటి? జాలి, ఓర్పు, ప్రేమగల మన పరలోక తండ్రిలాగే మనం కూడా అవసరమైతే మనసు మార్చుకోవాలి. మనం కొన్నిసార్లు వేరేవాళ్ల విషయంలో మన అభిప్రాయాన్ని మార్చుకోవాల్సి రావచ్చు. మనం యెహోవాలా, యేసులా పరిపూర్ణులం కాదు. వాళ్లే మనసు మార్చుకోవడానికి ఇష్టపడితే, ఇతరుల పరిస్థితులను అర్థం చేసుకుని మనం మనసు మార్చుకోవద్దా?

ఆధ్యాత్మిక లక్ష్యాల విషయంలో మన మనసు మార్చుకోవడం మంచిదే. కొంతకాలంగా బైబిలు అధ్యయనం చేస్తూ కూటాలకు హాజరౌతున్న కొందరు బాప్తిస్మం తీసుకోవడానికి వెనుకాడుతుండవచ్చు. లేదా మరికొందరు సహోదరులు పయినీరు సేవ ద్వారా మరింతగా పరిచర్య చేసే అవకాశమున్నా, ఆ సేవ చేయడానికి ముందుకురాకపోవచ్చు. ఇంకొంతమంది సహోదరులైతే, సంఘ బాధ్యతల కోసం అర్హత సంపాదించడానికి అంతగా ఆసక్తి చూపించకపోవచ్చు. (1 తిమో. 3:1) మీరు ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నారా? అయితే, ఆ సేవావకాశాలను సంపాదించుకోమని యెహోవా మిమ్మల్ని ప్రేమగా ఆహ్వానిస్తున్నాడు. కాబట్టి మీ మనసు మార్చుకుని, దేవునికీ ఇతరులకూ సంతోషంగా సేవ చేయండి.

బోర్డు గేమ్‌ ఆడుతూ సరదాగా సమయ గడుపుతున్న యువ క్రైస్తవులు

మనసు మార్చుకుంటే ఆశీర్వాదాలు పొందుతాం

ఆఫ్రికాలోని ఓ యెహోవాసాక్షుల బ్రాంచి కార్యాలయంలో సేవ చేస్తున్న ఎల్లా అనే సహోదరి తన సేవ గురించి ఇలా చెబుతుంది, “బెతెల్‌కు వచ్చిన మొదట్లో, ఎక్కువ కాలం ఇక్కడ ఉంటానో లేదో నాకు తెలీదు. నేను హృదయపూర్వకంగా యెహోవాను సేవించాలని కోరుకున్నాను, కానీ మా కుటుంబం అంటే కూడా నాకు చాలా ఇష్టం. బెతెల్‌కు వచ్చిన కొత్తలో మా ఇంట్లోవాళ్లు బాగా గుర్తొచ్చేవాళ్లు. కానీ నాతోపాటు ఉన్న సహోదరి నన్ను చాలా ప్రోత్సహించింది. కాబట్టి నేను ఇక్కడే ఉండాలని నిశ్చయించుకున్నాను. బెతెల్‌లో పది సంవత్సరాలు సేవ చేశాక, ఇక్కడే ఉంటూ వీలైనంత ఎక్కువకాలం నా సహోదరసహోదరీలకు సేవ చేస్తూ ఉండాలని అనిపిస్తుంది.”

మనసు మార్చుకోవడం ఎప్పుడు ఖచ్చితంగా అవసరం?

కొన్నిసార్లు మనం తప్పకుండా మనసు మార్చుకోవాలి. ఉదాహరణకు, కయీను తన తమ్ముడి మీద అసూయపడి విపరీతమైన కోపాన్ని పెంచుకున్నాడు. కయీను పాపం చేయబోతున్నాడని యెహోవా గమనించి, కోపాన్ని అదుపులో ఉంచుకోమని అతన్ని హెచ్చరించాడు. కయీను “వాకిట పాపము పొంచియుండును” అని యెహోవా చెప్పాడు. అయితే కయీను తన మనసును, వైఖరిని మార్చుకునే బదులు దేవుని హెచ్చరికను పెడచెవిన పెట్టాడు. విచారకరంగా, కయీను తన తమ్ముణ్ణి చంపేశాడు, అలా మానవ చరిత్రలో మొట్టమొదటి హంతకుడు అయ్యాడు.—ఆది. 4:2-8.

కయీను

కయీను తన మనసు మార్చుకుని ఉంటే?

రాజైన ఉజ్జియా ఉదాహరణ కూడా గమనించండి. మొదట్లో ఆయన యెహోవా మాట విన్నాడు. దేవునితో ఆయనకు మంచి సంబంధం ఉండేది. కానీ ఆ తర్వాత, ఆయనలో గర్వం పెరిగింది. ఆయన యాజకుడు కాకపోయినా ధూపం వేయడానికి ఆలయంలోకి వెళ్లాడు. అలా చేయొద్దని యాజకులు హెచ్చరించినా ఆయన అహంకారంతో తన మనసు మార్చుకోలేదు. బదులుగా ఆయన “రౌద్రుడై,” వాళ్ల మాటల్ని పట్టించుకోలేదు. దాంతో, యెహోవా ఆయనను కుష్ఠు రోగంతో శిక్షించాడు.—2 దిన. 26:3-5, 16-20.

అవును, కొన్నిసార్లు మనం మన మనసును ఖచ్చితంగా మార్చుకోవాలి. ఈ ఉదాహరణను గమనించండి. జొకీమ్‌ 1955లో బాప్తిస్మం తీసుకున్నాడు. అయితే ఆయన 1978లో సంఘం నుండి బహిష్కరించబడ్డాడు. దాదాపు 20 సంవత్సరాల తర్వాత, పశ్చాత్తాపపడి మళ్లీ సంఘంలోకి వచ్చాడు. తిరిగి రావడానికి ఇంతకాలం ఎందుకు తీసుకున్నావని ఓ సంఘపెద్ద ఆయనను అడిగినప్పుడు జొకీమ్‌ ఇలా చెప్పాడు, ‘నాకు అప్పుడు చాలా కోపం వచ్చింది, పైగా అహం అడ్డు వచ్చింది. కానీ ఇంతకాలం ఆగినందుకు నాకిప్పుడు బాధగా ఉంది. నేను బహిష్కరించబడినా, యెహోవా సాక్షులు సత్యం బోధిస్తారని నాకు తెలుసు.’

కొన్నిసార్లు మనం కూడా మన మనసును, ప్రవర్తనను మార్చుకోవాల్సి రావచ్చు. మనం అలా మార్చుకోవడానికి ఇష్టపడితే యెహోవా ఎంతో సంతోషిస్తాడు.—కీర్త. 34:8.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి